ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న అతిపెద్ద డీల్ వన్‌ప్లస్ 13పై ఉంది

ఈ ఫెస్టివల్ సేల్‌లో SBI క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులకు గరిష్టంగా 10% వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న అతిపెద్ద డీల్ వన్‌ప్లస్ 13పై ఉంది

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లపై కొన్ని మంచి డిస్కౌంట్లను అందిస్తుంది.

ముఖ్యాంశాలు
  • వన్‌ప్లస్ ఫోన్లపై రూ. 15,000 వరకు తగ్గింపు
  • బ్యాంక్ ఆఫర్లు, 24 నెలల నో-కాస్ట్ EMI సౌకర్యం
  • SBI కార్డ్స్‌పై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్
ప్రకటన

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 ఇప్పటికే ప్రారంభమైంది. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ప్రైమ్ మెంబర్స్‌కి సేల్ ఇప్పటికే లైవ్‌లో ఉంది, ఇతర యూజర్ల కోసం ఈ సేల్ సెప్టెంబర్ 23, 2025 నుంచి ప్రారంభమవుతుంది. బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు కలిపి కొత్త ఫోన్‌ను తక్కువ ధరలో కొనడానికి ఇదే సరైన సమయం. ముఖ్యంగా వన్‌ప్లస్ మొబైల్స్‌పై వస్తున్న డీల్స్ వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా మారుతున్నాయి.వన్‌ప్లస్ ఫోన్లు ఎప్పటిలాగే ప్రీమియం డిజైన్, ఫ్లాగ్‌షిప్ స్థాయి పనితీరు, యూజర్-ఫ్రెండ్లీ ఆక్సిజన్‌OS తో ఫ్లాగ్‌షిప్ మరియు మిడ్-రేంజ్ విభాగాల్లో ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్లలో ముందుంటాయి. ఈ సేల్‌లో లభిస్తున్న ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు కలిపి వన్‌ప్లస్ ఫోన్ కొనడానికి ఇది బంగారు అవకాశం అని చెప్పవచ్చు.

ఈ సేల్‌లో వన్‌ప్లస్ మొబైల్స్‌పై అనేక ఆసక్తికర ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు SBI క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు 5% అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే రివార్డ్స్ గోల్డ్ ప్రోగ్రామ్ ద్వారా మరో 5% క్యాష్‌బ్యాక్ కూడా పొందొచ్చు. అంతేకాదు, 24 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న అతిపెద్ద డీల్ వన్‌ప్లస్ 13పై ఉంది. 2025 ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన ఈ ఫోన్ అసలు ధర రూ. 72,999. అయితే డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు కలిపి కస్టమర్లు దీన్ని కేవలం రూ. 47,999కే కొనుగోలు చేయవచ్చు. ఇంత తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనడం అరుదు. కాబట్టి వన్‌ప్లస్ అభిమానులకు ఇది మిస్ చేయరాని ఆఫర్ అని చెప్పాలి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025లో వన్‌ప్లస్ మొబైల్స్‌పై అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ 13R మోడల్ అసలు ధర రూ. 44,999 కాగా, సేల్‌లో ఇది రూ. 35,999కి లభిస్తుంది. వన్‌ప్లస్ Nord CE5 అసలు ధర రూ. 24,999 ఉండగా, ఇప్పుడు రూ. 21,749కి కొనుగోలు చేయవచ్చు. ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 13 మోడల్ రూ. 72,999 నుంచి తగ్గించి రూ. 57,999కి అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ 13s మోడల్ రూ. 57,999 ధర నుంచి తగ్గించి రూ. 47,999కి లభిస్తోంది. అలాగే వన్‌ప్లస్ Nord 4 అసలు ధర రూ. 32,999 ఉండగా, ఇప్పుడు కేవలం రూ. 25,499కే లభిస్తోంది. వన్‌ప్లస్ Nord CE4 Lite రూ. 20,999 నుంచి తగ్గించి రూ. 18,499కి అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ Nord CE4 కూడా రూ. 24,999 ధర నుంచి తగ్గించి రూ. 18,499కి లభిస్తోంది. చివరిగా, వన్‌ప్లస్ Nord 5 మోడల్ రూ. 34,999 నుంచి తగ్గించి రూ. 28,749కి అందుబాటులో ఉంది.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఫెస్టివల్ సేల్‌లో అదిరే ఆఫర్లు.. సెక్యూరిటీ కెమెరాల ధర ఎంతంటే
  2. ఈ ఇప్పుడు మార్కెట్‌లో వాషింగ్ మెషీన్స్‌పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి
  3. ఈ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధరను కంపెనీ రూ. 94,900కి తగ్గించింది.
  4. త్వరలో రియల్ మీ నుంచి సరికొత్త ఫోన్, ఈ మొబైల్లో అదిరిపోయే కొత్త ఆప్షన్లు, స్పెసిఫికేషన్లు
  5. అమెజాన్ సేల్లో 2025 అదిరిపోయే డీల్స్, విద్యార్థులకు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు
  6. ఈ కేటగిరీలో ఉత్తమ డీల్‌గా లెనోవో V15 G4 ల్యాప్‌టాప్‌ చెప్పుకోవచ్చు
  7. క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్, వడ్డీ లేని EMI ఆప్షన్లు కూడా లభిస్తున్నాయి.
  8. ఫెస్టివల్ సేల్‌లో 2 ఇన్ 1 ల్యాప్‌టాప్‌లపై అదిరే ఆఫర్లు.. ఏ ఏ మోడల్ ఎంతకు వస్తుందంటే?
  9. ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025లో హోమ్ అప్లయన్సెస్‌పై అద్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి.
  10. ఈ సేల్‌లో లభించే ఆఫర్లతో మీ కొనుగోలు మరింత లాభదాయకంగా మారుతుంది.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »