Photo Credit: Amazon
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ రాబోయే పండగ సీజన్‌కు ముందే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌ను ప్రకటించింది. అయితే, ఖచ్చితమైన తేదీలు ఇంకా వెల్లడించనప్పటికీ, అమెజాన్ తమ వెబ్‌సైట్‌లో కొన్ని డిస్కౌంట్ ఆఫర్‌లను టీజ్ చేసింది. కొనుగోలుదారులు ల్యాప్‌టాప్‌లపై 45 శాతం వరకు, ఎలక్ట్రానిక్స్ మరియు గృహ ఉపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. అలాగే, ప్రైమ్ సభ్యులు, SBI కార్డ్ వినియోగదారులకు అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. సెప్టెంబర్ చివరిలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 ప్రారంభం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అమెజాన్ ఇతర ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, మొబైల్‌లు మరియు గేమింగ్ పరికరాల వంటి వివిధ ఉత్పత్తులపై తగ్గింపులను సూచించే ప్రత్యేక మైక్రోసైట్‌ను రూపొందించింది. Apple, Samsung, Dell, Amazfit, Sony, Xiaomi వంటి గ్లోబల్ బ్రాండ్‌లపై ఆశ్చర్యకరమైన తగ్గింపు ధరలు ఉండబోతున్నాయి. అదనంగా Boat వంటి దేశీయ బ్రాండ్‌ల ఉత్పత్తులపై కూడా డిస్కౌంట్‌లు అందించబడతాయి. ఈ సేల్ సందర్భంగా అలెక్సా, ఫైర్ టీవీ, కిండ్ల్ డివైజ్ వంటి ఉత్పత్తులపై మంచి ఆఫర్‌లు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత సేల్‌లలో కూడా ఇదే తరహాలో ఆఫర్‌లను అమెజాన్ ప్రకటించింది. ఈసారి మరిన్ని ఆఫర్‌లను అందించే అవకాశం ఉన్నట్లు కొనుగోలుదారులు ఆశిస్తున్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుతో ఈ-కామర్స్ దిగ్గజం భాగస్వామ్యం కావడంతో SBI క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసే కొనుగోలుదారులకు ఉత్పత్తులపై 10 శాతం డిస్కౌంట్ పొందగలుగుతారు. అలాగే, ట్యాబ్‌లపై 60 శాతం వరకు, మొబైల్‌లు మరియు ఉపకరణాలపై 40 శాతం వరకు, హెడ్‌ఫోన్‌లపై 70 శాతం వరకు, స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్‌లపై 60 శాతం వరకు ఆఫర్‌లను అందించే డీల్‌లు ఈ సేల్‌లో ఉన్నాయి. అంతేకాదు, ఎలక్ట్రానిక్స్‌తో పాటు విమాన టిక్కెట్లు, రైలు మరియు బస్సు ఛార్జీలు మరియు హోటల్ బుకింగ్‌లతో సహా ప్రయాణ బుకింగ్‌లపై కూడా కస్టమర్లు తగ్గింపును పొందవచ్చని అమెజాన్ ప్రకటించింది. దీని ద్వారా ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునేవారికి మంచి ప్రయోజనం ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న కస్టమర్‌లు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ తేదీకి ఒక రోజు ముందే యాక్సెస్ పొందుతారు. అదనపు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMIలు వంటి ప్రయోజనాలను పొందవచ్చు. ఇంకా, అమెజాన్ పే, పే లేటర్ ఆధారిత చెల్లింపులకు ఆఫర్లు, కూపన్ డిస్కౌంట్ కూడా సేల్ సమయంలో అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే సెప్టెంబర్ 27 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ డేస్ సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఏటా నిర్వహించే ఈ బిగ్ డేస్ సేల్ గతంలో కంటే ముందస్తుగానే కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024కు సంబంధించిన పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో తెలియనున్నాయి.
ప్రకటన
ప్రకటన