ఈ ఫెస్టివల్ సేల్‌లో SBI క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులకు గరిష్టంగా 10% వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రెడ్‌మి మరియు షియోమి మొబైల్‌లపై కొన్ని ఆసక్తికరమైన డీల్‌లను అందిస్తుంది.
ఈ సంవత్సరం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025తో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు దారులకు నిజంగా పండుగ వాతావరణమనే చెప్పాలి. ప్రైమ్ సభ్యులకు ఈ సేల్ ఇప్పటికే స్టార్ట్ అయింది. సాధారణ వినియోగదారులకు మాత్రం సెప్టెంబర్ 23, 2025 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ప్రత్యేకంగా షియోమీ, రెడ్మీ హ్యాండ్‌సెట్లపై అద్భుతమైన డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా Xiaomi 15, Xiaomi 14 Civi వంటి ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై భారీ ధర తగ్గింపులు వచ్చాయి.అదే సమయంలో, రెడ్మీ స్మార్ట్‌ఫోన్లపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. ఈ సేల్ సమయంలో కొత్త ఫోన్ కొనాలని అనుకుంటున్న వారికి ఇది పర్ఫెక్ట్ ఛాన్స్ అని చెప్పవచ్చు.
ఈ ఫెస్టివల్ సేల్‌లో SBI క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులకు గరిష్టంగా 10% వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా, అమెజాన్ పే ICICI Bank క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు అన్‌లిమిటెడ్ 5% క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. రివార్డ్స్ గోల్డ్ ప్రోగ్రామ్ ద్వారా శాతం వంతు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. అదనంగా, 24 నెలల వరకు నో-కాస్ట్ EMI సౌకర్యం, ఎక్స్చేంజ్ ఆఫర్లపై ప్రత్యేక డిస్కౌంట్‌లు లభ్యమవుతాయి.
ఈ ఏడాది ఫెస్టివల్ సేల్‌లో ప్రధాన ఆకర్షణ Xiaomi 14 Civi. దాని అసలు ధర రూ.79,999 కాగా, సేల్‌లో కేవలం రూ.24,999కే అందుబాటులో ఉంది. లైకా ట్యూన్డ్ కెమెరాలు, Snapdragon 8s Gen 3 ప్రాసెసర్, 120Hz AMOLED డిస్‌ప్లే, ప్రీమియం డిజైన్ – ఇవన్నీ కలిపి ఈ ఫోన్‌ను బెస్ట్ డీల్‌గా మార్చేశాయి. హై-ఎండ్ పనితీరు, స్టైలిష్ డిజైన్, ప్రో-గ్రేడ్ ఫోటోగ్రఫీ కావాలనుకునే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు.
రెడ్ మీ, షియోమీ స్మార్ట్‌ఫోన్లపై అందుబాటులో ఉన్న అన్ని ముఖ్య ఆఫర్లను క్రింద ఇచ్చాం. ఈ ఫెస్టివల్ సేల్ సమయంలో మీకు సరిపోయే బెస్ట్ డీల్‌ను ఎంచుకొని స్మార్ట్‌గా షాపింగ్ చేయండి.
ఈ సేల్‌లో రెడ్ మీ 13 5G ఫోన్‌ను అసలు ధర రూ. 19,999 బదులు కేవలం రూ. 11,199కే పొందొచ్చు. అదే విధంగా, రెడ్ మీ A4 ధర రూ. 10,999 నుండి తగ్గి రూ. 7,499కి లభిస్తోంది.రెడ్ మీ నోట్ 14 5G ధర రూ. 21,999 కాగా, ఇప్పుడు ఈ సేల్‌లో రూ. 15,499కే అందుబాటులో ఉంది. రెడ్ మీ నోట్ 14 ప్రో+ కూడా రూ. 28,999 నుండి తగ్గి రూ. 24,999కు లభిస్తోంది. రెడ్ మీ 14C 5G అసలు ధర రూ. 13,999 కాగా, ఆఫర్ ప్రైస్ కేవలం రూ. 9,999 మాత్రమే.
బడ్జెట్ సెగ్మెంట్‌లో రెడ్ మీ A5 కూడా మంచి డీల్ అందిస్తుంది. ఇది రూ. 8,999 బదులు ఇప్పుడు రూ. 6,499కే అందుబాటులో ఉంది. రెడ్ మీ నోట్ 14 ప్రో అయితే రూ. 28,999 ధర నుండి తగ్గి రూ. 20,999కే లభిస్తోంది.ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో షియోమీ 15 కూడా రూ. 79,999 బదులు ఇప్పుడు రూ. 59,999కే లభిస్తోంది.ఈ మోడల్ ఫోన్లు కొనాలనుకునే వారికి ఈ సేల్ బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు.
ప్రకటన
ప్రకటన