Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో రియల్‌మీ 16T 5G పై కళ్లు చెదిరే ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రియల్‌మీ 16T 5G కి చెందిన 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.31,991 ధర వద్ద లిస్ట్ అయింది.

Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో రియల్‌మీ 16T 5G పై కళ్లు చెదిరే ఆఫర్లు

Photo Credit: Realme

Realme 16T

ముఖ్యాంశాలు
  • ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ధమాకా ఆఫర్
  • రూ.30 వేల బడ్జెట్‌లో తిరుగులేని రియల్‌మీ 5G
  • 8,000mAh బ్యాటరీ, IP69 ప్రొటెక్షన్‌తో వచ్చిన దిగ్గజ ఫోన్‌పై భారీ డిస్కౌంట
ప్రకటన

Flipkart Freedom Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న ఫ్రీడమ్ సేల్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రూ.30,000 బడ్జెట్‌లో ఆకర్షణీయమైన ఫీచర్లు, భారీ బ్యాటరీ కలిగిన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి రియల్‌మీ 16T 5G బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ఉపయోగించుకోవడం ద్వారా ఈ పవర్ఫుల్ ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

ధర, బ్యాంక్ డిస్కౌంట్, ఎఫెక్టివ్ ప్రైస్ వివరాలు 
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రియల్‌మీ 16T 5G కి చెందిన 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.31,991 ధర వద్ద లిస్ట్ అయింది. అయితే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి కొనుగోలు చేస్తే ఫ్లాట్ రూ.3,250 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ఎఫెక్టివ్ ఆఫర్ ధర రూ.28,741కి తగ్గుతుంది. అంతేకాకుండా పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.29,500 వరకు ఆదా చేసుకునే వెసులుబాటును ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది. అయితే ఈ ఎక్స్ఛేంజ్ బోనస్ విలువ మీ పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

రియల్‌మీ 16T 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు 
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.8 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.. అలాగే ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్ మీ UI 7 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఫోన్ హీట్ అవ్వకుండా వేపర్ చాంబర్, గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. నీరు, దుమ్ము నుంచి పూర్తి రక్షణ కోసం అత్యున్నత IP69 రేటింగ్‌తో పాటు మిలిటరీ-గ్రేడ్ షాక్-రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను కూడా ఇచ్చారు. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫైంగర్ ప్రింట్ స్కానర్ ఉంది.

Vivo S2 vs iQOO Neo 10 vs OnePlus Nord 6 : ఈ మూడింట్లో ఏది కొనడం బెస్ట్ ?

కెమెరా క్వాలిటీ, అతిపెద్ద బ్యాటరీ బ్యాకప్ 
రియల్‌మీ 16T 5G వెనుక వైపు f/1.8 అపర్చర్, ఆటోఫోకస్ సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, f/2.4 అపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరాను ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 8,000mAh అతిభారీ బ్యాటరీ. దీనికి 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, VoWiFi, బ్లూటూత్ 5.3, GPS, NFC, USB టైప్-సి పోర్ట్‌లు ఉన్నాయి. ఫోన్ బరువు 224 గ్రాములుగా ఉంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Redmi Note 17 5G: 8000mAh బ్యాటరీ, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్.. రెడ్‌మీ నోట్ 17 5G సేల్ షురూ
  2. Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌కు ఆఖరి రోజు..భారీ డిస్కౌంట్‌తో 20000mAh పవర్ బ్యాంక్‌లు
  3. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో రియల్‌మీ 16T 5G పై కళ్లు చెదిరే ఆఫర్లు
  4. Vivo S2 vs iQOO Neo 10 vs OnePlus Nord 6 : ఈ మూడింట్లో ఏది కొనడం బెస్ట్ ?
  5. Realme 16x 5G: ఈ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. టెక్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న రియల్‌మీ కొత్త ఫోన్
  6. Airtel: ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఊహించని షాక్.. ఆ పాపులర్ ప్లాన్స్ క్లోజ్
  7. Pure Petrol: ఇథనాల్ లేని ప్యూర్ పెట్రోల్ కావాలా? ఈ యాప్‌తో దగ్గరలోని బంక్‌ను క్షణాల్లో కనిపెట్టేయండి
  8. Amazon Great Freedom Sale: అమెజాన్ సేల్‌లో ఐకూ Z11 Lite పై భారీ ఆఫర్లు.. 6500mAh బ్యాటరీ ఫోన్‌పై అదనపు తగ్గింపు
  9. Amazon Great Freedom Sale: స్మార్ట్ ఏఐ ఫీచర్లు, అద్భుత డిస్‌ప్లే.. గ్రేట్ ఫ్రీడమ్ సేల్లో ప్రీమియం OLED టీవీలపై లక్షల్లో డిస్కౌంట్
  10. Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. శామ్‌సంగ్, ఏసర్, లెనోవో ట్యాబ్‌లపై ఆఫర్ల వర్షం
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »