వివో S2 ప్రారంభ ధర (8GB/128GB) రూ.39,999 కాగా, 8GB/256GB వేరియంట్ ధర రూ.44,999 గా ఉంది.
Photo Credit: Vivo/iQOO/OnePlus
Vivo S2 vs iQOO Neo 10 vs OnePlus Nord 6
Vivo S2 vs iQOO Neo 10 vs OnePlus Nord 6 : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రీమియం మిడ్-రేంజ్ విభాగంలో తీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల వివో తన సరికొత్త వివో S2 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ నేరుగా మార్కెట్లో ఉన్న ఐకూ నియో 10, వన్‌ప్లస్ నార్డ్ 6 ఫోన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ మూడింటిలో ఏది కొంటే లాభం? దేని ఫీచర్లు బాగున్నాయో ఇప్పుడు చూద్దాం.
ధర, స్టోరేజ్ వేరియంట్లు
వివో S2 ప్రారంభ ధర (8GB/128GB) రూ.39,999 కాగా, 8GB/256GB వేరియంట్ ధర రూ.44,999 గా ఉంది. ఇక ఐకూ నియో 10 (8GB/256GB) ధర రూ.41,999 కాగా, 12GB/256GB వేరియంట్ ధర రూ.46,999 గా నిర్ణయించారు. మరొకవైపు వన్‌ప్లస్ నార్డ్ 6 విషయానికి వస్తే 8GB/256GB వేరియంట్ ధర రూ.44,499, టాప్ వేరియంట్ 12GB/256GB ధర రూ.50,499 గా అందుబాటులో ఉన్నాయి.
డిస్ప్లే, ప్రాసెసర్, పెర్ఫార్మెన్స్
వివో S2 ఫోన్లో 6.83 అంగుళాల 1.5K 120Hz AMOLED డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్ అందించారు. ఐకూ నియో 10 లో 144Hz రిఫ్రెష్ రేట్, 5500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే మరియు స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్ ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 6 లో ఏకంగా 165Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల AMOLED డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్సెట్ అందించడం విశేషం.
Realme 16x 5G: ఈ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. టెక్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న రియల్మీ కొత్త ఫోన్
కెమెరా, భారీ బ్యాటరీల పోలిక
కెమెరా విభాగంలో మూడింటిలోనూ 50MP ప్రైమరీ కెమెరా, సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఐకూ, వన్‌ప్లస్‌లలో 8MP ఆల్ట్రా-వైడ్ కెమెరా ఉండగా, వివో S2 లో 2MP సెకండరీ కెమెరా ఇచ్చారు. ఇక బ్యాటరీల విషయానికి వస్తే.. వివో S2 లో 44W ఛార్జింగ్‌తో 7050mAh బ్యాటరీ, ఐకూ నియో 10 లో 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7000mAh బ్యాటరీ లభిస్తాయి. కానీ వన్‌ప్లస్ నార్డ్ 6 మాత్రం ఏకంగా 80W సూపర్ ఊక్ ఛార్జింగ్‌తో 9000mAh అతిభారీ బ్యాటరీని అందిస్తూ రేసులో ముందు నిలిచింది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹58,949
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Apple Support Community to Shut Down Later This Month After Nearly 30 Years
ACT Fibernet Diwali Offer Allows Customers to Upgrade to Faster Broadband Plans at No Additional Cost: Report