Photo Credit: Qualcomm
భారతదేశపు అతిపెద్ద ఆటోమోటివ్ తయారీ సంస్థ మారుతీ సుజుకి నుంచి రాబోయే వాహనాలలో కొత్త స్నాప్‌డ్రాగన్ ఎలైట్ ఆటోమోటివ్ చిప్‌లను ఉపయోగించవచ్చు. ఇందు కోసం Qualcomm భాగస్వామ్యం కుదర్చుకున్నట్లు ఒక నివేదిక ద్వారా తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్ కొత్త ఆటోమోటివ్ చిప్ అధునాతన భద్రతా వ్యవస్థ, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీతోపాటు ఇతర ఫీచర్స్‌ను అందించగలదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంతకుముందు, Qualcomm పెద్ద ఆటోమొబైల్ కంపెనీలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాతో టైఅప్ గురించి తెలియజేసింది. ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
గత నెల USAలోని హవాయిలో జరిగిన స్నాప్‌డ్రాగన్ సమ్మిట్‌లో Qualcomm ఆటోమోటివ్ పరిశ్రమకు అనుగుణంగా రెండు కొత్త చిప్‌సెట్‌లను ప్రకటించింది. అలాగే, స్నాప్‌డ్రాగన్ డిజిటల్ ఛాసిస్ సొల్యూషన్ పోర్ట్‌ఫోలియోలో భాగంగా స్నాప్‌డ్రాగన్ కాక్‌పిట్ ఎలైట్, స్నాప్‌డ్రాగన్ రైడ్ ఎలైట్‌లను పరిచయం చేసింది. SmartPrix నివేదిక ప్రకారం.. ఈ కూటమి నూతన చిప్‌లలో ఒకదాన్ని మారుతి సుజుకి కార్లలో ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. ఈ వినియోగం ఆటోమోటీవ్ పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చకు దారి తీయనుంది.
స్నాప్‌డ్రాగన్ కాక్‌పిట్ ఎలైట్ చిప్ అధునాతన డిజిటల్ అనుభవాలను అందించగలదు. అలాగే, రైడ్ ఎలైట్ చిప్ ఆటోమేటెడ్ డ్రైవింగ్ సామర్థ్యానికి సపోర్ట్ ఇస్తుంది. దీని కోసం, ఈ చిప్స్ సౌకర్యవంతమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఈ రెండు చిప్‌లు వచ్చే ఏడాది నమూనా కోసం అందుబాటులో ఉంటాయని Qualcomm వెల్లడించింది. అంతేకాదు, కొత్త చిప్‌సెట్ ఇంటెల్ ప్రాసెసర్ కంటే శక్తివంతమైనదని ఇంతకుముందు కంపెనీ తెలిపింది. ఈ చిప్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), రియల్ టైమ్ డ్రైవర్ మానిటరింగ్, వాహనాలలో లేన్ మరియు పార్కింగ్ సహాయం వంటి ఫీచర్లకు సపోర్ట్ చేయగలదని అంచనా. అయితే, అధికారికంగా ధృవీకరించలేదు.
రెండు చిప్‌లలో Oryon CPU, Adreno GPU, Hexagon NPUలు ఇన్‌స్టాల్ చేయబడ్డాయి. ఈ ప్రాసెసర్‌లను ఉపయోగించడం ద్వారా మూడు రెట్లు వేగవంతమైన CPU, 12 రెట్లు వేగవంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పనితీరును అందించవచ్చు. ఇది ఐసో-పవర్ వద్ద ఇంటెల్ కోర్ అల్ట్రా 7 సిరీస్ 2 పీక్ కంటే 162 శాతం వేగవంతమైన CPU పనితీరును అందిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా చిప్ సరఫరాలో కొరత కారణంగా ఆటోమొబైల్ తయారీ పరిశ్రమ ప్రభావితమైంది. అయితే, ఈ పరిస్థితి మెరుగుపడింది.
చిప్స్ 360-డిగ్రీ కవరేజ్ కోసం 20 వరకు అధిక-రిజల్యూషన్ కెమెరాలతో సహా 40కి పైగా మల్టీమోడల్ సెన్సార్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఆప్టిమైజ్ చేసిన చిత్రాల కోసం AI సంబంధిత సాధనాలను ఉపయోగిస్తారు. రాబోయే ఆటోమోటివ్ సెన్సార్‌లు, ఫార్మాట్‌లకు అనుకూలంగా ఉంటాయి. Qualcomm స్నాప్‌డ్రాగన్ కాక్‌పిట్ ఎలైట్, స్నాప్‌డ్రాగన్ రైడ్ ఎలైట్ రెండూ 2025లో శాంపిల్ కోసం అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.
ప్రకటన
ప్రకటన