Photo Credit: Redmi
భారత్ మార్కెట్‌లోకి Redmi Note 14 Pro+, Redmi Note 14 Pro, Redmi Note 14లు అడుగు పెట్టాయి. ఈ కొత్త నోట్ సిరీస్ హ్యాండ్‌సెట్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల OLED డిస్‌ప్లేతో 3000నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉన్నాయి. అలాగే, Note 14 మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్‌తో రన్ అవుతుండగా, Note 14 Pro ఫోన్ అండర్ ది హుడ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300-అల్ట్రా ప్రాసెసర్‌తో వస్తోంది. ఇక ప్రీమియం మోడల్ Redmi Note 14 Pro+ Snapdragon 7s Gen 3 ప్రాసెర్‌తో వస్తోంది. వీటిలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అమర్చారు. అలాగే, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,200mAh బ్యాటరీతో అందించారు.
Redmi Note 14 Pro+ 8GB + 128GB వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది. Redmi Note 14 Pro 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,999 నుండి ప్రారంభమవుతుంది. అలాగే, 8GB + 256GB ధర రూ. 25,999గా ఉంది. Redmi Note 14 8GB + 128GB వెర్షన్ ప్రారంభ ధర రూ. 17,999గా ఉంది. ఇవి డిసెంబర్ 13 మధ్యాహ్నం 12 గంటలకు Mi.com, Flipkartలతోపాటు ఇతర రిటైల్ స్టోర్‌లలో అమ్మకాలకు వస్తున్నాయి.
Note 14 Pro+ డ్యూయల్ సిమ్ (నానో)తో Xiaomi Android 14-ఆధారిత HyperOS 1.0 ఇంటర్‌ఫేస్‌పై రన్ అవుతోంది. ముందు భాగంలో 20-మెగాపిక్సెల్ సెన్సార్‌తో వస్తుంది. 5G, Wi-Fi 6, USB టైప్-C పోర్ట్, బ్లూటూత్ 5.4, GPS, గెలీలియో, GLONASS, Beidou, NFCలను కలిగి ఉన్నాయి. 162.53x74.67x8.75mm పరిమాణంతో 210.8 గ్రాములు బరువు ఉంటుంది. ఈ ఫోన్ నాలుగు సంవత్సరాల ఫ్లూయెన్సీ సర్టిఫికేట్‌తో వస్తోంది.
Redmi Note 14 Pro+ మాదిరిగానే SIMతోపాటు సాఫ్ట్‌వేర్, స్పెసిఫికేషన్‌లు కూడా Redmi Note 14 Pro, Redmi Note 14లోనూ అందించారు. Redmi Note 14 Pro మోడల్ 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. Redmi Note 14 Pro 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. 20-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను కూడా అందిస్తున్నారు.
Redmi Note 14 ఫోన్ 50-మెగాపిక్సెల్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. Redmi Note 14 Pro IP68-రేటెడ్ బిల్డ్‌తో, స్టాండర్డ్ మోడల్ దుమ్ము నియంత్రణ కోసం IP64-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉన్నాయి. Redmi Note 14 Pro 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని, Note 14 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,110mAhని కలిగి ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన