6,300mAh బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరాతో Realme C71 లాంచ్

రియల్ మీ C 71 స్మార్ట్ ఫోన్ మిడిల్ క్లాస్ బడ్జెట్ రేంజ్ లో అవైలబుల్ గా ఉంది. రూ.10000 ప్రారంభ ధరలో ఇది లభిస్తుంది. రెండు డిఫరెంట్ స్టోరేజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. స్టోరేజ్ ఆప్షన్ బట్టి ఫోన్ ప్రైస్ మారుతుంది.

6,300mAh బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరాతో Realme C71 లాంచ్

Photo Credit: Realme

Realme C71 బ్లాక్ నైట్ ఔల్ మరియు స్వాన్ వైట్ రంగులలో వస్తుంది

ముఖ్యాంశాలు
  • 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6300 mAh బ్యాటరీ బ్యాకప్
  • 50 మెగాపిక్సల్ AI రేర్ కెమెరా యూనిట్, 5 మెగాపిక్సల్స్ సెల్ఫీ కెమెరా యూనిట
  • 2 డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది
ప్రకటన
చైనా మొబైల్ బ్రాండ్ అయినా రియల్ మీ ఇండియన్ మొబైల్ మార్కెట్లో లాంచ్ అయిన దగ్గర నుండి రాణిస్తూనే ఉంది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా కొత్త కొత్త వేరియంట్లను లాంచ్ చేస్తూ మార్కెట్లో షేర్ పెంచుకుంటూ ఉంది. తాజాగా రియల్ మీ నుండి కొత్త బడ్జెట్ ఫోన్ రియల్ మీ C 71 లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ ఫోన్ ని సెలెక్టెడ్ మార్కెట్లలో రిలీజ్ చేశారు. ప్రజెంట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్లకు తగ్గట్టుగానే అన్ని స్పెసిఫికేషన్లు ఈ ఫోన్లో ఇన్క్లూడ్ అయి ఉన్నాయి. రియల్ మీ C 71 ఫీచర్స్,ఈ రియల్ మీ C 71 స్మార్ట్ ఫోన్ లో 6300mAh బ్యాటరీ బ్యాక్అప్ ఇస్తున్నారు. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 9 అవర్స్ గేమ్ ఆడవచ్చు అని రియల్ మీ చెబుతుంది. ఈ మొబైల్లో డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంపిలింగ్ రేట్, 725 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. వీటికి అదనంగా స్మార్ట్ టచ్ ఫీచర్ కూడా ఈ ఫోన్లో ఉన్నట్టు రియల్ మీ పేర్కొంది. కెమెరా క్వాలిటీ చూస్తే 50 మెగాపిక్సెల్  AI బేస్డ్ రేర్ కెమెరా యూనిట్ ఈ మొబైల్ లో ఉంది.

దీనికి Unisoc T7250 చిప్ సెట్ కూడా ఇన్స్టాల్ అయ్యుంటుంది. ప్రత్యేకించి సెల్ఫీలు, వీడియో చాటింగ్ కొరకు 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

డ్యూయల్ నానో సిమ్స్ స్లాట్స్ తో వస్తున్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ రియల్ మీ UI ప్రాసెసర్ తో వస్తుంది.  ఇక కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే దీనిలో Beidou, Galileo, GLONASS నావిగేషన్ సిస్టం, బ్లూటూత్ 5.2, వైఫై, USB టైప్ C కనెక్టివిటీని ఉన్నాయి. ఇందులో ఎక్స్లరేషన్ సెన్సార్, ఫ్లిక్కర్ సెన్సార్, మ్యాగ్నెటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, సైడ్ కెపాసిటివ్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఉన్నాయి.  ఈ ఫోన్ 165.80x75.90x7.79mm డైమెన్షన్స్ తో 196g బరువు ఉంటుంది.

ఈ రియల్ మీ C 71 మొబైల్లో ప్రత్యేకించి ఆర్మర్ షెల్ బిల్ట్ తో వస్తుంది. మిలటరీ స్టాండర్డ్ షాక్ ప్రూఫ్ టెస్టులు కూడా పాస్ అయింది. ఈ మొబైల్ లో ఉన్న సోనిక్ వేవ్ వాటర్ ఎజక్షన్ టెక్నాలజీ ద్వారా మొబైల్ లోకి నీరు వెళ్లినా కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు. ఈ రేంజ్ ఫోన్ లో ఇది బెస్ట్ ఫీచర్ అని చెప్పవచ్చు.
స్టోరేజ్ & ప్రైస్,ఈ రియల్ మీ C 71 రెండు డిఫరెంట్ స్టోరేజ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. 4GB RAM + 128GB వేరియంట్ ధర రూ.10000 ఉంది. అలాగే 6GB RAM + 128GB రూ.

12000 ఉంది. ఇది ప్రస్తుతం సెలెక్టెడ్ మార్కెట్లలో బ్లాక్ నైట్ ఓవెల్, స్వాన్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇండియాలో ఈ ఫోన్ ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుంది అనేది ప్రస్తుతానికి రియల్ మీ ఇంకా ప్రకటించలేదు.
 
Comments

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. AI ఫీచర్లతో గూగుల్ ఫిక్సల్ 10 ప్రో ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా
  2. రెడ్మీ 15 5G భారత మార్కెట్లో విడుదల... ధర, ఫీచర్స్, ఇతర స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ మీకోసం
  3. తక్కువ ధరకు 4GB RAMతో Poco M7 Plus 5G కొత్త వేరియంట్ ఫోన్, త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం
  4. iQOO 15 హ్యాండ్‌సెట్ ఫోటోలు లీక్, వేర్వేరు కలర్స్‌లో సరికొత్త లుక్‌లో హ్యాండ్‌సెట్
  5. సెప్టెంబర్ 19 నుంచి ఇవ్వాల్సిన డెలివరీలు వాయిదా పడుతున్నాయి
  6. రియల్ మీ P3 Lite 5G ధరను రియల్‌ మీ చాలా ఆకర్షణీయంగా నిర్ణయించింది.
  7. నథింగ్ ఇయర్ 3 లో మార్పులివే
  8. ఐఫోన్ లవర్స్‌కి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్
  9. ఇటీవల ఐఫోన్ 17 సిరీస్ భారత్‌లో విడుదల కావడంతో, ఐఫోన్ 16 ధరను తగ్గించారు
  10. ఈ సిరీస్ ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్ల మార్కెట్‌లో పోటీని మరింత పెంచే అవకాశం ఉంది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »