Photo Credit: Vivo
మన దేశంలో Vivo Y300 Plus స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో గత నెలలో లాంచ్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ కంపెనీ Vivo Y300ని కూడా భారత్‌లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందట. అంతేకాదు, రాబోయే Vivo Y సిరీస్ ఫోన్ కలర్‌వేస్, స్పెసిఫికేషన్‌లతోపాటు మన దేశంలో లాంచ్ టైమ్‌లైన్ సైతం లీక్ అయ్యాయి. ఇది మూడు కలర్ ఆప్షన్‌లలో రాబోతున్నట్లు బహిర్గతం అయ్యింది. అలాగే, Vivo Y300 స్మార్ట్ ఫోన్ సోనీ IMX882 పోర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రానప్పటికీ, Vivo Y300 ప్లస్ కంటే అప్‌గ్రేడ్‌లతో Vivo Y300 హ్యాండ్ సెట్‌ని పరిచయం చేయవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ Vivo Y300 భారత్ లాంచ్ టైమ్‌లైన్, కలర్‌వేలు, స్పెసిఫికేషన్‌లను MySmartPrice షేర్ చేసింది. దీని నివేదిక ప్రకారం.. Vivo Y300 మోడల్ నవంబర్ చివరి నాటికి మన దేశంలో విడుదల అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ టైటానియం-ఇన్‌స్ప్రైడ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అలాగే, ఆకుపచ్చ, ఫాంటమ్ పర్పుల్, టైటానియం సిల్వర్ షేడ్స్ రంగులలో అందుబాటులోకి వస్తుంది. Vivo Y300 సోనీ IMX882 పోర్ట్రెయిట్ కెమెరా, AI ఆరా లైట్‌తో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ప్రస్తుతం మన దేశీయ మార్కెట్‌లో Vivo Y300 Plus సింగిల్ 8GB RAM 128GB మోడల్ ధర రూ. 23,999గా అందుబాటులో ఉంది. ఇది సిల్క్ గ్రీన్, సిల్క్ బ్లాక్ రంగులలో లభిస్తోంది. అలాగే, Vivo Y300 Plus స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్-HD (1,080x2,400 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 6nm స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పాటు 8GB LPDDR4X RAM, 128GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తోంది. అంతేకాదు, RAMని వర్చువల్‌గా 8GB వరకు అదనంగా విస్తరించుకోవచ్చు. అలాగే, మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు.
Vivo Y300 Plus హ్యాండ్ సెట్‌లో కెమెరా విషయానికి వస్తే.. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ సెకండరీ షూటర్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అలాగే, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ప్రత్యేకంగా 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ దుమ్ము, నీటి నిరోధకత కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉండి, బయోమెట్రిక్ అథంటిఫికేషన్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. దీని బ్యాటరీ సామర్థ్యం విషయంలో కొనుగోలుదారుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరి కొత్తగా లాంచ్ కాబోతోన్న Vivo Y300 స్మార్ట్ ఫోన్ దీనిని అధిగమిస్తుందో లేదో తెలియాంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.
ప్రకటన
ప్రకటన