ఈ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీ ఉంటుంది. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే, IP69 రేటింగ్ ఉన్న ఈ

లీకైన వివరాల ప్రకారం ఒప్పో రెనో 14FS 5G లో 6.57 అంగుళాల AMOLED స్క్రీన్ ఉంటుందని సమాచారం.

ఈ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీ ఉంటుంది. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే, IP69 రేటింగ్ ఉన్న ఈ

Photo Credit: Oppo

ఒప్పో రెనో 14FS, రెనో 5G 14F మోడల్ (చిత్రంలో) తో అద్భుతమైన పోలికను కలిగి ఉండవచ్చు

ముఖ్యాంశాలు
  • ఈ ఫోన్‌లో 6000mAh భారీ బ్యాటరీ ఉంటుంది
  • లుమినస్ గ్రీన్ మరియు ఓపల్ బ్లూ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ వేరియంట్లలో లభి
  • జులై చివర లేదా ఆగస్టు మొదటివారంలో విడుదలయ్యే అవకాశముంది
ప్రకటన

స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త ఒప్పో తమ కొత్త ఫోన్ ఒప్పో రెనో 14FS 5G ని త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు తాజా సమాచారం. ఇటీవలే విడుదలైన రెనో 14F కి కొనసాగింపుగా, మరింత మెరుగైన ఫీచర్లతో ఈ కొత్త మోడల్ రాబోతోందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, కంపెనీ అధికారికంగా ఇంకా ఏ ప్రకటన చేయకపోయినప్పటికీ, ఆన్‌లైన్‌లో దీనికి సంబంధించిన సమాచారం ముందుగానే లీకైంది. ఒప్పో రెనో 14FS 5G ఫోన్ లుమినస్ గ్రీన్ మరియు ఓపల్ బ్లూ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ వేరియంట్లలో లభించనుంది. 12GB RAM మరియు భారీ 512GB స్టోరేజ్ వేరియంట్‌ తో ఇది మార్కెట్‌లోకి వస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే వచ్చిన బ్లూ వేరియంట్ లీక్ అయిన చిత్రం చూస్తే, ఇది రెనో 14F మోడల్‌కు చాలా దగ్గరి పోలికలతో కనిపిస్తుంది.

ధర విషయానికి వస్తే, ఈ ఫోన్‌ను యూరోపియన్ మార్కెట్‌లో సుమారు EUR 450 (భారత కరెన్సీలో సుమారుగా రూ.45,700)కి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇండియాలో కూడా ఇదే ధర ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక లాంచ్ డేట్ విషయానికొస్తే, జులై చివర లేదా ఆగస్టు మొదటివారంలో విడుదలయ్యే అవకాశముంది.

లీకైన వివరాల ప్రకారం ఒప్పో రెనో 14FS 5G లో 6.57 అంగుళాల స్క్రీన్ ఉంటుందని సమాచారం. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది, తద్వారా స్క్రోలింగ్ మరియు వీడియో అనుభవం బాగుంటుంది. ఫోన్ కి ఫ్రంట్ పార్ట్లో స్క్రీన్ మధ్యలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాకి హోల్ పంచ్ డిజైన్ ఉంటుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో Snapdragon 6 Gen 4 SoC ప్రాసెసర్ ఉపయోగించే అవకాశం ఉంది. ఇది ఆండ్రాయిడ్ 15 బేస్డ్ ColorOS 15.0.2పై నడుస్తుంది. ఇక మెయిన్ కెమెరా విషయానికి వస్తే..50MP ప్రైమరీ కెమెరా (Sony IMX882 సెన్సార్), 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాతో ఈ సెటప్ ఉంటుంది. గూగుల్ యొక్క సర్కిల్ టూ సెర్చ్ మరియు జెమిని AI అసిస్టెంట్ తో పాటు, విభిన్నమైన AI ఆధారిత ఫోటో ఎడిటింగ్ ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉండనున్నాయి.

బ్యాటరీ, ఇతర ఫీచర్లు:

ఈ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీ ఉంటుంది. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే, IP69 రేటింగ్ ఉన్న ఈ ఫోన్ దుమ్ములో పడిన, నీటిలో పడిన కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ ఫోన్ 158.16×74.9×7.7mm డైమెన్షన్స్ తో , 181 గ్రాములు బరువుతో ఉంటుంది.

ఒప్పో రెనో 14FS 5G లాంచ్‌కు ముందే బయటికి వచ్చిన ఈ లీక్ వివరాలు చూస్తే, ఇది ఓ పవర్‌ఫుల్, స్టైలిష్ ఫోన్ అని చెప్పొచ్చు. ఫోటోగ్రఫీ, మల్టీటాస్కింగ్, డిజైన్ అన్ని కలగలిపి ఉన్నాయి. కంపెనీ నుండి అధికారిక ప్రకటన రాలేకపోయినా, లీక్ అయిన డీటెయిల్స్ ఈ ఫోన్ ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అని ఎదురు చూసేలా చేస్తుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. గత మోడళ్లతో పోలిస్తే ఇవి కొద్దిగా ఎత్తుగా, వెడల్పుగా మరియు మందంగా ఉండనున్నట్లు సమాచారం..
  2. భారతి ఎయిర్‌టెల్ తాజాగా తన రూ. 189 వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌ను సైలెంట్ గా నిలిపివేసింది.
  3. మార్కెట్లోకి వచ్చిన Vivo Y500 ప్రో మోడల్.. బ్యాటరీ కెపాసిటీ ఎంతంటే?
  4. సామ్ సంగ్ గెలాక్సీ యూజర్లకు షాక్.. ఈ స్పైవేర్ గురించి తెలుసుకున్నారా?
  5. భారత మార్కెట్‌లో లావా అగ్ని 4 ధర రూ. 30,000 లోపుగా ఉండే అవకాశం ఉంది.
  6. యాపిల్ ప్లాన్ చేసిన కొత్త శాటిలైట్ ఫీచర్లు మరింత త్వరగా వినియోగదారుల చేతుల్లోకి వచ్చే అవకాశం ఉంది.
  7. మొత్తం మీద, సామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్ జనవరి చివర్లో రంగప్రవేశం చేయనున్నది.
  8. రెండు మోడళ్లలోను ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది, ఇది 95.5% స్క్రీన్-టు-బాడీ రేషియోతో ఆకట్టుకుంటుంది.
  9. రియల్‌ మీ జీటీ 8 ప్రో ఆస్టన్ మార్టిన్ ఎఫ్1 ధర ఎంతంటే?.. ఇతర విశేషాలు తెలుసుకున్నారా?
  10. వన్ ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్ అప్డేట్.. ఈ ఫీచర్స్ గురించి తెలుసుకోండి
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »