రిలయన్స్ Jio ఇప్పుడు భారతీయ మొబైల్ మార్కెట్‌లోకి JioBharat J1 4G పేరుతో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌ను ఆవిష్కరించింది. దీనిని 4G కనెక్టివిటీతో ఎంట్రీ-లెవల్ ఫీచర్ ఫోన్‌గా దేశంలో పరిచయం చేసినట్లు కంపెనీ వెల్లడించింది.
Jio యొక్క స్పెషల్ JioBharat ప్లాన్‌కు మద్దతుగా కంపెనీ ఈ హ్యాండ్‌సెట్ బడ్జెట్ ఆఫర్ అందిస్తోంది. ఇది JioTV, JioCinema, JioPay వంటి అప్లికేషన్‌లతో ముందే ఇన్‌స్టాల్ చేసి వినియోగదారులకు అందించబోతున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. అలాగే, ఫోన్ వెనుక కెమెరా యూనిట్ కూడా అమర్చబడి, ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాదు, Jio తక్కువ ధరలో అందించే JioBharat ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ఈ ఫోన్‌ను రీఛార్జి చేసుకునేలా రూపొందించారు. ఇది గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఆవిష్కరించబడిన JioBharat B1 4G ఫోన్‌లతో పోలిస్తే తక్కువ ధరతోపాటు పెద్ద డిస్‌ప్లేను అందిస్తోందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే విషయాన్ని ఇప్పటికే కంపెనీ సైతం వెల్లడించింది. ఈ మోడల్‌కు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలను గమనిస్తే..
455+ చానెళ్లను యాక్సెస్..ప్రస్తుతం JioBharat J1 4G భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. డార్క్ గ్రే కలర్ ఆప్షన్‌లో లిస్టయిన ఈ ఫీచర్ ఫోన్ Amazon ద్వారా కేవలం రూ.1,799లకు లభిస్తోంది. ప్రత్యేక నేవిగేషన్ ప్లస్ ఫిజికల్ కీప్యాడ్‌తోపాటు 2.8 అంగుళాల డిస్ ప్లేను అందిస్తున్నారు. ఈ ఫోన్ Threadx RTOS వర్షన్‌తో పని చేస్తుంది. 0.13GB ఆన్ బోర్డ్ స్టోరేజీ కెపాసిటీతో 128GB వరకూ స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశాన్ని ఇస్తున్నారు. వినియెగదారులు ముందే ఇన్‌స్టాల్ చేసిన జియో టీవీ యాప్ ద్వారా పలు రీజనల్ చానెళ్లతో కలిసి 455+ చానెళ్లను యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే, యూపీఐ లావాదేవీలు తేలిగ్గా జరిపేందుకు JioPay యాప్‌ను కూడా వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఈ JioBharat J1 4G ఫోన్‌ను 2,500mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీతో రూపొందించారు. 3.5 ఎంఎం ఆడియో జాక్, రేర్ లో డిజిటల్ కెమెరా యూనిట్, ఆన్ లైన్ పేమెంట్స్ కోసం యూజర్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి కెమెరా ఉపయోగపడుతుంది. UPI పేమెంట్ చేసేందుకు అవకాశం ఉండటంతో పాటు Jio సినిమా యాప్ ద్వారా OTT సర్వీసులను కూడా పొందే అవకాశం ఉంటుంది. HD కాలింగ్ సపోర్టు దీనికి అధనపు ఆకర్షణగా చెప్పొచ్చు.
4G సేవలకు మార్చడమే లక్ష్యంగా..Jio 4G రీఛార్జ్ ప్లాన్‌ని కూడా పరిచయం చేశారు. నెలవారీగా 14GB డేటాని అందిస్తూ అపరమిత వాయిస్ కాల్స్ పొందేలా 123 రూపాయల 4G రీచార్జి ప్లాన్‌ను తీసుకువచ్చింది. 2G వినియోగదారులను 4G సేవలకు మార్చడమే లక్ష్యంగా Jio సంస్థ ఈ తరహా JigBharat ఫోన్‌లను, ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే Jio పలు పీచర్స్‌తో ఫోన్‌లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ప్లాన్లను పరిశీలిస్తే.. ప్రస్తుతం 28 రోజుల ప్లాన్ ధర రూ.189 ఉండగా.. JioBharat ప్లాన్ రూ.123కి లభిస్తోంది. అలాగే, 56 రోజులకు రూ.234, 336 రోజులకు రూ.1234 చెల్లించేలా ప్లాన్‌లను అందిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రణాళికలతో వినియోగదారులను తనవైపు తిప్పుకోవడంలో Jio ఎప్పుడూ ముందుంటోందని ఇప్పటికే మార్కెట్‌లో మంచి పేరుంది. ఈ మోడల్ సేల్‌తో మార్కెట్ రెవెన్యూ కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. మరి ఈ JioBharat J1 4G ఫోన్‌తో ఆ పేరును మరోసారి నిలుబెట్టుకుంటుందో లేదో వేచి చూడాలి.