Photo Credit: Poco
భారత్‌లో Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ గొప్పగా ప్రారంభమైంది. రాబోయే పండుగ సీజన్‌కు ముందే ఈ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలతోసహా అనేక రకాల వస్తువులపై కళ్లుచెదిరే డీల్‌లు, ఆఫర్‌లను పరిచయం చేసింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు 40 శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమైన డీల్‌లలో ఒకటిగా iPhone 13 గురించి చెప్పుకోవాలి. దీనిని అన్ని ఆఫర్‌లు కలుపుకొని కేలవం రూ. 40,499లకే సొంతం చేసుకోవచ్చు. Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ ప్రత్యేకంగా సామాన్యులకు సైతం బడ్జెట్ ధరల్లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లను చేరువ చేసేందేకే వచ్చిద్దా? అన్నట్లు ఈ ఫ్లాట్‌ఫారమ్‌లో ఆఫర్‌లను ప్రకటించింది.
తక్కువ ధరల్లోని స్మార్ట్‌ఫోన్ తీసుకోవాలని మీ మనస్సులో ఉంటే, అందుకు తగ్గట్టుగా రూ. 20000లోపు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లపై ఉన్న అత్యుత్తమ డీల్‌లను ఇక్కడ అందిస్తున్నాము. ఈ జాబితాలో iQOO, Realme, OnePlus, Samsung వంటి బ్రాండెడ్ కంపెనీలు అందించే ఆఫర్‌లను చూడొచ్చు. ఈ ప్రత్యేకమైన డీల్స్ అన్నీ కూడా Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటాయని మర్చిపోవద్దు.
ఈ Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌లో కొనుగోలుదారులు గొప్ప డిస్కౌంట్‌లతో పాటు SBI డెబిట్, క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 29,750 షాపింగ్ చేసినవారు 10 శాతం తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. అంతేకాదు, కొనుగోలు సమయంలో పూర్తి చెల్లింపులు చేయకుండా.. నిబంధనలు, షరతులకు లోబడి సౌకర్యవంతమైన EMI ఎంపికలను పొందవచ్చు. OnePlus Nord CE 4 Lite 5Gపై మంచి డీల్ అందుబాటులో ఉంది. దీనిని ఈ సేల్‌లో రూ.16,999లకి సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఎమ్మార్పీ ధర రూ. 20,999గా ఉంది. అంతేకాదు, ఈ డీల్‌లో రూ. 1299లు విలువ గల OnePlus Bullet Z2ను ఉచితంగా పొందవచ్చు.
ప్రకటన
ప్రకటన