Photo Credit: iQOO
iQOO Z10 టర్బో సిరీస్ కైబేసికల్ IP65 దూసి మరియు తెరిపు-ఎతిర్పు విలువను కలిగి ఉంది
తాజాగా, iQOO Z10 టర్బో, iQOO Z10 టర్బో ప్రో లు చైనాలో విడుదల అయ్యాయి. ఈ రెండు మోడల్స్ కూడా 50- మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 16- మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో రూపొందించబడ్డాయి. అలాగే, వీటికి స్పెషల్ క్యూ1 గేమింగ్ చిప్, 144 హెచ్‌జెడ్ వరకూ డిస్‌ప్లేను అందించారు. సాధారణంగా, iQOO Z10 టర్బో సిరీస్ మోడల్‌లలో అందించే మీడియాటెక్ డైమెన్సిటీ 8400 ప్రాసెసర్‌ను అమర్చారు. అయితే, టర్బో ప్రో వేరియంట్‌లో మాత్రం స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌ను అందించారు. ఈ రెండూ ఆండ్రాయిడ్ 15తో OriginOS స్కిన్‌తో రూపొందిచబడ్డాయి. ఇది డస్ట్, స్ల్పాష్ నియంత్రణకు ఐపీ65 రేటింగ్‌తో వస్తున్నాయి.చైనాలో ధరలు ఇలా,చైనాలో iQOO Z10 టర్బో ప్రో 12జీబీ+256జీబీ వేరియంట్ ధర CNY 1999( రూ.23400) గా ఉంది. మరో మోడల్ iQOO Z10 టర్బో 12జీబీ+256జీబీ వెర్షన్ ధర CNY 1799(సుమారు రూ. 21100)గా ఉంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు కూడా డెసర్ట్ కలర్, సీస్ ఆఫ్ క్లౌడ్స్ వైట్, బర్న్, స్టార్రి స్కై బ్లాక్ రంగుల ఆప్షన్‌లలో లభిస్తాయి. వివో చైనా ఈ- స్టోర్ వెబ్‌సైట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
రాబోయే ఈ రెండూ 6.78 అంగుళాల 1.5కే AMOLED స్క్రీన్‌ను 144 హెచ్‌జెడ్ వరకూ రిఫ్రెష్‌రేట్, 3000హెచ్‌జెడ్ వరకూ టన్ శాంప్లింగ్ రేట్‌తో ఉన్నాయి. డిస్‌ప్లే 4400నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 4320 హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎం డి్మ్మింగ్ రేట్, హెచ్‌డీఆర్10+ సపోర్ట్‌తోపాటు బ్లూలైట్, లో ప్లికర్ సర్టఫికేషన్‌లను సపోర్ట్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ రెండూ 16జీబీ వరకూ LPDDR5X ర్యామ్, 512జీబీ వరకూ యూఎఫ్ఎస్4.1 ఆన్‌బోర్డ్ స్టోరేజీని కలిగి ఉన్నాయి.
iQOO Z10 టర్బో సిరీస్‌లో 50- మెగాపిక్సెల్ సోనీ ఎల్‌వైటీ 600 ప్రైమరీ రియల్ కెమెరా, 16- మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటాయి. ప్రో వేరియంట్‌లో 8- మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, వెనిల్లాలో 2- మెగాపిక్సెల్ సెకండరీ డెప్త్ సెన్సార్‌ను అందించారు. Z10 టర్బో ఫోన్ 90 W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7620 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. టర్బో ప్రో 120 W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000 mAh బ్యాటరీతో వస్తోంది. ఇవి సెక్యూరిటీ నిమిత్తం, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌లతోపాటు ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌లను కలిగి ఉంటాయి.
కనెక్టివిటీ ఆప్షన్‌లలో ప్రధానంగా 5జీ, డ్యూయల్ 4జీ VoLTE, జీపీఎస్, బ్లూటూత్ 6.0, Wi-Fi, గెలీలియో, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సీ 2.0 పోర్ట్‌లు ఉన్నాయి. అలాగే, ఈ రెండు ఫోన్‌లు దుమ్ము- నీటి నియంత్రణకు ఐపీ65 రేటింగ్‌ను పొందాయి. 163.72× 75.88× 8.09 ఎంఎం పరిమాణంతో బేస్ మోడల్ 212 గ్రాములు, టర్బో ప్రో వేరియంట్ 206 గ్రాముల బరువును కలిగి ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన