Photo Credit: Oppo
నవంబర్‌లో Oppo Reno 13 సిరీస్ చైనాలో పరిచయమైంది. ఈ లైనప్‌లో బేస్‌తోపాటు రెనో 13 ప్రో వేరియంట్‌లు ఉన్నాయి. తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌లు భారత్ మార్కెట్‌లోకి రానున్నట్లు స్పష్టమైంది. కంపెనీ లైనప్ నుంచి భారత్‌లో రాబోయే లాంచ్‌ను బహిర్గతం చేసింది. అంతేకాదు, ఇక్కడి డిజైన్‌తోపాటు కలర్ ఆప్షన్స్‌ను, ఎప్పటి నుంచి స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి లాంటి విషయాలను వెల్లడించింది. Reno 13 సిరీస్ ఇండియన్ వెర్షన్‌లు కూడా చైనీస్ వెర్షన్స్ మాదిరిగానే ఉండనున్నాయి. జూలైలో విడుదలైన Oppo Reno 12 Pro 5G, Reno 12 5G లలో హ్యాండ్‌సెట్‌ల కొనసాగింపుగా ఇవి రానున్నట్లు భావిస్తున్నారు.
X పోస్ట్ ద్వారా భారతదేశంలో Oppo Reno 13 5G సిరీస్ త్వరలోనే రానున్నట్లు Oppo కంపెనీ వెల్లడించింది. దీని ఖచ్చితమైన ప్రారంభ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. Oppo ఇండియా ఈ-స్టోర్‌తో పాటు వాల్‌మార్ట్-సపోర్ట్ గల ఈ-కామర్స్ సైట్ ద్వారా రాబోయే ఫోన్‌లు మన దేశంలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ తెలిపింది. ఈ Oppo Reno 13 సిరీస్ ఫోన్‌లు రెండు RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందించబడతాయని కూడా వెల్లడైంది.
Oppo Reno 13 బేస్ వెర్షన్ ఐవరీ వైట్ షేడ్, ఇండియా-ఎక్స్‌క్లూజివ్ లుమినస్ బ్లూ కలర్‌వేలో ఇవి సందడి చేయనున్నాయి. అలాగే, ప్రో వేరియంట్ గ్రాఫైట్ గ్రే, మిస్ట్ లావెండర్ కలర్ ఆప్షన్‌లలో రానున్నాయి. ఐవరీ వైట్ వెర్షన్ 7.24mm ప్రొఫైల్‌ను, Luminous Blue వెర్షన్ 7.29mm పరిమాణంలో ఉంటుంది. ఈ రెండు వేరియంట్‌ల బరువు కూడా 181 గ్రాములుగా ఉంటుంది.
Oppo Reno 13 Pro ఫోన్ అన్ని కలర్ ఆప్షన్స్ కూడా 7.55mm మందంతో 195గ్రాముల బరువును కలిగి ఉంటాయి. రెండు ఫోన్‌లు ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో వస్తున్నాయి. రెండూ వన్-పీస్ స్కల్ప్టెడ్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌లు, OLED స్క్రీన్‌లు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i డిస్‌ప్లే ప్రొటక్షన్‌ను పొందుతున్నాయి. బేస్ మోడల్ 1.81mm సన్నని బెజిల్, 93.4 శాతం స్క్రీన్-టు-బాడీ పర్సంటేజ్‌తో, ప్రో వేరియంట్‌లో 1.62mm బెజెల్, 93.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో ఉంటోంది.
చైనాలో ఈ హ్యాండ్‌సెట్‌లు MediaTek డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌తో Android 15-ఆధారిత ColourOS 15తో రన్ అవుతున్నాయి. రెండు ఫోన్‌లు దుమ్ము, నీటి నియంత్రణ కోసం IP69 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌లతోపాటు బేస్ Oppo Reno 13 ఫోన్ 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను, Oppo Reno 13 ప్రో ఫోన్‌కు మూడవ 50-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్‌ను అందించారు. వనిల్లా వెర్షన్ 6.59-అంగుళాల ఫుల్-HD+ స్క్రీన్, 80W వైర్డు, 50W వైర్‌లెస్ సపోర్ట్‌తో 5,600mAh బ్యాటరీతో, ప్రో వేరియంట్ 6.83-అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో 5,800mAh బ్యాటరీతో వస్తుంది.
ప్రకటన
ప్రకటన