Amazon Great Summer Sale 2026 : అమెజాన్ సమ్మర్ సేల్.. రూ.1.30 లక్షల ఫోన్ ఇప్పుడు కేవలం రూ.95 వేలకే

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 సేల్‌లో శామ్‌సంగ్, యాపిల్, వన్‌ప్లస్ వంటి దిగ్గజ కంపెనీల ఫోన్లపై ఊహించని రీతిలో ధరలు తగ్గనున్నాయి.

Amazon Great Summer Sale 2026 : అమెజాన్ సమ్మర్ సేల్.. రూ.1.30 లక్షల ఫోన్ ఇప్పుడు కేవలం రూ.95 వేలకే
ముఖ్యాంశాలు
  • అమెజాన్ గ్రేట్ సమ్మర్ 2026 సేల్‌లో శామ్‌సంగ్, యాపిల్, వన్‌ప్లస్ తగ్గింపు
  • వన్‌ప్లస్ నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్ రూ.52,999 నుంచి రూ.36,999కి తగ్గింది
  • యాపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 15 మోడళ్లపై కూడా భారీ డిస్కౌంట్లు ఉంటాయని అమెజాన్
ప్రకటన

Amazon Great Summer Sale 2026 : వేసవి కాలంలో స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అమెజాన్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 మే 8వ తేదీ నుంచి ప్రారంభమైంది.  ఈ సేల్‌లో శామ్‌సంగ్, యాపిల్, వన్‌ప్లస్ వంటి దిగ్గజ కంపెనీల ఫోన్లపై ఊహించని రీతిలో ధరలు తగ్గనున్నాయి. ఇప్పటికే కొన్ని స్మార్ట్‌ఫోన్ల ఆఫర్ ధరలను అమెజాన్ రివీల్ చేయగా, మరికొన్నింటిని సస్పెన్స్‌లో ఉంచింది.

శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు

ఈ సేల్‌లో అందరి దృష్టి శామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా పైనే ఉంది. రూ.1,29,999 అసలు ధర కలిగిన ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ ఏకంగా రూ.94,999కే అందించబోతోంది. అంటే దాదాపు రూ.35,000 ఆదా చేసుకునే అవకాశం ఉంది. అలాగే, ఫోల్డబుల్ ఫోన్ ఇష్టపడే వారి కోసం శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 ధరను కూడా రూ.1,67,999 కి తగ్గించారు. గెలాక్సీ M17 5G వంటి బడ్జెట్ ఫోన్లు కూడా రూ.13,999కే లభించనున్నాయి.

వన్‌ప్లస్, ఐకూ బ్రాండ్ల సందడి

వన్‌ప్లస్ అభిమానులకు కూడా ఈ సేల్ పండగ లాంటిదే. వన్‌ప్లస్ నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్ రూ.52,999 నుంచి రూ.36,999కి తగ్గింది. ఇక ప్రీమియం మోడల్ వన్‌ప్లస్ 13ని రూ.64,999 కే సొంతం చేసుకోవచ్చు. గేమింగ్ లవర్స్ ఎంతో ఇష్టపడే  iQOO 15 ధరను రూ.76,999 నుంచి రూ.66,999 కి తగ్గించారు.  iQOO 15R పై కూడా 45 వేల లోపు బెస్ట్ గేమింగ్ డీల్స్ ఉంటాయని అమెజాన్ టీజ్ చేస్తోంది.

Product Name List Price Effective Sale Price Buying Link
Samsung Galaxy S25 Ultra Rs. 1,29,999 Rs. 94,999 Buy Now
OnePlus Nord 6 Rs. 52,999 Rs. 36,999 Buy Now
iQOO 15 Rs. 76,999 Rs. 66,999 Buy Now
OnePlus 13 Rs. 79,999 Rs. 64,999 Buy Now
Samsung Galaxy Z Fold 7 Rs. 1.74,999 Rs. 1,67,999 Buy Now
Redmi Note 15 Rs. 22,999 Rs. 26,999 Buy Now
Lava Bold N2 Rs. 9,499 Rs. 8,149 Buy Now
Samsung Galaxy M17 5G Rs. 16,499 Rs. 13,999 Buy Now
Realme Narzo 90x 5G Rs. 15,999 Rs. 13,999 Buy Now

ఐఫోన్, రియల్‌మీ మోడళ్లపై భారీ ఆశలు

యాపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 15 మోడళ్లపై కూడా భారీ డిస్కౌంట్లు ఉంటాయని అమెజాన్ ధృవీకరించింది. బడ్జెట్ విభాగంలో రియల్‌మీ నార్జో 100 లైట్ 5G, నార్జో 90x 5G ఫోన్లు రూ.13,000 నుంచి రూ.14,000 మధ్యలో అందుబాటులో ఉండనున్నాయి. లావా బోల్డ్ N2 వంటి దేశీ బ్రాండ్ ఫోన్లు రూ.8,149 కే లభిస్తాయి.

బ్యాంక్ ఆఫర్స్, అదనపు ప్రయోజనాలు

నేరుగా లభించే తగ్గింపులతో పాటు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు లేదా ఈజీ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉన్నవారికి అదనపు క్యాష్‌బ్యాక్ ఉంటుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాలు కూడా ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులు ఒక రోజు ముందుగానే ఈ సేల్‌ను యాక్సెస్ చేయవచ్చు. మరిన్ని అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.

#తాజా కథనాలు
  1. Nothing CMF Watch 3 Pro : నథింగ్ నుంచి మరో క్రేజీ స్మార్ట్‌వాచ్..ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
  2. ChatGPT : ఓపెన్ ఏఐపై క్రిమినల్ ఎంక్వయిరీ.. షూటింగ్‌కు ప్లాన్ వేయడానికి ChatGPT సాయం చేసిందా..?
  3. iPhone 18 Pro: శామ్సంగ్ & ఇతరేతర కంపెనీలకు పెద్ద దెబ్బేసిన యాపిల్
  4. Flipkart Summer Sale 2026 : ఐఫోన్ లవర్లకు పండగే పండగ.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 17 ధరలు
  5. Amazon Great Summer Sale 2026 : అమెజాన్ సమ్మర్ సేల్.. రూ.1.30 లక్షల ఫోన్ ఇప్పుడు కేవలం రూ.95 వేలకే
  6. Amazon Great Summer Sale 2026 : అమెజాన్ సమ్మర్ సేల్ ధమాకా.. స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు
  7. Biggest E commerce platform Amazon announced Great Summer Sale check the Sale date bank offers and deal
  8. Apple Could Launch These New Devices Once John Ternus Takes Over
  9. Xiaomi 17T Key Specifications Revealed Via Benchmarking Site
  10. Vivo X500 Pro Max Tipped to Feature 200-Megapixel Periscope Telephoto Lens
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »