2025లో ఆపిల్ మరోసారి తన ప్రో మోడళ్లలో టెలిఫోటో కెమెరాలను అప్‌గ్రేడ్ చేయబోతోందని లీక్‌లు సూచిస్తున్నాయి.
Photo Credit: Apple
ఐఫోన్ 17 ప్రో యొక్క కెమెరా ద్వీపం ఈ సంవత్సరం పెద్ద పునరుద్ధరణకు లోనవుతుందని భావిస్తున్నారు
ఆపిల్ యొక్క వార్షిక హార్డ్వేర్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 9న జరగనుంది. ఈ ఏడాది కీనోట్‌కు ‘అవే డ్రాపింగ్' అని పేరు పెట్టడం, ఆపిల్ నుండి రానున్న పరికరాలపై టెక్ ప్రేమికుల్లో ఆసక్తిని మరింత పెంచింది. ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచేది కూపర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఆవిష్కరించబోతున్న కొత్త తరం ఐఫోన్ సిరీస్. ముఖ్యంగా, గెలాక్సీ S25 ఎడ్జ్‌కు పోటీగా రానున్న iPhone 17 Air పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అయితే, iPhone 17 Pro మరియు iPhone 17 Pro Max మోడళ్లు కూడా పలు కీలకమైన అప్‌గ్రేడ్స్‌ను పొందబోతున్నట్లు సమాచారం. కొత్త ఫీచర్లపై టెక్ ప్రపంచంలో ఉత్సాహం గరిష్ట స్థాయికి చేరుకుంది. లీక్ అయిన వివరాల ప్రకారం ఐఫోన్ 17 ప్రో మోడళ్లలో ఉండబోతున్న ఐదు ప్రధాన మార్పులు ఇవే.
2025లో ఆపిల్ మరోసారి తన ప్రో మోడళ్లలో టెలిఫోటో కెమెరాలను అప్‌గ్రేడ్ చేయబోతోందని లీక్‌లు సూచిస్తున్నాయి. గత ఏడాది iPhone 16 Proలో 5X టెలిఫోటో సెన్సార్‌ను పరిచయం చేసిన తర్వాత, ఈసారి iPhone 17 Pro మరియు Pro Max మోడళ్లలో 8X ఆప్టికల్ జూమ్ సపోర్ట్ అందించే కొత్త టెలిఫోటో సెన్సార్ రానుంది. ఈసారి రిజల్యూషన్‌ను కూడా 48 మెగాపిక్సెల్స్‌కు పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో మూడు కెమెరాలూ 48MP కలిగిన మొదటి ఐఫోన్ మోడళ్లు ఇవే కానున్నాయి. ప్రస్తుతం ఉన్న iPhone 16 Pro మోడళ్లలో 12MP టెలిఫోటో లెన్స్ మాత్రమే ఉండగా, గరిష్టంగా 5X జూమ్ వరకు సపోర్ట్ చేస్తుంది.
కొత్త ప్రో మోడళ్లలో వేడి నియంత్రణలో కూడా పెద్ద మార్పులు రాబోతున్నాయి. గత ఏడాది ఆపిల్ గ్రాఫిన్ ఆధారిత థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను పరిచయం చేసింది. ఈసారి దానిని మరింత అప్‌గ్రేడ్ చేస్తూ వెపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అందించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.ఇది ఫోన్ పనితీరు తగ్గకుండా ఎక్కువసేపు నిరాటంకంగా పని చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా కొత్త A19 Pro చిప్ తో కలిపి వస్తే, హీట్ థ్రాట్లింగ్ సమస్యలను గణనీయంగా తగ్గించగలదని అంచనా.
iPhone 17 Pro Maxలో ఇప్పటి వరకు ఏ ఐఫోన్‌లోనూ లేని భారీ బ్యాటరీ ఉండబోతోందని లీక్‌లు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం దీని సామర్థ్యం 5,000mAh దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం iPhone 16 Pro Maxలో సుమారు 4,685mAh బ్యాటరీ ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
iPhone 17 Pro మోడళ్లలో రూపకల్పనలో కూడా కీలక మార్పులు జరగనున్నాయి. గత రెండు తరం మోడళ్లలో వాడిన టైటానియం స్థానంలో మళ్లీ అల్యూమినియం వాడనున్నట్లు తెలుస్తోంది. ఈసారి వెనుక భాగాన్ని అర్ధభాగం గ్లాస్, అర్ధభాగం అల్యూమినియంతో రూపొందించనున్నారు. కెమెరా ఐలాండ్ రూపకల్పన పూర్తిగా కొత్తగా, చతురస్రాకారంలో హారిజాంటల్‌గా పైభాగమంతా విస్తరించేలా ఉండనుంది.
iPhone 17 Pro సిరీస్‌తో పాటు Air మరియు స్టాండర్డ్ మోడళ్లలో కూడా కొత్త 24MP సెల్ఫీ కెమెరా రావచ్చని రిపోర్టులు చెబుతున్నాయి. ఇది గతకొన్నేళ్లుగా ఉన్న 12MP ఫ్రంట్ కెమెరా కన్నా రెట్టింపు సామర్థ్యం కలిగినదిగా ఉండనుంది.
ప్రకటన
ప్రకటన