HONOR 500: Snapdragon 8s Gen 4; HONOR 500 Pro: Snapdragon 8 Elite ప్రాసెసర్
Photo Credit: HONOR
బ్యాటరీలో కూడా రెండు ఫోన్లు శక్తివంతమైన 8000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. ఇవి 80W వైర్డ్ ఛార్జింగ్, 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తాయి
HONOR తన కొత్త ఫ్లాగ్షిప్-క్లాస్ మిడ్రేంజ్ లైన్అప్ HONOR 500 మరియు HONOR 500 Pro ను చైనా మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించింది. ఇవి కంపెనీ ముందే ఇచ్చిన హామీ మేరకు విడుదలయ్యాయి. ఈ రెండు ఫోన్లు 6.55-అంగుళాల FHD+ OLED ఫ్లాట్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 6000 nits HDR పీక్ బ్రైట్నెస్, మరియు స్క్రీన్ చుట్టూ కేవలం 1.05mm అల్ట్రా-న్యారో బెజెల్స్ తో వస్తున్నాయి.
ప్రాసెసింగ్ స్పీడ్ లో కూడా HONOR ఈసారి పెద్ద మార్పులు చేసింది. HONOR 500 లో తాజా Snapdragon 8s Gen 4 చిప్సెట్ ఉంటే, HONOR 500 Pro లో మరింత శక్తివంతమైన Snapdragon 8 Elite ప్రాసెసర్ను అందించింది. గేమింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన HONOR Phantom Engine ఈ సిరీస్లో ముఖ్య హైలైట్. ఇది ప్రముఖ MOBA గేమ్ ఆడేటప్పుడు 120fps స్థిర ఫ్రేమ్రేట్ అందించగలదని, 1% Low Frames వద్ద కూడా 118.4fps సాధిస్తుందని కంపెనీ చెప్తోంది. అంతేకాకుండా “0.00% జిట్టర్ రేట్” అని కూడా HONOR ధైర్యంగా ప్రకటించింది.
డిజైన్ విషయంలో HONOR 500 సిరీస్ మొత్తం మూన్లైట్ సిల్వర్, ఆక్వా మెరైన్, స్టార్ లైట్ పింక్, అబ్సిడియన్ బ్లాక్ మొదలైన నాలుగు రంగుల్లో లభ్యం కానుంది. వెనుక కెమెరా మాడ్యూల్ కొత్తగా రూపొందించిన Crystal Island డిజైన్ తో మరింత స్థల వినియోగం అందిస్తుంది. ఫోన్ బాడీ మందం కేవలం 7.75mm, అలాగే నీరు మరియు దూళి నుండి రక్షణకు IP68, IP69, IP69K సర్టిఫికేషన్లు ఉన్నాయి.
కెమెరా విభాగంలో HONOR ఈసారి పెద్ద అప్గ్రేడ్ను ఇచ్చింది. రెండూ ఫోన్లు 200MP ప్రధాన కెమెరాతో వస్తున్నాయి, ఇది తన విభాగంలో “largest in its class” అని కంపెనీ చెబుతోంది. అందుకు తోడు 12MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. Pro మోడల్లో అదనంగా 50MP 3X టెలిఫోటో లెన్స్ కూడా ఇవ్వబడింది. ప్రధాన మోడల్లో 4.5 CPIA స్టెబిలైజేషన్, Pro లో 5.0 CPIA, ఇది తన క్లాస్లో అత్యుత్తమ ఇమేజ్ స్టెబిలైజేషన్ అని HONOR పేర్కొంది. సెల్ఫీల కోసం ఇవి 50MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉన్నాయి.
బ్యాటరీలో కూడా రెండు ఫోన్లు శక్తివంతమైన 8000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. ఇవి 80W వైర్డ్ ఛార్జింగ్, 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తాయి. Pro మోడల్లో అదనంగా 50W వైర్లెస్ ఛార్జింగ్, అలాగే మరింత ఖచ్చితమైన 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ప్రింట్ సెన్సర్ అందించబడింది.
కీ స్పెసిఫికేషన్లలో 6.7-inch FHD+ OLED 120Hz ప్యానెల్, 100% DCI-P3 కలర్ గాముట్, 3840Hz PWM డిమ్మింగ్ ఉన్నాయి. మెమరీ వేరియంట్లలో 12GB/16GB RAM తో పాటు 256GB నుండి 1TB వరకూ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. సాఫ్ట్వేర్ భాగంలో ఇవి తాజా Android 16 ఆధారిత MagicOS 10.0 నడుస్తాయి. 5G, Wi-Fi 7, Bluetooth 6.0, స్టీరియో స్పీకర్లు, USB Type-C ఆడియో వంటి కనెక్టివిటీ ఫీచర్లు రెండింటిలోనూ అందుబాటులో ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన