అంబ్రేన్ 20000mAh పాకెట్ సైజ్ పవర్ బ్యాంక్ సేల్‌లో రూ.1,599 ధరకు అందుబాటులో ఉంది.
Photo Credit: Pexels/DEBRAJ ROY
Ambrane 20000mAh Power Bank
Amazon Great Freedom Sale: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్వహిస్తున్న గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 ముగింపు దశకు చేరుకుంది. ఈరోజే కొనుగోలు చేయడానికి చివరి అవకాశం కావడంతో ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. మీ వద్ద ఉన్న స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్ వంటి గ్యాడ్జెట్లను రీఛార్జ్ చేయడానికి అనువైన 20000mAh భారీ కెపాసిటీ పవర్ బ్యాంక్‌లపై ఈ సేల్‌లో అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. టాప్ బ్రాండ్ల పవర్ బ్యాంక్‌లపై లభిస్తున్న రాయితిల వివరాలు తెలుసుకుందాం.
షియోమీ Power Bank 4i, అమెజాన్ బేసిక్స్ పవర్ బ్యాంక్
షియోమీ Power Bank 4i మోడల్ అమెజాన్ సేల్‌లో రూ.1,999 ధరకు లిస్ట్ అయింది. అన్ని బ్యాంక్ కార్డ్‌లపై ఫ్లాట్ రూ.250 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుండటంతో దీని ఎఫెక్టివ్ ధర రూ.1,749గా మారుతుంది. ఇది 33W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ PD సపోర్ట్, 12-లేయర్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. మరొకవైపు Amazon Basics 20000mAh పవర్ బ్యాంక్ కేవలం రూ.1,149 కే లభిస్తోంది. ఇది 22.5W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు డ్యూయల్ ఇన్పుట్/అవుట్‌పుట్ సపోర్ట్‌ను కలిగి ఉండి, ఒకేసారి 3 డివైజ్‌లను ఛార్జ్ చేసే వెసులుబాటును ఇస్తుంది.
Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో రియల్మీ 16T 5G పై కళ్లు చెదిరే ఆఫర్లు
అంబ్రేన్, లైఫ్‌లాంగ్, పోర్ట్రానిక్స్ ఆఫర్లు
అంబ్రేన్ 20000mAh పాకెట్ సైజ్ పవర్ బ్యాంక్ సేల్‌లో రూ.1,599 ధరకు అందుబాటులో ఉంది. ఇందులో ఇన్-బిల్ట్ టైప్-సి కేబుల్, 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తాయి. ఇక Lifelong 20000mAh పవర్ బ్యాంక్ రూ.1,990 కి లిస్ట్ కాగా, బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ.100 తగ్గింపుతో రూ.1,890 కే లభిస్తోంది. ఇది 22.5W ఛార్జింగ్‌తో పాటు టైప్-సి, లైట్నింగ్, యూఎస్బీ ఇన్-బిల్ట్ కేబుళ్లను కలిగి ఉంది. అదేవిధంగా Portronics Power Shutter 20000mAh పవర్ బ్యాంక్ బ్యాంక్ ఆఫర్ తగ్గింపు తరువాత రూ.1,899 (జాబితా ధర రూ.1,999) కి లభిస్తోంది. ఇందులో ఇన్-బిల్ట్ టైప్-సి, 8-పిన్ కేబుల్స్ ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన