Photo Credit: iQOO
సైబర్ గ్రీన్ షేడ్‌లో iQOO Z10 లైట్ 5G
ప్రస్తుతం ఇండియాలో మొబైల్ మార్కెట్ చాలా వేగంగా మారిపోతోంది. ప్రతి వారం ఏదో ఒక కొత్త ఫోన్ రిలీజ్ అవుతోంది. అలా రిలీజైన వాటిలోనే ఒక కొత్త మోడల్ IQOO Z10 Lite. ఇది ప్రముఖ బ్రాండ్ Vivoకి చెందిన IQOO సబ్-బ్రాండ్ నుంచి వచ్చిందే.ఇటీవలే ఇండియన్ మార్కెట్‌కి లాంచ్ అయిన ఈ ఫోన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఏ ఫోన్ అయినా ప్రాసెసర్ బలంగా ఉండాలి...ఈ ఫోన్‌లో MediaTek Dimensity 6300 చిప్ ఉంది. సాధారణ యూజర్‌కు కావలసిన పనులు అన్నీ స్మూత్‌గా చేయొచ్చు. అంతేకాదు, Android 15 బేస్డ్ ఫన్ టచ్ OS 15తో వస్తోంది. మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా ఇస్తారట, ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి.స్పెసిఫికేషన్స్ & ఫీచర్స్,ఈ IQOO Z10 లైట్ మొబైల్లో స్టోరేజ్ ఆప్షన్స్ చూస్తే...4GB RAM + 128GB, 6GB RAM + 128GB, 8GB RAM + 256GB ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. స్టోరేజ్ ఆప్షన్ బట్టి ఫోన్ ధర మారుతూ వస్తుంది. రూ.9,999, రూ.10,999 రూ.12,999 గా వీటి ధరలు ఉన్నాయి. అలాగే రెండు కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. సైబర్ గ్రీన్, టైటానియం బ్లూ కలర్స్ లో మీకు నచ్చిన కలర్ ఎంచుకోవచ్చు.
ఈ ఫోన్‌లో ఉన్న 6000mAh బ్యాటరీ నిజంగా ఆకట్టుకుంటోంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 70 గంటల పాటలు, 37 గంటల టాక్‌టైమ్ రావచ్చు. అంటే మ్యూజిక్ లవర్స్‌కి, ఎక్కువ కాల్స్ చేసే వాళ్లకి ఇది చాలా యూజ్‌ఫుల్. ఫాస్ట్
ఛార్జింగ్ పెట్టుకునేందుకు 15W ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు.రూ.10,000 ధరలో 6000mAh బ్యాటరీ బ్యాక్అప్ ఇస్తున్న ఏకైక ఫోన్ గా IQOO Z10 లైట్ నిలిచింది.
ఇక ఫోటోలు దిగేవారికి అనువుగా మంచి కెమెరా సెట్ అప్ ని కూడా ఇందులో పెట్టారు. ఈ మొబైల్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సల్ సోనీ ఏఐ కెమెరా, 2 మెగా పిక్సెల్ షూటర్ కెమెరా, మంచి మంచి సెల్ఫీలు దిగేందుకు ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను కూడా బిల్ట్ చేశారు. ఏఐ టెక్నాలజీ ని ఉపయోగించుకుని ఫోటోలు బ్యూటీఫికేషన్ కూడా చేసుకోవచ్చు. డాక్యుమెంట్ మోడ్ లోకి కన్వెర్ట్ చెయ్యడానికి, ఎరేజ్ చేయడానికి, ఇన్హెన్స్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఫోన్ సైజు విషయానికి వస్తే 6.74 అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. 90Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయ్. బయట ఉండి ఫోన్ యూస్ చేసిన కూడా స్క్రీన్ క్లియర్‌గా స్క్రీన్ కనిపిస్తుంది. IP64 రేటింగ్ ఉంది కాబట్టి, తడిచినా కూడా ఎటువంటి భయం లేకుండా వాడవచ్చు.
రూ.10,000 దాకా బడ్జెట్ పెట్టుకుని మంచి బ్యాటరీ, డిస్‌ప్లే, కెమెరా, పర్ఫార్మెన్స్ అన్నీ బేలెన్స్‌గా కావాలంటే IQOO Z10 Lite ఓ విలువైన ఆప్షన్. స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, మ్యూజిక్ లవర్స్ అందరికీ సూటవుతుంది
ప్రకటన
ప్రకటన