అమెజాన్ తన భారీ గ్రేట్ సమ్మర్ సేల్ ప్రకటించింది. ఈ ఏడాది మే 8వ తేదీ నుంచి ఈ సేల్ ప్రారంభమైంది.
Photo Credit: Photo Credit - Amazon / Samsung
Amazon Great Summer Sale 2026: వేసవి కాలం వచ్చేసింది.. దాంతో పాటు అమెజాన్ కూడా తన భారీ గ్రేట్ సమ్మర్ సేల్ ప్రకటించింది. ఈ ఏడాది మే 8వ తేదీ నుంచి ఈ సేల్ ప్రారంభమైంది. ఈ విక్రయాల్లో ముఖ్యంగా స్మార్ట్ టీవీలపై భారీగా డిస్కౌంట్లను అందిస్తోంది. సామ్సంగ్, షియోమీ, టీసీఎల్ వంటి అగ్రశ్రేణి బ్రాండ్లపై కళ్లు చెదిరే ఆఫర్లను అమెజాన్ ఇప్పటికే టీజ్ చేసింది. మీ ఇంటిని హోమ్ థియేటర్గా మార్చుకోవాలనుకునే వారికి ఇది సరైన సమయం. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సందర్భంగా స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లపై ఏకంగా 65 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. సామ్సంగ్, టీసీఎల్, షియోమీ, ఎల్జీ, సోనీ, ఏసర్, ఫిలిప్స్ వంటి ప్రముఖ బ్రాండ్ల టీవీలు మునుపెన్నడూ లేని విధంగా తక్కువ ధరకు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేల్లో కేవలం బడ్జెట్ ధరలోని టీవీలే కాకుండా, ప్రీమియం శ్రేణికి చెందిన మినీ ఎల్ఈడీ, క్యూలెడ్ టీవీలపై కూడా అమెజాన్ భారీ డీల్స్ ఇస్తోంది. బడ్జెట్ ప్రొజెక్టర్ల కోసం చూస్తున్న వారికి బోట్, వాట్జ్కో వంటి బ్రాండ్ల నుంచి స్పెషల్ ఆఫర్లు ఉండనున్నాయి.
ఈ సేల్లో అత్యంత ఆకర్షణీయమైన డీల్స్లో ఒకటి టీసీఎల్ బ్రాండ్కు చెందిన 55 అంగుళాల మినీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ. దీని అసలు ధర సుమారు రూ.1,19,990 కాగా, సేల్ సమయంలో దీనిని కేవలం రూ.42,240కే సొంతం చేసుకోవచ్చు. అంటే వినియోగదారులు ఒక్క టీవీ కొనుగోలుపైనే ఏకంగా రూ.77,000 వరకు ఆదా చేసే అవకాశం ఉంది. ఈ టీవీ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో బెస్ట్ విజిబిలిటీని అందిస్తుంది. గేమింగ్ లవర్స్ కు, సినిమా అభిమానులకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
కేవలం టీసీఎల్ మాత్రమే కాకుండా, ఇతర ప్రముఖ మోడళ్లపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. సామ్సంగ్ బ్రాండ్ నుంచి 43 అంగుళాల ఫుల్ హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ, టీసీఎల్ నుంచి 32 అంగుళాల క్యూలెడ్ గూగుల్ టీవీ, షియోమీ నుంచి 43 అంగుళాల 4కే ఫైర్ టీవీ, ఫిలిప్స్ నుంచి 43 అంగుళాల ఫ్రేమ్లెస్ గూగుల్ టీవీ మోడల్స్ భారీ తగ్గింపు ధరలతో వినియోగదారులను పలకరించనున్నాయి. ప్రస్తుతం ఈ టీవీల ధరలు రూ.22,000 నుంచి రూ.38,000 మధ్య ఉండగా, సేల్ సమయంలో వీటి ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది.
నేరుగా లభించే తగ్గింపులతో పాటు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు లేదా ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మరింత అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. వారు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే అదనంగా పొదుపు చేసుకోవచ్చు. అంతేకాకుండా రూ.2,500 పైన కొనుగోలు చేసే వారికి రూ.250 క్యాష్బ్యాక్, రూ.2,00,000 పైన కొనుగోలు చేస్తే అదనంగా 3 శాతం తగ్గింపు వంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు తమకు నచ్చిన టీవీలను ఇప్పుడే విష్లిస్ట్లో చేర్చుకోవాలని అమెజాన్ సూచిస్తోంది.
ప్రకటన
ప్రకటన
Aliens: Fireteam Elite 2 Announced for PC and Consoles, Will Launch This Summer