Motorola Razr Fold Launched: ట్రిపుల్ 50 MP కెమెరాలు, రూ.1,49,999 ధర.. ఫోల్డబుల్ ఫోన్ల మార్కెట్లోకి మోటోరోలా గ్రాండ్ ఎంట్రీ

Motorola Razr Fold Launched in India: మోటోరోలా రేజర్ ఫోల్డ్ బేస్ వేరియంట్ (12GB ర్యామ్ + 256GB స్టోరేజ్) ధర రూ.1,49,999గా ఉంది. అలాగే దీని టాప్-ఎండ్ వేరియంట్ (16GB ర్యామ్ + 512GB స్టోరేజ్) ధర రూ.1,59,999గా నిర్ణయించారు

Motorola Razr Fold Launched: ట్రిపుల్ 50 MP కెమెరాలు, రూ.1,49,999 ధర.. ఫోల్డబుల్ ఫోన్ల మార్కెట్లోకి మోటోరోలా గ్రాండ్ ఎంట్రీ

Motorola Razr Fold

ముఖ్యాంశాలు
  • ఫోల్డబుల్ ఫోన్ల మార్కెట్లోకి మోటోరోలా గ్రాండ్ ఎంట్రీ
  • స్లిమ్ డిజైన్‌లోనూ 6000mAh మెగా బ్యాటరీ
  • సామ్‌సంగ్, గూగుల్ ఫోల్డబుల్స్ కు గట్టి పోటీ
ప్రకటన

Motorola Razr Fold Launched in India: భారతదేశంలో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడు ఇవి కేవలం ఫ్యాషన్ కోసమే కాకుండా.. మల్టీటాస్కింగ్, ఆఫీస్ పనుల కోసం ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. ఈ ట్రెండ్‌ను అందిపుచ్చుకుంటూ ప్రముఖ మొబైల్ బ్రాండ్ మోటోరోలా తన మొట్టమొదటి బుక్-స్టైల్  ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్  మోటోరోలా రేజర్ ఫోల్డ్‎ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సరికొత్త ఫ్లాగ్‌షిప్ డివైజ్ సామ్‌సంగ్, గూగుల్ కంపెనీల ఫోల్డబుల్ ఫోన్ల కంటే తక్కువ ధరలోనే లభిస్తూ మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది.

ధరలు, వేరియంట్ల పూర్తి వివరాలు

ధరల విషయానికి వస్తే.. మోటోరోలా రేజర్ ఫోల్డ్ బేస్ వేరియంట్ (12GB ర్యామ్ + 256GB స్టోరేజ్) ధర రూ.1,49,999గా ఉంది. అలాగే దీని టాప్-ఎండ్ వేరియంట్ (16GB ర్యామ్ + 512GB స్టోరేజ్) ధర రూ.1,59,999గా నిర్ణయించారు. వీటికి తోడు క్రీడాభిమానుల కోసం కంపెనీ ఒక ప్రత్యేకమైన ఫిఫా వరల్డ్ కప్ 26 ఎడిషన్‎ను కూడా పరిచయం చేసింది. మోటో పెన్ స్టైలస్‌తో కలిసి వచ్చే ఈ స్పెషల్ ఎడిషన్ బ్లాక్ కలర్ మోడల్ ధర రూ.1,69,999 గా ఉంది.

5 Motorola Razr Fold

 ప్రీమియం డిజైన్, సరికొత్త హింజ్ టెక్నాలజీ

డిజైన్ పరంగా మోటోరోలా రేజర్ ఫోల్డ్ చాలా మెచ్యూర్డ్‌గా, ప్రీమియంగా కనిపిస్తుంది. ఫోన్ విప్పినప్పుడు దీని మందం కేవలం 4.55 మిమీ మాత్రమే ఉంటుంది.. అంటే మార్కెట్లో ఉన్న అత్యంత స్లిమ్మెస్ట్ ఫోల్డబుల్ ఫోన్లలో ఇది ఒకటి. అయితే దీని బరువు 243 గ్రాములు ఉంటుంది. సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 (215 గ్రాములు) తో పోలిస్తే ఇది కాస్త బరువైనప్పటికీ.. ఇందులో ఇచ్చిన పెద్ద బ్యాటరీ కారణంగా ఈ బరువు పెరిగింది. ఈ ఫోన్ పాంటోన్ బ్లాకెండ్ బ్లూ (ఫ్యాబ్రిక్ లాంటి టెక్స్చర్ ఫినిష్), పాంటోన్ లిల్లీ వైట్ (మార్బుల్ లాంటి ఫినిష్) రంగుల్లో లభిస్తుంది. స్క్రీన్ మధ్యలో వచ్చే గీతను తగ్గించడానికి ఇందులో స్టెయిన్‌లెస్ స్టీల్ టియర్‌డ్రాప్ హింజ్, టైటానియం ఇన్నర్ ప్లేట్‌ను వాడారు. దీనివల్ల గీత చాలా వరకు తగ్గిపోయి స్క్రీన్ స్మూత్‌గా అనిపిస్తుంది. అలాగే ఈ ఫోన్‌కు IP49 రేటింగ్ ఇవ్వడం వల్ల లైట్ వర్షం, నీటి తుంపర్ల నుంచి రక్షణ లభిస్తుంది.

Gmail Tips : జీమెయిల్‌లో దాగున్న సీక్రెట్ ఆప్షన్.. బ్లూ కలర్ సెండ్ బటన్ పక్కనే ఉంది గమనించారా?

2 Motorola Razr Fold

అల్ట్రా-బ్రైట్ విజువల్స్ ఇచ్చే డ్యూయల్ డిస్‌ప్లేలు

డిస్‌ప్లే క్వాలిటీ విషయంలో మోటోరోలా అస్సలు తగ్గలేదు. ఈ ఫోన్ బయట వైపు 6.56-ఇంచుల కవర్ డిస్‌ప్లే ఉండగా.. లోపలి వైపు మడత విప్పినప్పుడు పెద్ద 8.1-ఇంచుల మెయిన్ డిస్‌ప్లే ఓపెన్ అవుతుంది. రెండు స్క్రీన్లు కూడా ఎల్టీపీఓ ఓఎల్ఈడీ టెక్నాలజీతో వస్తాయి.  1Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్ రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తాయి. ఇండోర్, అవుట్‌డోర్ ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా కవర్ స్క్రీన్‌కు 6000 నిట్స్, మెయిన్ స్క్రీన్‌కు మైండ్ బ్లాకింగ్ 6200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్ ఉండడం వల్ల నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్‌లలో హై-క్వాలిటీ వీడియోలు చూసేటప్పుడు సినిమా థియేటర్ లాంటి అనుభూతి కలుగుతుంది. దీనికి తోడు బోస్, డాల్బీ అట్మోస్ ట్యూన్ చేసిన స్టీరియో స్పీకర్లు అద్భుతమైన ఆడియో అవుట్‌పుట్‌ను ఇస్తాయి.

11 Motorola Razr Fold

అల్ట్రా-బ్రైట్ విజువల్స్ ఇచ్చే డ్యూయల్ డిస్‌ప్లేలు

డిస్‌ప్లే క్వాలిటీ విషయంలో మోటోరోలా అస్సలు తగ్గలేదు. ఈ ఫోన్ బయట వైపు 6.56-ఇంచుల కవర్ డిస్‌ప్లే ఉండగా.. లోపలి వైపు మడత విప్పినప్పుడు పెద్ద 8.1-ఇంచుల మెయిన్ డిస్‌ప్లే ఓపెన్ అవుతుంది. రెండు స్క్రీన్లు కూడా ఎల్టీపీఓ ఓఎల్ఈడీ టెక్నాలజీతో వస్తాయి.  1Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్ రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తాయి. ఇండోర్, అవుట్‌డోర్ ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా కవర్ స్క్రీన్‌కు 6000 నిట్స్, మెయిన్ స్క్రీన్‌కు మైండ్ బ్లాకింగ్ 6200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్ ఉండడం వల్ల నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్‌లలో హై-క్వాలిటీ వీడియోలు చూసేటప్పుడు సినిమా థియేటర్ లాంటి అనుభూతి కలుగుతుంది. దీనికి తోడు బోస్, డాల్బీ అట్మోస్ ట్యూన్ చేసిన స్టీరియో స్పీకర్లు అద్భుతమైన ఆడియో అవుట్‌పుట్‌ను ఇస్తాయి.

5 Motorola Razr Fold

క్లీన్ సాఫ్ట్‌వేర్, ఏడేళ్ల అప్‌డేట్స్ హామీ

సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత  హెల్లో యూఐ పై రన్ అవుతుంది. ఇందులో ఎలాంటి అనవసరమైన బ్లోట్‌వేర్ యాప్స్ ఉండవు, చాలా క్లీన్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. మోటోరోలా ఈ ఫోన్‌కు ఏకంగా 7 సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్, 7 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తామని ప్రామిస్ చేసింది. లోపలి పెద్ద స్క్రీన్‌ను పూర్తిగా వాడుకోవడానికి వీలుగా ఒకేసారి మూడు యాప్స్ ఓపెన్ చేసుకునే స్ప్లిట్-స్క్రీన్ మోడ్, ఫ్లోటింగ్ విండోస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ కోపైలట్, పర్‌ప్లెక్సిటీ వంటి అడ్వాన్స్‌డ్ మోటో ఏఐ టూల్స్ కూడా ఇందులో బిల్ట్-ఇన్‌గా లభిస్తాయి.

4 Motorola Razr Fold

స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 తో ఫ్లాగ్‌షిప్ పర్ఫార్మెన్స్

మోటోరోలా రేజర్ ఫోల్డ్ ఫోన్‌లో క్వాల్‌కామ్  పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ టెక్నాలజీతో పని చేస్తుంది. రోజువారీ పనులు, అఫీషియల్ మల్టీటాస్కింగ్ చాలా స్మూత్‌గా సాగిపోతాయి. బీజీఎమ్‌ఐ వంటి హెవీ గ్రాఫిక్స్ గేమ్‌లను గరిష్ట సెట్టింగ్స్‌లో 60fps స్పీడ్‌తో ఎలాంటి లాగ్ లేకుండా ఆడుకోవచ్చు. అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ గేమ్ బయటి స్క్రీన్‌పై 120fps వరకు సపోర్ట్ చేస్తుంది. ఎక్కువసేపు గేమ్స్ ఆడినా ఫోన్ వేడెక్కకుండా థర్మల్ మేనేజ్‌మెంట్‌ను బాగా డిజైన్ చేశారు.

10 Motorola Razr Fold

ట్రిపుల్ 50 ఎంపీ కెమెరాల హంగామా

ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో మూడు పవర్ఫుల్ కెమెరాలను అమర్చారు. ఇందులో OIS సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్ కలిగిన 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. పగటిపూట, రాత్రి వేళల్లో మెయిన్ కెమెరా చాలా స్పష్టమైన, డీటెయిల్డ్ ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది. 3x జూమ్ వద్ద టెలిఫోటో లెన్స్ అద్భుతమైన పోర్ట్రెయిట్ షాట్స్ ఇస్తుంది.. దీనిని 100x వరకు జూమ్ చేసుకోవచ్చు. ఇక సెల్ఫీల కోసం లోపలి స్క్రీన్‌పై 32 మెగాపిక్సెల్ కెమెరా, బయటి కవర్ స్క్రీన్‌పై 20 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ ద్వారా 8K డాల్బీ విజన్ వీడియోలను 30fps వద్ద రికార్డ్ చేయవచ్చు.

7 Motorola Razr Fold

6000mAh మెగా బ్యాటరీ, సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్

సాధారణంగా ఫోల్డబుల్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కానీ మోటోరోలా రేజర్ ఫోల్డ్ ఈ అంచనాలను బ్రేక్ చేస్తూ ఏకంగా 6000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వస్తుంది. పిసి మార్క్ బ్యాటరీ టెస్ట్‌లో ఇది కవర్ స్క్రీన్‌పై 18 గంటల 30 నిమిషాలు, మెయిన్ ఇన్నర్ స్క్రీన్‌పై 11 గంటల 53 నిమిషాల పాటు నాన్‌స్టాప్ బ్యాకప్ ఇచ్చింది. సాధారణ వినియోగంలో ఈ ఫోన్ ఒక రోజంతా హ్యాపీగా వస్తుంది. దీనికి తోడు 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కంపెనీ బాక్స్‌లోనే 90W ఫాస్ట్ ఛార్జర్‌ను ఉచితంగా అందిస్తోంది. దీని ద్వారా కేవలం 55 నిమిషాల్లోనే ఫోన్ 0 నుండి 100 శాతం పూర్తి ఛార్జింగ్ అవుతుంది.

6 Motorola Razr Fold

3 Motorola Razr Fold

Mmotorola Razr Fold Cam Shot 1Mmotorola Razr Fold Cam Shot 2Mmotorola Razr Fold Cam Shot 3Mmotorola Razr Fold Cam Shot 4

Mmotorola Razr Fold Cam Shot 5Mmotorola Razr Fold Cam Shot 6Mmotorola Razr Fold Cam Shot 7Mmotorola Razr Fold Cam Shot 8

Mmotorola Razr Fold Cam Shot 9Mmotorola Razr Fold Cam Shot 10Mmotorola Razr Fold Cam Shot 11Mmotorola Razr Fold Cam Shot 12

Mmotorola Razr Fold Cam Shot 13Mmotorola Razr Fold Cam Shot 14Mmotorola Razr Fold Cam Shot 15

Mmotorola Razr Fold Cam Shot 16Mmotorola Razr Fold Cam Shot 17Mmotorola Razr Fold Cam Shot 18

Mmotorola Razr Fold Cam Shot 19Mmotorola Razr Fold Cam Shot 20Mmotorola Razr Fold Cam Shot 21

Mmotorola Razr Fold Cam Shot 22Mmotorola Razr Fold Cam Shot 23

9 Motorola Razr Fold

8 Motorola Razr Fold

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »