ప్రతి కొత్త iPhoneకు ఒక సంవత్సరపు వారంటీతో పాటు, 90 రోజుల ఉచిత టెక్నికల్ సపోర్ట్ లభ్యం. AppleCare+ తీసుకుంటే ఈ వారంటీ కాలాన్ని కొనుగోలు తేదీ నుంచి రెండేళ్ల వరకు పొడిగించుకోవచ్చు. అదేవిధంగా, అనుకోకుండా జరిగిన నష్టాలకు అంటే యాదృచ్ఛిక డ్యామేజ్‌కు, అన్లిమిటెడ్ రిపేర్ సపోర్ట్ అందుతుంది.
Photo Credit: Apple
ఆపిల్ రిపేర్ ఫీజులు: స్క్రీన్/బ్యాక్ గ్లాస్ ₹2,500, ఇతర డ్యామేజ్ ₹8,900గా ఉంది
ఆపిల్ ఇండియాలో AppleCare+ కోసం కొత్త, మరింత సౌకర్యవంతమైన సబ్‌స్క్రిప్షన్ ఎంపికలను ప్రకటించింది. వార్షిక ప్లాన్‌లతో పాటు ఇప్పుడు నెలసరి ప్లాన్‌లను కూడా అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా ప్రారంభించిన ఈ స్కీమ్స్‌తో వినియోగదారులు తమ ఆపిల్ పరికరాలకు పూర్తిస్థాయి రక్షణను మరింత తక్కువ ఖర్చుతో కొనసాగించవచ్చు. ప్రత్యేకంగా iPhone కోసం అందించిన AppleCare+ with Theft and Loss ప్లాన్‌లో ప్రతి సంవత్సరం రెండు సార్లు దొంగతనం లేదా కోల్పోవడం వంటి ఘటనలకు కూడా కవరేజ్ పొందే అవకాశం ఉండడం ప్రధాన ఆకర్షణ. దీనితో పాటు ప్రాధాన్య సపోర్ట్, బ్యాటరీ రీప్లేస్‌మెంట్ వంటి ఇప్పటి వరకు అందిస్తున్న అన్ని సర్వీసులు కొనసాగుతాయి.
ప్రతి కొత్త iPhoneకు ఒక సంవత్సరపు వారంటీతో పాటు, 90 రోజుల ఉచిత టెక్నికల్ సపోర్ట్ లభ్యం. AppleCare+ తీసుకుంటే ఈ వారంటీ కాలాన్ని కొనుగోలు తేదీ నుంచి రెండేళ్ల వరకు పొడిగించుకోవచ్చు. అదేవిధంగా, అనుకోకుండా జరిగిన నష్టాలకు అంటే యాదృచ్ఛిక డ్యామేజ్‌కు, అన్లిమిటెడ్ రిపేర్ సపోర్ట్ అందుతుంది.
ఆపిల్ తెలిపిన వివరాల ప్రకారం, ఒక్కో రిపేర్ ఘటనకు ఫీజులు ఇలా ఉన్నాయి. స్క్రీన్ లేదా బ్యాక్ గ్లాస్ డ్యామేజ్ రూ.2,500, ఇతర యాక్సిడెంటల్ డెమేజ్ రూ.8,900 గా ఉంది .ఇప్పటి వరకు AppleCare+ ప్లాన్‌లు సంవత్సరానికి ఒకసారి రిన్యువల్ చేసే విధానంలో మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు వినియోగదారులు నెలసరి మరియు వార్షిక ప్లాన్‌లను ఎంచుకునే అవకాశం లభిస్తోంది. ఈ కొత్త ప్లాన్‌లు రూ.799 నెలసరి ఛార్జ్‌తో ప్రారంభమవుతున్నాయి.
"ఈ మార్పులతో భారత వినియోగదారులకు మా అత్యంత సమగ్రమైన iPhone కవరేజ్‌ను మరింత సులభంగా, చవకగా అందించే అవకాశాన్ని కల్పిస్తున్నాం," అని ఆపిల్ VP Kaiann Drance వెల్లడించారు. కొత్త iPhone కొనుగోలు సమయంలోనే AppleCare+ ను జత చేసుకోవచ్చు. అవసరమైతే, పరికరం కొనుగోలు చేసిన 60 రోజుల లోపు కూడా ఈ కవరేజ్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. iPhone, iPad లేదా Mac లోని Settings యాప్ ద్వారా సబ్‌స్క్రిప్షన్‌ను చూడడం, మార్చడం అతితక్కువ సులభం.
AppleCare+ తీసుకోవడం ద్వారా బ్యాటరీ రీప్లేస్‌మెంట్ సేవ, 24x7 ప్రాధాన్య సపోర్ట్,
అనుకోని నష్టాలకు అపరిమిత రిపేర్లు వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రిపేర్లలో అన్ని అసలు ఆపిల్ భాగాలే వాడటం ప్రత్యేకత.
లిక్విడ్ డామేజ్ కూడా AppleCare+ రక్షణ ఇస్తుంది. నీరు లేదా మరే ఇతర లిక్విడ్స్ తగిలినా, ఫోన్‌ను అదనపు ఖర్చు లేకుండా సెర్వీస్ చేయించుకోవచ్చు. బ్యాటరీ హెల్త్ 80% కంటే తక్కువగా తగ్గితే ఉచిత బ్యాటరీ మార్పిడి చేస్తారు. అదనంగా, ఏవైనా హార్డ్‌వేర్ సమస్యలకూ దీర్ఘకాలిక వారంటీ లభిస్తుంది.
ప్రకటన
ప్రకటన
Single Papa OTT Release Date: When and Where to Watch Kunal Khemu’s Upcoming Comedy Drama Series?
Diesel Set for OTT Release Date: When and Where to Harish Kalyan's Action Thriller Online?