Photo Credit: Redmi
భారతీయ మొబైల్ మార్కెట్‌లోకి Redmi 14C 5G హ్యాండ్‌సెట్ అడుగుపెట్టింది. Xiaomi సబ్-బ్రాండ్ కొత్త 5G స్మార్ట్ ఫోన్ గ్లాస్ బ్యాక్‌తో మూడు కలర్ ఆప్షన్‌లలో రానుంది. ఇది 120Hz రిజల్యూషన్‌తో 6.88-అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది. అలాగే, Redmi 14C 5G ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌తో అమర్చబడి 5,160mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీని అందించారు. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ హెడ్‌లైన్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో రూపొందించారు.
దేశీయ మార్కెట్‌లో Redmi 14C 5G ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ 9999గా నిర్ణయించారు. అలాగే, 4GB + 128GB, 6GB + 128GB RAM స్టోరేజ్ మోడల్‌ల ధరలు వరుసగా రూ. 10,999, రూ. 11,999గా ఉన్నాయి. ఇది స్టార్‌లైట్ బ్లూ, స్టార్‌డస్ట్ పర్పుల్, స్టార్‌గేజ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. కొనుగోలు చేసేందుకు Amazon, Flipkart, Mi.com, Xiaomi రిటైల్ స్టోర్‌ల ద్వారా జనవరి 10 మధ్యాహ్నం 12:00 గంటలకు అందుబాటులోకి రానున్నాయి.
ఈ Redmi 14C 5G డ్యూయల్ సిమ్, కంపెనీ HyperOSతో Android 14 పై రన్ అవుతోంది. కంపెనీ ఈ ఫోన్ కోసం రెండు ప్రధాన OS అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందించనున్నట్లు స్పష్టం చేసింది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.88-అంగుళాల HD+ (720x1640 పిక్సెల్‌లు) LCDని కలిగి ఉంటుంది. ఇది అండర్ ది హుడ్ 4nm స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌తో వస్తోంది. గరిష్టంగా 6GB వరకు LPDDR4X RAMతో అటాచ్ చేయబడి ఉంటుంది. ఆన్‌బోర్డ్ RAMను వర్చువల్‌గా 12GB వరకు పెంచుకునే అవకాశం ఉంది.
దీనికి ఫోటోలు, వీడియోల కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో f/1.8 ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దుమ్ము, స్ప్లాష్ నియంత్రణ కోసం IP52 రేటింగ్‌ను కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే.. బ్లూటూత్, GPS, గ్లోనాస్, గెలీలియో, బీడౌ, Wi-Fi, 3.5mm ఆడియో జాక్, USB టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి.
Redmi 14C 5G ఫోన్ 5,160mAh బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బోర్డులోని సెన్సార్‌లలో యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, వర్చువల్ సామీప్య సెన్సార్, ఈ-కంపాస్‌లను అందించారు. అలాగే, ఫోన్ బాక్స్‌లో రూ.1999 విలువైన 33W ఇన్‌బాక్స్ ఛార్జర్‌తో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే బ్యాటరీ గరిష్టంగా 21 రోజుల స్టాండ్‌బై సమయాన్ని, గరిష్టంగా 139 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుందని కంపెనీ ప్రచారం చేస్తోంది.
ces_story_below_text
ప్రకటన
ప్రకటన