గేమింగ్ ప్రియులకు ప్రత్యేక ఫీచర్‌తో ఐకూ నియో 10 విడుదల

ప్రముఖ బ్రాండ్ ఐకూ, నియో 10 మోడల్‌ను మే 26న ఇండియాలో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 చిప్‌ సెట్, 1.5K డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీతో పాటు అత్యాధునిక ఫీచర్లు కలిగి ఉంది

గేమింగ్ ప్రియులకు ప్రత్యేక ఫీచర్‌తో ఐకూ నియో 10 విడుదల

Photo Credit: iQOO

iQOO నియో 10 ఇన్ఫెర్నో రెడ్ మరియు టైటానియం క్రోమ్ కలర్ ఆప్షన్లలో వస్తుంది

ముఖ్యాంశాలు
  • ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌సెట్‌తో లభ్యమవుతుంది
  • ఈ ఫోన్‌లో 1.5K డిస్‌ప్లే, IP65 వాటర్‌ప్రూఫ్ రేటింగ్ ఉంది
  • 7000mm² వ్యాపర్ ఛాంబర్‌తో థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉంది
ప్రకటన

ప్రముఖ మొబైల్‌ బ్రాండ్ ఐకూ మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. నియో సిరీస్‌లో ఐకూ 10 పేరుతో సోమవారం విడుదల చేసింది. ఈ గ్యాడ్జెట్‌లో స్నాప్ డ్రాగన్ 8s చిప్‌సెట్‌ను వాడారు. ఇందులో 7,000mAh బ్యాటరీ ఉంది. ఇది 120W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనిలో డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ65 రేటింగ్ ఉంది. గేమ్స్‌ ఆడేటప్పుడు ఓవర్ హీట్ కాకుండా 7000mm sq వ్యాపర్‌ ఛాంబర్‌ థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ ఉంది. ఐకూ 10 నియోలో 50 MP డ్యుయల్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం ముందు వైపు 32 MP కెమెరా అమర్చారు. 144fps గేమింగ్‌తో ఈ సెగ్మెంట్‌లో వస్తున్న మొదటి స్మార్ట్ ఫోన్ ఇదేనని ఐకూ వెల్లడించింది. భారత్‌లో విడుదలైన మోడల్‌లో, చైనా ఐకూ నియో 10తో పోలిస్తే డిజైన్, స్పెసిఫికేషన్స్ పరంగా చాలా తేడాలు ఉన్నాయి.ఐకూ నియో 10 ధర,ఇక ధర విషయానికొస్తే..8జీబీ+128జీబీ వేరియంట్‌ రూ.31,999 వద్ద లభిస్తుంది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.33,999 కాగా 12జీబీ+256జీబీ వేరియంట్ రూ.35,999గా ఉంది. హైఎండ్‌ వేరియంట్‌ 16జీబీ+512జీబీ స్టోరేజీతో వస్తోంది. దీని ధర రూ.40,999.

ప్రీమియం కలర్స్

ఐకూ నియో 10 ఇన్‌ఫెర్నో రెడ్, టైటానియం క్రోమ్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. ప్రీ బుకింగ్స్ ఇప్పటికే‌ ప్రారంభమయ్యాయి. జూన్‌ 3 నుంచి అమెజాన్‌, ఐకూ ఇండియా ఈ స్టోర్లలో లభ్యమవుతుంది.iQOO నియో 10 స్పెసిఫికేషన్స్,ఈ గ్యాడ్జెట్ 6.78 అంగుళాల డిస్‌ప్లే, 1.5k ఆమోల్డ్ స్క్రీన్‌తో వచ్చింది. 144 హెడ్జ్ రీఫ్రెష్ కలిగి ఉంది. వీటితో పాటు 360 హెడ్జ్ శాంపిలింగ్ రేట్, 5,500 నిట్స్ బ్రైట్‌నెస్‌ ఉంది. దీనిలో 4,420 హెడ్జ్ పీడబ్యూఎం డిమింగ్ రేట్‌ కూడా ఉంది.

ఇందులో స్నాప్‌ డ్రాగన్ 8 జనరేషన్ 4 ప్రాసెసర్‌ అమర్చారు. ఇది క్యూ1 గేమింగ్ చిప్‌సెట్‌తో జోడించబడి ఉంటుంది. దీనిలో 16జీబీ అల్ట్రా ర్యామ్ ఉంటుంది. 512జీబీ వరకు స్టోరేజ్ ఉంది. ఈ గ్యాడ్జెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్‌పై పనిచేస్తుంది.కెమెరా,ఇక కెమెరా విషయానికొస్తే.. ఈ గ్యాడ్జెట్ వెనుక భాగంలో డ్యుయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ IMX88 సెన్సార్ కలిగి ఉండటం విశేషం. ఇది ఆఫ్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కలిగి ఉంది. ఇందులో 8MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియోలు తీసేందుకు ఫ్రంట్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అమర్చారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు 60fps వద్ద 4kలో వీడియో రికార్డింగ్ చేయగలవు.

ఓవర్ హీట్ తగ్గించేలా..

గేమింగ్ సమయంలో ఫోన్‌ ఓవర్‌ హీట్‌ కాకుండా ప్రత్యేక సౌకర్యంలో ఇందులో ఉంది. దీనికోసం 7000mm sq వ్యాపర్‌ ఛాంబర్‌ థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ను పొందుపరిచారు. 144fps గేమింగ్‌తో ఈ కేటగిరిలో వస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం గమనార్హం. అలాగే ఇది బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ నైట్ విజన్ మోడ్‌ను కలిగి ఉంది. గేమింగ్ సమయంలో ఇది 3,000Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంటుంది.

లాంగ్ లైఫ్ బ్యాటరీ

ఐకూ నియో 10లో 7,000mAh బ్యాటరీ అమర్చారు. ఇది 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో వస్తోంది. సెక్యూరిటీ పరంగా ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సర్ ఉంది. డస్ట్, ఫ్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ 65 రేటింగ్‌ కూడా కలిగి ఉంది. దీని బరువు 206 గ్రాములు. ఈ హ్యాండ్ సెట్ తేలికగా ఉంటుంది. కనెక్టివిటీ పరంగా ఇందులో 5జీ, 4జీ, వై-ఫై-7, బ్లూటూత్ 5.4, జీపీఎస్, NFC, ఓటీజీ, USB టైప్‌ సీ ఫోర్ట్‌ ఫీచర్లు కలిగి ఉంది.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఈ ఫోన్‌లో ప్రత్యేకించి ప్రో విజువల్ ఇంజిన్ ఉంటుంది, దీని ద్వారా పలు ఏఐ ఆధారిత ఎడిటింగ్ టూల్స్ అందుబాటులో ఉంటాయి
  2. ఈ ఫోన్‌ 4400mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 30 నిమిషాల్లో 50% ఛార్జ్
  3. ChatGPT said: ఆఫర్లు బ్యాంక్, కూపన్ డిస్కౌంట్లు, నో కాస్ట్ EMIతో ఎఫెక్టివ్ ధరలకు అందుబాటులో ఉన్నాయి
  4. ఈ ఆఫర్లు బ్యాంక్ ఆఫర్లు, కూపన్‌లతో లభ్యమవుతూ నో కాస్ట్ EMI ఫైనాన్స్ ఎంపికలు అందుబాటులో
  5. జూలై 14న ఇండియ‌న్ మార్కెట్‌లోకి Vivo X Fold 5, Vivo X200 FE
  6. స‌రికొత్త బ్యాట‌రీ అప్‌గ్రేడ్‌తో మార్కెట్‌లోకి iPhone 17 Pro Max
  7. ఇది మిడ్ రేంజ్‌ సెగ్మెంట్లో గట్టి పోటీగా జూలై 12 నుంచి అమెజాన్‌లో లభ్యం
  8. ప్రైమ్ డే 2025: ఎకో, ఫైర్ టీవీ, కిండిల్‌లపై గరిష్ఠంగా 50% డిస్కౌంట్
  9. నథింగ్ హెడ్‌ఫోన్ 1లో 1040mAh బ్యాటరీ ఉంది, 120 నిమిషాల్లో Type-C ద్వారా ఛార్జ్ అవుతుంది
  10. నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ Android 15 ఆధారంగా రూపొందించిన నథింగ్ OS 3.5 పై రన్ అవుతుంది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »