అమెజాన్ ఇండియాలో లిస్టింగ్ ప్రకారం, Samsung Galaxy M07 ధర భారత మార్కెట్లో రూ. 6,999 గా నిర్ణయించబడింది. ఇది ఒకే ఒక్క వెర్షన్ తో వస్తుంది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్ వర్షం ఉంటుందని ప్రకటించారు.
Photo Credit: Samsung
Samsung Galaxy M07 లిస్టింగ్ ప్రకారం ఇది నలుపు రంగులో వస్తుందని తెలుస్తోంది
సామ్‌సంగ్ తమ కొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy M07 ను అధికారిక ప్రకటనకు ముందే అమెజాన్ ఇండియా లిస్ట్ చేసింది. లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ ధర, ముఖ్యమైన స్పెసిఫికేషన్లు వెల్లడయ్యాయి. Samsung Galaxy M07 లో ఆండ్రాయిడ్ 15 బేస్డ్ One UI 7.0 అందించబడింది. 6.7 అంగుళాల డిస్ప్లే , 90Hz రిఫ్రెష్ రేట్, 260ppi పిక్సెల్ డెన్సిటీ కూడా ఉంది. మీడియా టెక్ హీలియో G99 ప్రాసెసర్, డ్యూయల్ రియర్ కెమెరా వంటి ఫీచర్లు ఈ మోడల్‌లో లభిస్తాయి. ముఖ్యంగా, ఈ డివైస్‌కు కంపెనీ 6 ఆండ్రాయిడ్ అప్డేట్లు మరియు 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు అందిస్తామని ప్రకటించింది.
అమెజాన్ ఇండియాలో లిస్టింగ్ ప్రకారం, Samsung Galaxy M07 ధర భారత మార్కెట్లో రూ. 6,999 గా నిర్ణయించబడింది. ఇది ఒకే ఒక్క వెర్షన్ తో వస్తుంది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్ వర్షం ఉంటుందని ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఫోన్ బ్లాక్ కలర్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇతర కలర్ ఆప్షన్లపై సమాచారం లేదు.
కొనుగోలు సమయంలో Amazon Pay ICICI క్రెడిట్ కార్డు వినియోగదారులకు 5% క్యాష్‌బ్యాక్, SBI కార్డ్స్ ద్వారా చెల్లింపు చేస్తే రూ. 325 వరకు డిస్కౌంట్ అందుతుంది. అదనంగా, EMI ఆప్షన్లు రూ. 339 నుండి ప్రారంభమవుతాయి. ఎక్స్చేంజ్ ఆఫర్లు రూ. 6,600 వరకు లభిస్తాయి. సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఈ మోడల్ లిస్టింగ్ చేయబడింది కానీ ధర, లభ్యత వివరాలు ఇంకా వెల్లడించలేదు.
కెమెరా విభాగంలో, వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా (f/1.8 అపర్చర్), 2MP డెప్త్ సెన్సార్ కలిపిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా (f/2.0 అపర్చర్) ఇవ్వబడింది.
కనెక్టివిటీ ఆప్షన్లలో Bluetooth 5.3, GPS, Glonass, BeiDou, Galileo, QZSS, Wi-Fi, 3.5mm ఆడియో జాక్, USB Type-C పోర్ట్ లభిస్తాయి. ఈ ఫోన్‌కు IP54 రేటింగ్ ఉండటంతో ఇది డస్ట్, వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. సెన్సర్లలో Accelerometer, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి.
బ్యాటరీ పరంగా, ఈ ఫోన్‌లో 5,000mAh కెపాసిటీ బ్యాటరీ ఉండి, 25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంది. ఇక ఈ ఫోన్ డైమెన్షన్స్ విషయానికి వస్తే 167.4×77.4×7.6mm, 184 గ్రాములు బరువు ఉంటుంది. మొత్తంగా, Samsung Galaxy M07 తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో, బడ్జెట్ సెగ్మెంట్‌లో వినియోగదారులకు మంచి ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన
Cat Adventure Game Stray is Reportedly Coming to PS Plus Essential in November