Photo Credit: Lava
త్వరలోనే Lava Blaze Duo స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచ్ కానుంది. ఇప్పటికే, కంపెనీ ఈ హ్యాండ్‌సెట్ విడుదల తేదీని వెల్లడించింది. అలాగే, ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్స్‌తోపాటు కీలకమైన స్పెసిఫికేషన్స్‌ను ప్రకటించింది. త్వరలో రాబోయే స్మార్ట్ ఫోన్ RAM వేరియంట్‌లతోపాటు డిస్‌ప్లే, కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ, OSల పూర్తి వివరాలు బహిర్గతమయ్యాయి. ఈ అక్టోబరు నెలలో ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అయిన Lava Agni 3 మోడల్ ఫోన్‌కు సంబంధించిన డిజైన్ పోలి ఉండేలా వెనుక ప్యానెల్‌పై అమర్చిన సెకండరీ డిస్‌ప్లేతో ఇది అందుబాటులోకి రానుంది.
Lava Blaze Duo స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 16న మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో లాంచ్ కానున్నట్లు అమెజాన్ మైక్రోసైట్ వెల్లడించింది. అంతేకాదు, ఈ ఫోన్ ఈ-కామర్స్ సైట్ ద్వారా మన దేశంలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉండనున్నట్లు స్పష్టం చేసింది. అలాగే, ఆర్కిటిక్ వైట్, సెలెస్టియల్ బ్లూ అనే రెండు రంగులలో ఇది లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ వెనుక ప్యానెల్‌లో చిన్న, దీర్ఘచతురస్రాకార సెకండరీ స్క్రీన్‌తో రూపొందించబడిన డ్యూయల్ డిస్‌ప్లేలతో రానున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు, 6.78-అంగుళాల 120Hz 1.5K ప్రధాన AMOLED డిస్‌ప్లేతో పాటు రెండో డిస్‌ప్లే 1.74-అంగుళాల AMOLED టచ్‌స్క్రీన్‌తో విడుదల అయిన Lava Agni 3 ఫోన్ డిజైన్ పోలికతో రానుంది.
ఈ Lava Blaze Duo హ్యాండ్‌సెట్‌ను 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల 3D కర్వ్డ్ AMOLED ప్రధాన డిస్‌ప్లేతో రూపొందించారు. అలాగే, వెనుకవైపున ఇది 1.58-అంగుళాల సెకండరీ AMOLED స్క్రీన్‌తో వస్తుంది. అంతేకాదు, ఈ హ్యాండ్‌సెట్ MediaTek Dimensity 7025 5G ప్రాసెసర్‌తో వస్తోంది. ఇది AnTuTu స్కోర్ 5,00,000 కంటే ఎక్కువ అని కంపెనీ స్పష్టంగా చెబుతోంది.
అమెజాన్ లిస్టవుట్‌లో Lava Blaze Duo స్మార్ట్ ఫోన్ 6GB, 8GB LPDDR5 RAMకి సపోర్ట్ ఇస్తున్నట్లు వెల్లడైంది. ఈ వేరియంట్‌లు వరుసగా 6GB, 8GB వర్చువల్ RAM పెంచుకునేలా సపోర్ట్ ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 128GB UFS 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుందని స్పష్టం అయ్యింది. దీంతో పాటు ఈ హ్యాండ్‌సెట్ Android 14-ఆధారిత UI అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో నడుస్తోంది. అలాగే, ఇది ఆండ్రాయిడ్ 15కి అప్‌గ్రేడ్ అయినట్లు కూడా వెల్లడైంది.
ఈ Lava Blaze Duo స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. 64-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా సెన్సార్, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో వస్తోంది. అలాగే, ఫోన్‌కు 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందించారు. ఇక సెక్యూరిటీ కోసం ఈ హ్యాండ్‌సెట్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించినట్లు కంపెనీ స్పష్టం చేసింది. అయితే, ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి అప్‌డేట్స్ కావాలంటే మాత్రం డిసెంబర్ 16 వరకూ వేచి చూడాల్సిందే.
ప్రకటన
ప్రకటన