Photo Credit: Qualcomm
చైనా మార్కెట్‌లో OnePlus 13 ఈ నెలలో ఏదో ఒక రోజున తప్పనిసరిగా లాంచ్ కాబోతున్నట్లు స్పష్టమైన సమాచారం ఉంది. అయితే, విడుదలకు సంబంధించిన ఖచ్చితమైన తేదీపై అధికారికంగా నిర్ధారణ కాలేదు. Qualcomm ప్రాసెసర్‌తో సరికొత్తగా ఈ OnePlus ఫోన్‌లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. OnePlus 13 న్యూ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ లేదా స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతున్నట్లు భావిస్తున్నారు. ఈ ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ ప్రాసెసర్ Xiaomi, Oppo నుండి వచ్చే తర్వాతి మోడల్‌లను పోలి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Qualcomm న్యూ స్నాప్‌డ్రాగన్ 8 ప్రాసెసర్‌ను పరిచయం చేస్తూ రాబోయే స్నాప్‌డ్రాగన్ సమ్మిట్‌ను అధికారిక మైక్రోసైట్‌లో ఇప్పటికే వీడియోను పోస్ట్ చేసింది. ఈ సరికొత్త ప్రాసెసర్‌లో ఓరియన్ కోర్స్‌లు ఉంటాయని ఆ వీడియోతో స్పష్టమవుతోంది. ఈ తాజా కోపిలట్+ PCలకు శక్తినిచ్చే స్నాప్‌డ్రాగన్ X ప్రాసెసర్‌లో ఆ తరహా ఆర్కిటెక్చర్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఓరియన్ కోర్స్‌ల పనితీరుతోపాటు వాటి శక్తి సామర్థ్యాలను మరింత మెరుగుపరిచేలా వీటిని తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ వీడియోలో రౌండ్ కెమెరా డిజైన్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ న్యూ ప్రాసెసర్‌తో పరిచయం అవుతున్నట్లు కనిపిస్తోంది. దీని ప్రోటోటైప్ రాబోయే OnePlus 13 మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉంది. ప్రోటోటైప్‌లో OnePlus సిగ్నేచర్ కెమెరా మాడ్యూల్ ఎగువ భాగాన అమర్చబడి ఉంటుంది. ఇది OnePlus 12, OnePlus 11 డిజైన్ మాదిరిగానే కనిపిస్తోంది. అదనంగా, OnePlus చైనా ప్రెసిడెంట్ లూయిస్ లీ తన Weiboలో న్యూ స్నాప్‌డ్రాగన్ 8 టీజర్ ప్రాసెసర్‌తో వీడియోను రీపోస్ట్ చేసారు. ఇది Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో వచ్చిన ప్రపంచంలోనే మొదటి స్మార్ట్‌ఫోన్ OnePlus 13 అవుతుందని చెప్పబడుతోంది.
న్యూ చిప్‌సెట్ అక్టోబర్ 22న హవాయిలోని మాయిలో స్నాప్‌డ్రాగన్ సమ్మిట్ సందర్భంగా లాంచ్ అవుతోంది. Xiaomi 15 స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో లాంచ్ అయిన మొదటి స్మార్ట్‌ఫోన్‌గా రావాల్సి ఉంది. అలాగే, iQOO, Honor, Oppo కూడా చైనాలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్-పవర్‌తో ఆపరేట్ చేసే ఫోన్‌లతో సమానంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
గతంలో వచ్చిన లీక్‌ల ఆధారంగా.. OnePlus 13 6.82-అంగుళాల LTPO BOE X2 మైక్రో క్వాడ్ కర్వ్డ్ OLED డిస్‌ప్లేతో 2K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీనిలో 24GB వరకు RAM, 1TB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీని అందించినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. OnePlus 13 హ్యాండ్‌సెట్ 50-మెగాపిక్సెల్ LYT-808 ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. కెమెరా సెటప్‌లో 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో షూటర్ కూడా ఉండవచ్చు.
ప్రకటన
ప్రకటన