ఎప్పుడెప్పుడా అని ఎదురుస్తున్న అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 8 నుండి ప్రారంభం కానుంది
Photo Credit: Photo credit - Amazon
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026
Amazon Great Summer Sale 2026: మండుతున్నవేసవిలో షాపింగ్ మజాను పంచేందుకు అమెజాన్ రెడీ అయిపోయింది. ప్రతి ఏటా నిర్వహించే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ డేట్స్‌ను ప్రకటించింది. ఈ ఏడాది మే 8 నుంచి ఈ భారీ సేల్ ప్రారంభమైంది. స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఫ్యాషన్, గృహోపకరణాలపై మునుపెన్నడూ లేని విధంగా భారీ తగ్గింపులను అందించేందుకు అమెజాన్ రంగం సిద్ధం చేసింది. ముఖ్యంగా ప్రైమ్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే ఈ ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ సేల్‌లో షాపింగ్ చేసే వారు భారీగా పొదుపు చేసుకునేందుకు అమెజాన్ పలు బ్యాంక్ ఆఫర్లను ప్రకటించింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డులు లేదా ఈజీ ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. రోజుకు కేవలం 9 రూపాయల నుంచి ప్రారంభమయ్యే ఇన్‌స్టాల్‌మెంట్ ప్లాన్లతో ఖరీదైన వస్తువులను కూడా సామాన్యులు కొనుగోలు చేసేలా అమెజాన్ ప్లాన్ చేసింది.నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది..
మొబైల్ ఫోన్లు కొనేవారికి ఈ సేల్ ఒక పండగ లాంటిదని చెప్పొచ్చు. ఇప్పటికే కొన్ని డీల్స్‌ను అమెజాన్ రివీల్ చేసింది. ఉదాహరణకు, రూ.53,999 విలువైన iQOO 15R ఫోన్ కేవలం రూ.42,999 కే లభించనుంది. షియోమీ ప్యాడ్ 8 ధరను రూ.37,999 నుంచి రూ.30,999 కి తగ్గించారు. JBL 800 ప్రో సౌండ్‌బార్‌పై ఏకంగా రూ.20,000 తగ్గింపు లభిస్తోంది. వన్‌ప్లస్, శాంసంగ్ వంటి బ్రాండ్లపై కూడా భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ డీల్స్ ఉండబోతున్నాయి. వన్‌ప్లస్, శాంసంగ్ వంటి బ్రాండ్లపై కూడా భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ డీల్స్ ఉండబోతున్నాయి..
షాపింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు అమెజాన్ తన ఏఐ పవర్డ్ అసిస్టెంట్ రూఫస్‌ను రంగంలోకి దించింది. వినియోగదారులు తమ బడ్జెట్‌ను చెబితే చాలు, రూఫస్ బెస్ట్ డీల్స్‌ను సూచిస్తుంది. అలాగే 30 నుంచి 90 రోజుల వరకు ప్రైస్ హిస్టరీ చూసే అవకాశం ఉండటంతో, నిజంగా ధర తగ్గిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక ఫర్నిచర్ లేదా హోమ్ డెకర్ వస్తువులను కొనేముందు వ్యూ ఇన్ యువర్ రూమ్ ఫీచర్ ద్వారా ఆ వస్తువు మీ గదిలో ఎలా ఉంటుందో ముందే చెక్ చేసుకోవచ్చు. మొత్తానికి అమెజాన్ సమ్మర్ లో పండగా తీసుకొచ్చేసింది అని చెప్పవచ్చు.
ప్రకటన
ప్రకటన
Aliens: Fireteam Elite 2 Announced for PC and Consoles, Will Launch This Summer