Realme 16x 5G: ఈ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. టెక్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న రియల్‌మీ కొత్త ఫోన్

Realme ఫోన్ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు.

Realme 16x 5G: ఈ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. టెక్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న రియల్‌మీ కొత్త ఫోన్

Photo Credit: Realme

Realme 16x 5G

ముఖ్యాంశాలు
  • రియల్‌మీ నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్
  • 7000mAh భారీ బ్యాటరీతో 'రియల్‌మీ 16x 5G' లాంచ్
  • 144Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో వచ్చిన ఫోన్
ప్రకటన

Realme 16x 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ భారతీయ వినియోగదారుల కోసం మరో సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.  రియల్‌మీ 16x 5G పేరుతో వచ్చిన ఈ ఫోన్‌ను మీడియాటెక్ డైమెన్సిటీ 6300 6nm ప్రాసెసర్‌తో పవర్ఫుల్ గా రూపొందించారు. రోజంతా ఛార్జింగ్ సమస్య లేకుండా వాడేందుకు వీలుగా ఇందులో ఏకంగా 7000mAh భారీ బ్యాటరీని అందించడం విశేషం. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఫోన్ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు.

ధరలు, లాంచ్ ఆఫర్ల వివరాలు 
ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 4GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999 కాగా, 6GB + 128GB వేరియంట్ ధర రూ.27,999 గాను, టాప్ ఎండ్ 6GB + 256GB వేరియంట్ ధర రూ.30,999 గానూ నిర్ణయించారు. లాంచ్ ఆఫర్ కింద బ్యాంక్ కార్డ్‌లపై రూ.1,000 తక్షణ డిస్కౌంట్‌తో పాటు రూ.2,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కంపెనీ అందిస్తోంది. ఆగస్టు 13 నుంచి ఈ ఫోన్ రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‎లలో అమ్మకానికి రానుంది.

Airtel: ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఊహించని షాక్.. ఆ పాపులర్ ప్లాన్స్ క్లోజ్

అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు 
రియల్‌మీ 16x 5G ఫోన్‌లో 6.8 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను అందించారు. ఇది 1570×720 పిక్సెల్స్ రెసల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ వరకు హెచ్‌బీఎమ్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ UI 7.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇందులో 2TB వరకు పెంచుకోగల స్టోరేజ్ వెసులుబాటు ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP65 రేటింగ్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను కూడా పొందింది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »