Photo Credit: Realmi
భారత్‌లో టాప్-ఎండ్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ నుండి బడ్జెట్ ఫ్రెండ్లీ Lava O3 వరకు స్మార్ట్ ఫోన్‌లపై అనేక డీల్స్, డిస్కౌంట్‌లతోఅమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే 2025 సేల్ ప్రారంభమైంది. ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌లకు 12 గంటల ముందస్తు యాక్సెస్‌ను అందించిన తర్వాత ఈ సేల్ జనవరి 13 మధ్యాహ్నం 12 గంటలకు మొదలైంది. సేల్‌లో సాధారణ డిస్కౌంట్‌లతో పాటు సేల్ సమయంలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి చేసిన కొనుగోళ్లపై 10 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే 2025 సేల్ సందర్భంగా రియల్‌మీ, రెడ్‌మీ, ఐటెల్ వంటి బ్రాండ్‌ల నుండి స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. మరెందుకు ఆలస్యం, అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే 2025 సేల్‌లో బడ్జెట్ ఫోన్‌లపై ఉన్న గొప్ప ఆఫర్‌లను చూసేద్దామా?!
తక్కువ ధరలలో మంచి ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్న కొనుగోలుదారులు ప్రస్తుతం జరుగుతున్న అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఈ సేల్‌లో అన్ని డీల్స్‌లో కంటే అత్యంత ముఖ్యమైన ఆఫర్ Redmi A4 5G స్మార్ట్ ఫోన్. నిజానికి, దీని అసలు ధర రూ. 11,999 ఉండగా రూ. 9,499లకు లభిస్తోంది. కొనుగోలుదారులు కూపన్ డిస్కౌంట్‌ను అటాచ్ చేయడం ద్వారా రూ. 8,999కే ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్ సేల్ సమయంలో కొనుగోలుదారులు Realme Narzo N61ని కేవలం రూ. 7,498 ధరకే పొందొచ్చు. దీని అసలు ధర రూ. 8,999గా ఉంది. అలాగే, సాధారణ తగ్గింపు ధరతో పాటు, SBI క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలపై కొనుగోలుదారులు 10 శాతం తక్షణ తగ్గింపును కూడా పొందొచ్చు. క్రెడిట్ కార్డ్ EMIని ఎంచుకునే వారికి ఇలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకా, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లు, నో-కాస్ట్ EMI ఆఫర్‌లు వంటివి ఉన్నాయి. ఇలాంటి గొప్ప అవకాశాలు కల్పిస్తుండడంతో గతంలోకంటే కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ప్రకటన
ప్రకటన