ఇప్పటివరకు వచ్చిన అన్ని iPhone మోడళ్లలోకెల్లా ఇది అత్యంత సన్నని మోడల్.
Photo Credit: Apple
ఐఫోన్ ఎయిర్ నాలుగు రంగులలో లభిస్తుంది
కేలిఫోర్నియాలో జరిగిన ‘అవే డ్రాపింగ్ ' ఈవెంట్‌లో ఆపిల్ తమ కొత్త మోడల్ iPhone Air ను అధికారికంగా ఆవిష్కరించింది. గత ఏడాది వచ్చిన iPhone 16 Plus కి బదులుగా వచ్చిన ఈ కొత్త మోడల్, iPhone 17 సిరీస్‌లోని అన్ని ఫీచర్లతో పాటు మరింత సన్నని డిజైన్‌లో అందుబాటులోకి వచ్చింది. సామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ తో నేరుగా పోటీ చేసే ఈ స్మార్ట్‌ఫోన్, అల్ట్రా-స్లిమ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కి ప్రత్యేకంగా రూపకల్పన చేయబడింది.ధరలు మరియు లభ్యత,అమెరికాలో iPhone Air ధర $999 (దాదాపు రూ.88,100) నుంచి ప్రారంభమవుతుంది. ఇది 256GB స్టోరేజ్‌తో వస్తుంది. అలాగే 512GB మరియు 1TB వేరియంట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫోన్‌ను స్కై బ్లూ, లైట్ గోల్డ్, క్లౌడ్ వైట్, స్పేస్ బ్లాక్ అనే నాలుగు రంగుల్లో అందిస్తున్నారు.భారత మార్కెట్లో iPhone Air ధర రూ. 1,19,900 నుంచి ప్రారంభమవుతుంది. 512GB వేరియంట్ ధర రూ.1,39,900, 1TB వేరియంట్ ధర రూ.1,59,900గా నిర్ణయించారు. సెప్టెంబర్ 12 నుండి ప్రీ-ఆర్డర్ చేయొచ్చు. డెలివరీలు సెప్టెంబర్ 19 నుంచి మొదలవుతాయి.
iPhone Air పూర్తిగా eSIM-only మోడల్‌గా వస్తుంది. ఇది తాజా iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. ఫోన్‌లో 6.5-అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లే ఉంది. గరిష్టంగా 3,000 nits బ్రైట్నెస్‌తో పాటు ప్రోమోషన్ సపోర్ట్ కూడా ఉంది. వినియోగం ఆధారంగా 10Hz నుంచి 120Hz వరకు రిఫ్రెష్ రేటు మారుతుంది.
ఇప్పటివరకు వచ్చిన అన్ని iPhone మోడళ్లలోకెల్లా ఇది అత్యంత సన్నని మోడల్. దీని మందం కేవలం 5.6mm మాత్రమే. ఈ ఫోన్ 80 శాతం రీసైకిల్ చేసిన టైటానియంతో తయారైంది. ముందూ, వెనకా సెరమిక్ షీల్డ్ 2 గ్లాస్‌ను ఉపయోగించారు. ఆపిల్ ప్రకారం, దీని వలన క్రాక్స్ రాకుండా ఫోన్ నాలుగు రెట్లు బలంగా ఉంటుంది.
పర్ఫార్మెన్స్ పరంగా, iPhone Air కూడా A19 Pro SoC తో వస్తుంది. ఇందులో ఆరు కోర్ CPU, ఆరు కోర్ GPU, 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ఉన్నాయి. రెండో తరం డైనమిక్ కేచింగ్ సాంకేతికతను ఉపయోగించడం వలన ప్రాసెసింగ్ మరింత వేగంగా జరుగుతుంది. కొత్తగా వచ్చిన యాపిల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లకు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.కనెక్టివిటీ కోసం కొత్త N1 చిప్ ని జోడించారు. ఇది Wi-Fi 7, Bluetooth 6 మరియు థ్రెడ్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా కొత్త C1X మోడమ్ వలన నెట్‌వర్క్ స్పీడ్ రెండింతలు పెరుగుతుందని కంపెనీ చెబుతోంది.
కెమెరా పరంగా, iPhone Air లో కూడా 48MP ఫ్యూజన్ మైన్ కెమెరా ఉంది. ఇందులో సెన్సార్-షిఫ్ట్ OIS, f/1.6 అపర్చర్, అలాగే 2X టెలిఫోటో సపోర్ట్ ఉన్నాయి. ముందు భాగంలో 18MP సెంటర్ స్టేజ్ కెమెరాని అందించారు.
బ్యాటరీ స్పెసిఫికేషన్‌ను ఆపిల్ వివరించకపోయినా, "ఆల్-డే" బ్యాటరీ లైఫ్ ఇస్తుందని చెబుతోంది. వీడియో ప్లేబ్యాక్‌లో ఇది గరిష్టంగా 27 గంటల వరకు పనిచేస్తుంది. కేవలం 30 నిమిషాల్లో 50 శాతం వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ప్రకటన
ప్రకటన