MediaTek Dimensity 8400-Ultra ప్రాసెస‌ర్‌తో వ‌స్తోన్న‌ మొదటి ఫోన్‌గా Redmi Turbo 4.. లాంచ్‌ ఎప్పుడంటే..

MediaTek Dimensity 8400-Ultra ప్రాసెస‌ర్‌తో వ‌స్తోన్న‌ మొదటి ఫోన్‌గా Redmi Turbo 4.. లాంచ్‌ ఎప్పుడంటే..

Photo Credit: Xiaomi

Redmi Turbo 4 2025 ప్రారంభంలో చైనాకు చేరుకోనుంది

ముఖ్యాంశాలు
  • Redmi Turbo 4 డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో రావొచ్చు
  • ఈ హ్యాండ్‌సెట్ అల్ట్రా-స్లిమ్ బెజెల్స్‌తో ఫ్లాట్ డిస్‌ప్లేతో వ‌స్తుంద‌ని
  • MediaTek Dimensity 8400 ప్రాసెస‌ర్‌ ఈ నెలలోనే ప‌రిచ‌య‌మైంది
ప్రకటన

చైనాలో Redmi Turbo 4 స్మార్ట్ ఫోన్‌ కొత్త సంవ‌త్స‌రం 2025 ప్రారంభంలో విడుద‌ల కానుంది. అంతేకాదు, ఇదే MediaTek Dimensity 8400-Ultra ప్రాసెస‌ర్‌తో లాంచ్ అవుతున్న మొదటి ఫోన్‌గా కంపెనీ స్ప‌ష్టం చేసింది. ఇటీవ‌ల MediaTek తన డైమెన్సిటీ 8400 ప్రాసెస‌ర్‌ను ప‌రిచ‌యం చేసింది. Realme తన భవిష్యత్ స్మార్ట్ ఫోన్‌ల‌లో ఒకటి ఇదే ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని ఇప్ప‌టికే ధృవీకరించింది. అది Realme Neo 7 SE ఫోన్‌గా ఓ టిప్‌స్టర్ తెలిపారు. ఇది ఈ నెల మొద‌ట్లో చైనాలో లాంచ్ చేసిన Realme Neo 7 జాబితాలో చేర్చేలా ప్ర‌ణాళిక చేస్తున్నారు.

స్లిమ్ బెజెల్స్‌తో ఫ్లాట్ డిస్‌ప్లే

Redmi Weibo పోస్ట్‌లో తన రాబోయే Turbo 4 స్మార్ట్ ఫోన్ వ‌చ్చే ఏడాది మొద‌ట్లో లాంచ్ కానున్న‌ట్లు వెల్ల‌డించింది. అలాగే, ఇది MediaTek డైమెన్సిటీ 8400-Ultra ప్రాసెస‌ర్‌తో అందుబాటులోకి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో ఈ ప్రాసెస‌ర్‌తో వ‌స్తోన్న మొద‌టి ఫోన్‌గా గుర్తింపు పొందింది. నిజానికి, చైనాలో Redmi Turbo 4 ఫోన్‌ జనవరి 2025 నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉందని గ‌తంలోనే లీక్‌లు వ‌చ్చాయి. ఈ స్మార్ట్ ఫోన్ లీకైన డిజైన్‌ను ప‌రిశీలిస్తే.. ఈ ఫోన్‌కు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తోపాటు స్లిమ్ బెజెల్స్‌తో ఫ్లాట్ డిస్‌ప్లే ఉంటుందని తెలుస్తోంది.

Realme Neo 7 SE కావచ్చు

తాజాగా, MediaTek Dimensity 8400 ప్రాసెస‌ర్‌తో Realme ఓ కొత్త స్మార్ట్ ఫోన్‌ను ప‌రిచ‌యం చేసింది. ఈ మోడ‌ల్ ఇటీవ‌లే కంపెనీ మార్కెట్‌కు ప‌రిచ‌యం చేసింది. అయితే, రాబోయే హ్యాండ్‌సెట్ పేరును మాత్రం కంపెనీ ప్ర‌క‌టించ‌లేదు. ఓ టిప్‌స్ట‌ర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా ఇది Realme Neo 7 SE హ్యాండ్‌సెట్‌ కావచ్చునని చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ దీనికి సంబంధించిన అధికారిక ధృవీక‌ర‌ణ రాలేదు.

Arm Mali- G720 GPUతో అటాచ్

MediaTek డైమెన్సిటీ 8400 ప్రాసెస‌ర్‌ డైమెన్సిటీ 8300 పైన ఉండి, ఎనిమిది ఆర్మ్ కార్టెక్స్-A725 కోర్‌ల‌తో వ‌స్తోంది. అలాగే, ఇక్కడ ఒక ప్రైమరీ కోర్ క్లాక్ 4.32GHz వద్ద ఉంటుంది. ఇది Arm Mali-G720 GPUతో అటాచ్ చేయ‌బ‌డి ఉంటుంది. LPDDR5x RAM, UFS 4.0 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వరకు సపోర్ట్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ప్రాసెసర్‌లో MediaTek NPU 880 ఉండ‌డంతోపాటు ఇది AI వ‌ర్క్‌ల‌కు స‌పోర్ట్ చేస్తుంది.

320-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌

తాజా MediaTek ప్రాసెస‌ర్‌తో ఇన్‌బిల్ట్‌ MediaTek Imagiq 1080 ISP కూడా ఉంటుంది. ఇది మరింత కాంతిని సంగ్రహించడంతోపాటు వేగంగా ఫోకస్ చేయడంలో సహాయపడుతుందని కంపెనీ స్ప‌ష్టం చేస్తోంది. ఈ ప్రాసెస‌ర్ ఉన్న స్మార్ట్ ఫోన్‌లు గరిష్టంగా 320-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌లు, గరిష్టంగా 144Hz రిఫ్రెష్ రేట్‌తో WQHD రిజల్యూషన్‌తో డిస్‌ప్లేలకు స‌పోర్ట్ ఇస్తున్న‌ట్లు విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రి దీని ప‌ని తీరు ఎలా ఉంటుంద‌నేది తెలియాలంటే వేచి చూడాల్సిందే!

Comments
మరింత చదవడం: Redmi Turbo 4, Realme Neo 7 SE, Redmi, Realme
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఏప్రిల్ 11న భార‌త్‌లో iQOO Z10తో పాటు iQOO Z10X లాంఛ్‌.. డిజైన్‌తోపాటు కీల‌క ఫీచ‌ర్స్ బ‌హిర్గ‌తం
  2. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెస‌ర్‌తో ఇండియాలో అడుగుపెట్టిన Motorola Edge 60 Fusion
  3. ఇండియాలోని ఆరు నగరాల్లో ఈ ఏడాది డాల్బీ సినిమాను లాంఛ్ చేయ‌నున్న‌ డాల్బీ లాబొరేటరీస్
  4. Vivo Y300 Pro+, Vivo Y300t మోడ‌ల్స్ చైనాలో లాంఛ్‌.. ధ‌ర‌తోపాటు స్పెసిఫికేష‌న్స్ ఇవే
  5. ఇండియాలో లాంఛ్ అయిన Infinix Note 50X 5G.. ధర, స్పెసిఫికేషన్స్ మీకోసం
  6. రాబిన్‌హుడ్ OTT విడుదల తేదీ కూడా సిద్ధ‌మైందా.. చిత్ర యూనిట్ ఏం చెబుతోందంటే..
  7. Realme GT 7 లాంఛ్‌ టైమ్‌లైన్‌తోపాటు Realme GT 8 Pro స్పెసిఫికేషన్స్ బ‌హిర్గ‌తం
  8. ఆపిల్‌తో పాటు Qualcomm కూడా 2nm నోడ్ ఆధారంగా స్నాప్‌డ్రాగన్ ప్రాసెస‌ర్‌ల‌ను లాంఛ్ చేయ‌నుందా
  9. 11.5-అంగుళాల LCD స్క్రీన్‌తో మ‌లేషియాలో లాంఛ్ అయిన Honor Pad X9a
  10. ఆండ్రాయిడ్‌లో మోషన్ ఫోటోలకు స‌పోర్ట్ చేసేలా WhatsApp ప‌ని చేస్తోందా..
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »