రెడ్మీ నోట్ 17 5G బేస్ వేరియంట్ (6GB RAM + 128GB) ప్రారంభ ధర రూ.27,999 కాగా, హై-ఎండ్ వేరియంట్ (8GB RAM + 256GB) ధర రూ.30,999 గా నిర్ణయించారు.
Redmi Note 17
Redmi Note 17 5G: భారత మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెడ్మీ నోట్ 17 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ఈరోజు నుంచి అధికారికంగా ప్రా రంభమైంది. రూ.30,000 లోపు విభాగంలో అనేక పవర్ఫుల్ ఫోన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, రెడ్మీ తన మార్క్ ఫీచర్లతో ఈ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. 8000mAh భారీ బ్యాటరీ, 6.9-ఇంచ్ బిగ్ AMOLED డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, సుదీర్ఘ సాఫ్ట్వేర్ సపోర్ట్ వంటి అనేక హైలైట్స్‌తో ఈ ఫోన్ టెక్ లవర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ధరలు, కలర్స్, లాంచ్ ఆఫర్లు
రెడ్మీ నోట్ 17 5G బేస్ వేరియంట్ (6GB RAM + 128GB) ప్రారంభ ధర రూ.27,999 కాగా, హై-ఎండ్ వేరియంట్ (8GB RAM + 256GB) ధర రూ.30,999 గా నిర్ణయించారు. లాంచ్ ఆఫర్ కింద ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఏకంగా రూ.3,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌తో పాటు షియోమీ అధికారిక ఆన్లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇది ఆర్కిటిక్ బ్లూ, డార్క్ నైట్, స్టార్ లైట్ పర్పల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
డిస్ప్లే క్వాలిటీ, స్నాప్‌డ్రాగన్ పెర్ఫార్మెన్స్
ఈ ఫోన్లో 6.9-ఇంచ్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కలిగి ఉంది. ఇందులో ఇచ్చిన హైడ్రోటచ్ 2.0 ఫీచర్ ద్వారా చేతులు తడిగా ఉన్నా కూడా డిస్ప్లే టచ్ చాలా సులభంగా పనిచేస్తుంది. పెర్ఫార్మెన్స్ కోసం 4nm ప్రాసెస్ ఆధారిత క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్‌సెట్‌ను అమర్చారు. ఇందులో 8GB వరకు LPDDR4X రామ్, 256GB వరకు UFS 2.2 స్టోరేజ్ అందుబాటులో ఉంది. మైక్రో ఎస్డీ కార్డ్ సహాయంతో స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు. హీటింగ్ సమస్యల నివారణకు వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంది.
Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్కు ఆఖరి రోజు..భారీ డిస్కౌంట్‌తో 20000mAh పవర్ బ్యాంక్‌లు
8000mAh రికార్డు బ్యాటరీ, కెమెరా, సుదీర్ఘ అప్డేట్లు
రెడ్మీ నోట్ 17 5G లో ప్రధాన ఆకర్షణ దీని 8000mAh భారీ బ్యాటరీ. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 2.5 రోజుల పాటు బ్యాటరీ వస్తుందని కంపెనీ పేర్కొంది. కెమెరా విభాగంలో వెనుక వైపు 2x డిజిటల్ జూమ్ సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, మరో సెకండరీ కెమెరా ఇచ్చారు. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3 పై రన్ అవుతుంది. కంపెనీ ఈ ఫోన్‌కు 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్డేట్లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లను ఆఫర్ చేస్తోంది. దుమ్ము, నీటి నుంచి రక్షణకు IP65 రేటింగ్ కూడా ఉంది.
ప్రకటన
ప్రకటన