ఈ Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ 2024లో ప్రింటర్‌లపై క‌ళ్ల చెదిరే డీల్స్.. ఇదిగో ఆ లిస్ట్‌

ఇలాంటి ఫెస్టివ‌ల్ సేల్‌ల‌లో డిస్కౌంట్లను పొందేముందు బ్యాంక్ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లకు సంబంధించిన కొన్ని వివరాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమ‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు

ఈ Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ 2024లో ప్రింటర్‌లపై క‌ళ్ల చెదిరే డీల్స్.. ఇదిగో ఆ లిస్ట్‌

Photo Credit: Amazon

Check out the best offers on printers during Amazon Great Indian Festival sale

ముఖ్యాంశాలు
  • సేల్ సందర్భంగా ప్రింటర్లపై Amazon భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది
  • నో-కాస్ట్ EMIలతోపాటు అనేక బ్యాంక్ ఆఫర్‌లను పొందవచ్చు
  • పండుగ సేల్‌ సమయంలో బ్రాండెడ్‌ ప్రింటర్‌లపై అత్యుత్తమ డీల్స్ జాబితా
ప్రకటన

ఈ Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 అన్ని వర్గాల కొనుగోలుదారుల‌నూ ఆక‌ర్షించేలా ఆఫర్‌లు, డిస్కౌంట్‌లను అందిస్తోన్న విష‌యం తెలిసిందే. మ‌రి ఈ పండగల సీజన్‌లో మంచి త‌గ్గింపు ధ‌ర‌లో ప్రింటర్‌ను కొనుగోలు చేయాల‌నుకునేవారికి Amazon స‌రికొత్త ఆఫ‌ర్‌ల‌ను ఇస్తోంది. అత్యుత్తమ ప్రింటర్ డీల్‌లను పొందడానికి ఇదో గొప్ప వేదిక అనే చెప్పాలి. ఈ ఈ-కామర్స్ దిగ్గజం ప్రస్తుతం HP, Canon, Brother, Epson లాంటి మ‌రెన్నో ప్రముఖ బ్రాండ్‌ల ప్రింటర్‌లపై 50 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. కాబట్టి, మీరు మీ ఇంటి కోస‌మో లేదా ఆఫీస్ కోస‌మో కొత్త ప్రింటర్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో ల‌భిస్తోన్న ఈ ఆఫ‌ర్‌ల లిస్ట్ ఆస్స‌లు మిస్స‌వ్వొద్దు!

ఆర్థిక నిపుణుల సూచ‌న‌..

ఇలాంటి ఫెస్టివ‌ల్ సేల్‌ల‌లో డిస్కౌంట్లను పొందేముందు బ్యాంక్ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లకు సంబంధించిన కొన్ని వివరాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమ‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. రూ. 29,750 వ‌ర‌కూ SBI డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై కొనుగోలు చేసే క‌స్ట‌మ‌ర్‌లు 10 శాతం త‌క్ష‌ణ‌ తగ్గింపును పొందవచ్చు. అలాగే, వినియోగదారులు SBI, HDFC, ICICI, బజాజ్ ఫిన్‌సర్వ్ లాంటి ప్ర‌ముఖ బ్యాంక్ కార్డ్‌లపై నో-కాస్ట్ EMIలను కూడా పొందొచ్చు. ఇవే కాకుండా, Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను సొంతం చేసుకోవ‌చ్చు. ఈ సేల్‌లో కొత్త ప్రింటర్ కొనుగోలుపై రూ. 10,000 విలువైన రివార్డ్‌లను కూడా పొందవచ్చు. ఇలాంటి విష‌యాల‌పై అవ‌గాహ‌న పెంచుకోవ‌డం ద్వారా వ‌స్తువుల కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ఆఫ‌ర్‌ల‌ను పొందేందుకు అవ‌కాశం ఉంటుంది.

ప్రింటర్‌లపై అత్యుత్తమ డీల్‌లు..

  • Canon PIXMA MegaTank ప్రింట‌ర్‌ G3770 అస‌లు ధ‌ర‌ రూ. 20,270గా ఉంటే ఈ సేల్‌లో రూ. 12,999కి పొందొచ్చు
  • రూ. 26,582 మార్కెట్ ధ‌ర ఉన్న HP లేజర్ MFP 1188Fnw ప్రింట‌ర్‌ ఆఫ‌ర్‌పై రూ. 19,999కే సొంతం చేసుకోవ‌చ్చు
  • Epson EcoTank L3250 A4 ఇంక్ ట్యాంక్ ప్రింటర్ ధ‌ర‌ రూ. 17,999కాగా రూ. 13,999కి కొనుక్కోవ‌చ్చు
  • Brother DCP-T820DW ప్రింటర్ రూ. 23,850 అస‌లు ధ‌ర ఉండ‌గా.. రూ. 19,499కు దొరుకుతుంది
  • Canon PIXMA MegaTank G3000 ఆల్ ఇన్ వన్ వైఫై ఇంక్‌ట్యాంక్ కలర్ ప్రింటర్ రూ. 18,295 నుంచి రూ. 11,799కు
  • రూ. 17,828 ధ‌ర ఉన్న HP స్మార్ట్ ట్యాంక్ 589 ఆల్ ఇన్ వన్ వైఫై కలర్ ప్రింటర్ రూ. 11,999 ఇప్పుడు కొనుగోలు చేయొచ్చు
  • Epson Ecotank L130 ప్రింట‌ర్‌ రూ. 10,999 ధ‌ర నుంచి రూ. 8,299కి ఆఫ‌ర్‌లో దొరుకుతుంది
  • Brother DCP-L2541DW ఆటో డ్యూప్లెక్స్ లేజర్ ప్రింటర్ రూ. 29,490 అస‌లు ధ‌ర నుంచి రూ. 20,499కి ల‌భిస్తుంది

ces_story_below_text

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఇవి కాకుండా, ఈ సేల్ సమయంలో iQOO Neo 10R ఫోన్ ధర రూ. 24,999గా ఉండనుంది.
  2. Apple Watch ని ఎక్కువ మంది ఎంచుకునే ప్రధాన కారణం హెల్త్ ఫీచర్లే.
  3. Samsung Galaxy Z Fold 7లో 6.5 అంగుళాల FHD+ AMOLED కవర్ డిస్‌ప్లే ఉంది.
  4. అదనంగా, 9 నెలల వరకు నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా ఉంది.
  5. ఈ ధరలు భారతీయ కరెన్సీకి మార్చుకుంటే సుమారు మధ్యస్థ శ్రేణిలోకి వస్తాయి.
  6. ప్రస్తుతం OnePlus 13R ఫ్లిప్కార్ట్లో రూ.40,889 ధరకు లిస్ట్ అయింది
  7. ఈ ఏడాది ఒప్పో ‘డ్యూయల్ ఫోల్డబుల్ స్ట్రాటజీ’ని అనుసరించనుందని సమాచారం
  8. ఇది ఫియర్లెస్ బ్లూ, లోన్ బ్లాక్, నోవా వైట్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది
  9. త్వరలో మార్కెట్‌లోకి అధునాతమైన Vivo X200T, ఫీచర్లు, ధర వివరాలు
  10. Samsung నుంచి మరో అదిరిపోయే ఫోన్, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »