ఒప్పో సంస్థ ఒప్పో ఫైండ్ X9s మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది
The Oppo Find X9s is priced at Rs. 79,999 in India
Oppo Find X9s : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొబైల్ రంగాన్ని మెమరీ క్రైసిస్ (ర్యామ్, స్టోరేజ్ విడిభాగాల కొరత, ధరల పెరుగుదల) తీవ్రంగా వేధిస్తోంది. ఈ సంక్షోభం వల్ల మొబైల్ కంపెనీలు పాత మోడల్స్ కంటే తక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్లను, ఎక్కువ రేట్లకు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవలే వివో కంపెనీ తన X300 FE మోడల్‌ను భారీ ధరతో లాంచ్ చేయగా.. ఇప్పుడు దానికి పోటీగా ఒప్పో సంస్థ ఒప్పో ఫైండ్ X9s మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. నిజానికి ఇది గతంలో వచ్చిన సూపర్ హిట్ మోడల్ ఒప్పో ఫైండ్ X9 కి కాస్త తగ్గించిన వెర్షన్ అని చెప్పాలి. ఫీచర్లు తగ్గినా కూడా, మెమరీ సంక్షోభం వల్ల దీని ధరను కంపెనీ కాస్త ఎక్కువగానే నిర్ణయించింది.
డిజైన్ పరంగా పాతదే.. కానీ సరికొత్త కలర్స్‌తో ఫ్యాన్సీ లుక్!
డిజైన్ విషయానికి వస్తే ఒప్పో పెద్దగా ప్రయోగాలు ఏమీ చేయలేదు. గతంలో వచ్చిన ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఒప్పో ఫైండ్ X9 సైజు, బరువుతోనే ఇది కూడా డిజైన్ చేయబడింది. దీని కొలతలు 156.98 × 73.93 × 7.99 మిల్లీమీటర్లుగా ఉండగా, బరువు 202 గ్రాములు ఉంటుంది. అంటే చూసేటప్పుడు ఫైండ్ X9, త్త ఫైండ్ X9s ఫోన్ల మధ్య తేడా కనిపెట్టడం చాలా కష్టం. అయితే కస్టమర్లను ఆకర్షించడం కోసం ఇందులో సన్‌సెట్ ఆరెంజ్, లావెండర్ స్కై అనే రెండు సరికొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టారు. రఫ్ అండ్ టఫ్ వాడకానికి తట్టుకునేలా ఈ ఫోన్‌కు IP68, IP69 రేటింగ్స్ ఇచ్చారు, దీనివల్ల నీటిలో, ధూళిలో ఈ ఫోన్ అస్సలు పాడవదు.
![]()
డిస్‌ప్లే బాగుంది కానీ.. కాంపిటీటర్లతో పోలిస్తే రేసులో వెనుకంజ
ఒప్పో ఫైండ్ X9s లో 6.59 ఇంచుల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను ఉపయోగించారు. ఇది 460 PPI పిక్సెల్ డెన్సిటీ, 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 7i కోటింగ్‌ను ఇచ్చారు. ఈ స్క్రీన్ పూర్తిగా ఫ్లాట్‌గా ఉంటూ, అంచులు చాలా సన్నగా ఉంటాయి. మధ్యాహ్నం వేళ ఎండలో బయటకు వెళ్లినా కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓటీటీ యాప్స్‌లో మంచి క్వాలిటీతో కంటెంట్ చూడటానికి ఇందులో డాల్బీ విజన్ హెచ్‌డీఆర్ (Dolby Vision HDR) సపోర్ట్ కూడా ఉంది. అయితే ఈ ప్రైస్ రేంజ్‌లో ఉన్న షావోమి 17, వివో X300 ఫోన్లు పవర్ ఆదా చేసే అల్ట్రా మోడ్రన్ LTPO ప్యానెళ్లతో వస్తుంటే, ఒప్పో మాత్రం పాత LTPS స్క్రీన్‌నే వాడింది. కానీ బ్యాటరీ సైజ్ పెంచి ఒప్పో ఈ లోపాన్ని కవర్ చేసే ప్రయత్నం చేసింది.
![]()
ఆపిల్ ఐఫోన్‌ను బ్లైండ్‌గా కాపీ కొట్టిన కలర్‌ఓఎస్ 16 సాఫ్ట్‌వేర్
సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్‌ఓెస్ 16 పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌కు 5 ఏళ్ల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్ ఇస్తామని ఒప్పో ప్రామిస్ చేసింది. ఇందులో ఆపిల్ డైనమిక్ ఐలాండ్ తరహాలోనే లైవ్ స్పేస్ అనే సరికొత్త ఫీచర్‌ను ఇచ్చారు. లాక్ స్క్రీన్, హోమ్ స్క్రీన్ పై మనం వాడుతున్న యాప్స్ ఇన్ఫర్మేషన్‌ను ఒక చిన్న క్యాప్సూల్ లాగా ఇది చూపిస్తుంది. ఒకేసారి 5 యాప్స్ వరకు ఇందులో స్లైడ్ చేస్తూ మార్చుకోవచ్చు. అయితే ఈ సాఫ్ట్‌వేర్ లోని కెమెరా యాప్, వీడియో రికార్డింగ్ ఇంటర్‌ఫేస్ పూర్తిగా ఆపిల్ ఐఓఎస్ 26ని కాపీ కొట్టినట్లుగా ఉంటుంది. ఆపిల్ డివైజ్‌లకు ఫైల్స్ పంపుకోవడానికి వీలుగా ఇందులో ఉన్న ఎయిర్‌డ్రాప్ సపోర్ట్ చిన్న ఫైళ్లకు బాగానే పనిచేస్తుంది కానీ, 2GB కంటే పెద్ద ఫైల్స్ పంపేటప్పుడు మాత్రం చాలా స్లో అవుతోంది.
![]()
ప్రొసెసర్ పవర్ ఓకే.. కానీ పాత ఫోనే చాలా బెటర్
పర్ఫార్మెన్స్ పరంగా ఇందులో 3nm టెక్నాలజీతో తయారైన మీడియాటెక్ డైమెన్సిటీ 9500s ప్రొసెసర్‌ను వాడారు. దీని క్లాక్ స్పీడ్ 3.73GHz గా ఉంది. రోజువారీ పనులకు, మల్టీటాస్కింగ్‌కు ఈ ఫోన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. జెన్‌షిన్ ఇంపాక్ట్ లాంటి హెవీ 3D గేమ్స్ ఆడేటప్పుడు కూడా స్థిరంగా 60 fps ఫ్రేమ్ రేట్‌ను అందిస్తుంది. అయితే బెంచ్‌మార్క్ స్కోర్స్ గమనిస్తే, దీనికంటే తక్కువ ధరకు దొరుకుతున్న పాత ‘ఒప్పో ఫైండ్ X9' (డైమెన్సిటీ 9500 చిప్‌సెట్), క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఉన్న షావోమి 17 ఫోన్లు చాలా మెరుగైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. ఫోన్ వేడెక్కకుండా 32,052.5 చదరపు మిల్లీమీటర్ల భారీ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉన్నప్పటికీ, 4K డాల్బీ విజన్ వీడియోలు రికార్డ్ చేసేటప్పుడు కెమెరా ఏరియాలో ఫోన్ బాగా వేడెక్కుతోంది.
![]()
కెమెరా క్వాలిటీ పర్లేదు.. కానీ ఆ ఫీచర్ తీసేసారు ఏంటి ఒప్పో?
ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ సోనీ LYT-700 మెయిన్ కెమెరా (OIS సపోర్ట్‌తో), 3x ఆప్టికల్ జూమ్ చేయగల 50 మెగాపిక్సెల్ సోనీ LYT-600 టెలిఫోటో కెమెరా , మాక్రో షాట్స్ తీయగల 50 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. మెయిన్ కెమెరాతో మంచి డీటెయిల్స్ ఉన్న ఫొటోలు వస్తాయి. ఫొటోలు మరింత ఎమోషనల్‌గా రావడం కోసం హ్యాసెల్‌బ్లాడ్ మోడ్‌ను కూడా ఇచ్చారు. 3x టెలిఫోటో కెమెరా తక్కువ కాంతిలోనూ మంచి షార్ప్ ఫొటోలు తీస్తుంది, కానీ దీని మినిమం ఫోకస్ దూరం 60 సెంటీమీటర్లు ఉండటం వల్ల సబ్జెక్టుకు బాగా దగ్గరగా వెళ్లలేము. అన్నింటికంటే పెద్ద మైనస్ ఏంటంటే, ఫైండ్ X9 లో ఉన్న 26MP లేదా 28MP ఇమేజ్ బిన్నింగ్ ఆప్షన్‌ను ఇందులో తీసేశారు. దీనివల్ల మీరు కేవలం 12 మెగాపిక్సెల్ సైజులోనే ఫొటోలు తీయగలరు, ఫలితంగా ఫైండ్ X9 తో పోలిస్తే ఫొటోల షార్ప్‌నెస్ కాస్త తగ్గింది. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
![]()
వైర్‌లెస్ చార్జింగ్ లేకపోవడం పెద్ద మైనస్
బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఒప్పో ఫైండ్ X9s నిజంగా ఒక రారాజు అని చెప్పాలి. ఇందులో సరికొత్త సిలికాన్-కార్బన్ (Si-C) టెక్నాలజీతో కూడిన 7,025mAh భారీ బ్యాటరీని అమర్చారు. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్‌లో ఇది ఏకంగా 22 గంటల 20 నిమిషాల పాటు నడిచి రికార్డు సృష్టించింది. సాధారణ యూజర్లు వాడుకుంటే ఈ ఫోన్ ఈజీగా రెండు రోజుల పాటు చార్జింగ్ లేకుండా నడుస్తుంది. హెవీగా వాడినా కూడా ఒక రోజు కంటే ఎక్కువగానే వస్తుంది. ఈ భారీ బ్యాటరీని చార్జ్ చేయడం కోసం బాక్స్‌లోనే 80W SuperVOOC ఫాస్ట్ చార్జర్‌ను ఇచ్చారు. దీనివల్ల 30 నిమిషాల్లో 53 శాతం, 1 గంట 22 నిమిషాల్లో వంద శాతం ఫుల్ చార్జ్ అవుతుంది. అయితే ఇంత పెద్ద ప్రీమియం ఫోన్ లో వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్‌ను పూర్తిగా తీసేయడం కస్టమర్లను తీవ్రంగా నిరాశపరిచే అంశం.
The Find X9s' lossless 6X telephoto captures detailed and sharp images in daylight, but has an enhanced appearance in low-light (tap image to expand)
![]()
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,805
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Lenovo ThinkBook 14x Launched in India With Intel Core Ultra Series 2 Processors: Price, Specifications