Apple Could Launch These New Devices Once John Ternus Takes Over

సెప్టెంబర్ 1న ఆపిల్ కంపెనీకి కాబోయే కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా పగ్గాలను చేపట్టనున్న జాన్ టెర్నస్

Apple Could Launch These New Devices Once John Ternus Takes Over

Photo Credit: Apple

John Ternus has been working at Apple for the past 25 years

ముఖ్యాంశాలు
  • 15 ఏళ్ల పాటు Apple CEO బాధ్యతలు నిర్వహించిన కుక్
  • హార్ట్ వేర్ ఇంజనీరింగ్ విభాగానికి ఉపాధ్యక్షుడిగా పనిచేతున్న జాన్ టెర్నస్
  • వివిధ రకాల కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని చూస్తున్న ఆపిల్
ప్రకటన

దాదాపు 15 సంవత్సరాలుగా ఆపిల్ సీఈఓగా ఉన్న టిమ్ కుక్,  ఆ పదవికి రాజీనామా చేసి, ఆపిల్ కంపెనీ డైరెక్టర్ల బోర్డులో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆపిల్ కంపెనీ సీఈఓ పదవి భాద్యతలను జాన్ టెర్నస్ కి అప్పగించనున్నారు. ఇది వరకు జాన్ టెర్నస్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ విభాగానికి టెర్నస్ నేతృత్వం వహించారు. అయితే సప్లై చైన్ లో మంచి అనుభవం ఉన్న జాన్ టెర్నస్ కు రానున్న కాలంలో విడుదల కానున్న ఆపిల్ మొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ ను లాంచ్ చేసే కీలక భాద్యతలు కూడా టెర్నస్ కి అప్పగించినట్టు తెలుస్తుంది.

కొత్త డివైస్ ల తయారీలో బిజీగా ఉన్న జాన్ టెర్నస్ 

బ్లూమ్‌బెర్గ్‌కు చెందిన మార్క్ గుర్మాన్ తన వీక్లీ ‘పవర్ ఆన్' న్యూస్‌లెటర్ తాజా ఎడిషన్ లో, ఆపిల్ సీఈఓ పదవి నుండి తప్పుకుంటున్న టిమ్ కుక్.. కొత్త సీఈఓ జాన్ కి రాబోయే కాలంలో విడుదల కానున్న ఆపిల్ ఉత్పత్తుల జాబితాని అప్పగించారని రాసుకొచ్చారు. వీటిలో కొన్ని డెవలపింగ్ దశలో ఉంటే మరికొన్ని లాంచ్ కి రెడీగా ఉన్నాయని తెలిపారు. ఆపిల్ కొత్త సీఈఓగా భాద్యతలు తీసుకున్న రెండు వారాల్లోనే.. కంపెనీ నుండి మొదటి బుక్ స్టైల్ ఫోల్డబుల్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనిని ఐఫోన్ అల్ట్రాగా మార్కెట్ చేసే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ను ఐఫోన్ 18 ప్రో లైనప్‌తో పాటు ఆవిష్కరించే అవకాశం ఉంది.

సెప్టెంబర్ నెలలో విడుదల కానున్న తాజా ఐఫోన్ మోడళ్లతో సహా తమ ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తులను లంచ్ చేసే టెక్ జెయింట్ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించాలని ఆపిల్ టెర్నస్‌ను కోరినట్లు సమాచారం. అంతేకాకుండా, ప్రచారంలో ఉన్న ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఇంజనీరింగ్, డెవలప్మెంట్ ను టెర్నస్ పర్యవేక్షించారని, తద్వారా ఈ కొత్త పరికరాన్ని పరిచయం చేయడానికి ఆపిల్ సంస్థలోని ఉత్తమ వ్యక్తులలో ఒకరిగా నిలిచారని సమాచారం. ఈ విభాగంలో ఆపిల్ నుండి వస్తున్న మొదటి పరికరం ఇదే. అంతేకాకుండా.. టెర్నస్‌కు  హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ లో మంచి పట్టు ఉన్న కారణంగా.. ఈ డివైస్ విశిష్టత వివరించటానికి సరిపోయే అనుభంతో పాటు నైపుణ్యం కూడా ఉంది. 

ఈ నైపుణ్యం.. రాబోయే కాలంలో ఆపిల్ నుండి లాంచ్ కానున్న మరిన్ని కొత్త ఉత్పత్తి వివరాల గురించి అతడిని సిద్ధం చేస్తుందని చెబుతున్నారు. ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ మోడల్‌తో పాటు, టెర్నస్ రాబోయే కాలంలో ఆపిల్ నుండి రాబోయే కొత్త ఏఐ-ఆధారిత స్మార్ట్ హోమ్ పరికరాలు, హోమ్‌పాడ్ విత్ స్క్రీన్ (స్మార్ట్ హోమ్ హబ్), టేబుల్‌టాప్ రోబోట్ & రింగ్, కొత్త భద్రతా పరికరాల వంటి గూగుల్ గూగుల్ నెస్ట్‌లకు పోటీగా తీసుకొని రావాలి అనుకుంటున్నా అన్నిటిని టెర్నస్ పర్యవేక్షిస్తున్నారని సమాచారం. 

క్యుపెర్టినోకు చెందిన ఈ టెక్ దిగ్గజం, ఆపిల్ కొత్త సీఈఓ ఆధ్వర్యంలో అంతర్నిర్మిత కెమెరాలతో కూడిన ఏఐ-ఆధారిత వేరబుల్స్‌ను విడుదల చేయవచ్చు. వీటిలో ఆపిల్ ఫస్ట్ స్మార్ట్ గ్లాసెస్, కెమెరాలతో కూడిన ఏఐ-ఆధారిత ఎయిర్‌పాడ్స్, మరియు పుకార్లు వస్తున్న ఏఐ పెండెంట్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అంతేకాకుండా, టెర్నస్ నాయకత్వంలో టచ్‌స్క్రీన్‌తో కూడిన ఫస్ట్ మ్యాక్‌బుక్, 2028 - 2030 మధ్య రాబోయే ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) గ్లాసెస్ మరియు 20-అంగుళాల ఫోల్డబుల్ స్క్రీన్‌ను కలిగి ఉండే ఫస్ట్ ఫోల్డబుల్ ఐప్యాడ్ మోడల్ కూడా విడుదల కావచ్చు.


అందుతున్న సమాచారం మెడకు పైన తెలిపిన ఉత్పత్తులు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందున, ఈ కొత్త ఆపిల్ పరికరాలు ఎప్పటికైనా మార్కెట్లోకి వస్తాయో లేదో చెప్పడం కష్టం. అందువల్ల, ఈ వాదనలను అంతగా నమ్మకూడదు. రాబోయే నెలల్లో కంపెనీ యొక్క ఉత్పత్తుల గురించి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. 

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Apple : ఆపిల్ ప్రియులకు భారీ షాక్.. త్వరలోనే ఐఫోన్, ఐప్యాడ్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం
  2. Oppo Reno 16 : భారత మార్కెట్లోకి ఒప్పో రెనో 16 సిరీస్.. ఫోన్ వెనుక భాగంలో అంతరిక్ష గ్రహం తిరిగేలా క్రేజీ డిజైన్
  3. xiaomi 18 pro : స్మార్ట్‌ఫోన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ అప్‌డేట్.. సరికొత్త 2K ప్రైవసీ స్క్రీన్‌తో వస్తున్న షాఓమీ 18 ప్రో
  4. OnePlus 16T : వన్‌ప్లస్ నుంచి కాంపాక్ట్ మొబైల్.. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రాసెసర్‌తో వన్‌ప్లస్ 16T లీక్
  5. Infinix : భారత్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో పినిన్‌ఫారినా ఎడిషన్ లాంచ్.. ఇటాలియన్ రేసింగ్ కార్ డిజైన్‌తో క్రేజ్
  6. Ai+ Nova : భారత మార్కెట్లోకి Ai+ నుంచి రెండు సరికొత్త 5G ఫోన్లు.. తక్కువ ధరలోనే నోవా సిరీస్ హల్చల్
  7. Mobile Comparison : టెక్నో పోవా 8 వర్సెస్ వీవో T5 ప్రో వర్సెస్ రియల్‌మి 15 ప్రో.. రూ.30 వేల బడ్జెట్‌లో ఏది బెస్ట్?
  8. Coolpad : మార్కెట్లోకి కూల్‌ప్యాడ్ కొత్త బడ్జెట్ ఫోన్.. ఐఫోన్ లాంటి అదిరిపోయే డిజైన్‌తో కూల్ 80 లాంచ్
  9. Magnetic Cooling : ఇకపై గ్యాస్ అక్కర్లేదు.. కంప్రెసర్ అవసరం లేదు.. అయస్కాంతంతో పనిచేసే ఏసీలు, ఫ్రిజ్‌లు
  10. Smartphones : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రివర్స్ ట్రెండ్.. సరికొత్త మిడ్-రేంజ్ 4G ఫోన్ల రీ-ఎంట్రీ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »