Photo Credit: Honor
హానర్ ప్యాడ్ X9a (చిత్రంలో) ఒకే బూడిద రంగులో లభిస్తుంది.
మలేషియాలో Honor Pad X9a లాంఛ్ అయ్యింది. కంపెనీ నుంచి వచ్చిన ఈ తాజా ట్యాబ్ 11.5-అంగుళాల LCD స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌తో లభించనుంది. అలాగే, ఇది Wi-Fi, బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. Honor Pad X9a మోడల్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్‌పై రన్ అవుతుండడంతోపాటు 8,300mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత కంపెనీ MagicOS 9.0 పైన రన్ అవుతుంది. ఈ ట్యాబ్‌కు 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 8-మెగాపిక్సెల్ వెనుక కెమెరాను కూడా అందించారు.
Honor Pad X9a ధరను కంపెనీ అధికారికంగా ఇంకా వెల్లడించ లేదు. అయితే, ఈ ట్యాబ్ ఇప్పటికే హానర్ మలేషియా వెబ్‌సైట్‌లో లిస్ట్ అవుట్ చేయబడింది. ఇది ఆకర్షణీయమైన ఒకే ఒక్క గ్రే కలర్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులోకి వస్తుంది. అంతే కాదు, ఈ X9a మోడల్ 8GB + 128GB RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో అమ్మకానికి రానున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ధర ఇతర అప్‌గ్రేడ్ మోడల్స్ మాదిరిగానే ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ కొత్త Honor Pad X9a మోడల్ 11.5-అంగుళాల 2.5K (1,504x2,508 పిక్సెల్స్) LCD స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. అలాగే, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అంతే కాదు, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తుంది. ఈ మోడల్ ట్యాబ్ 8GB RAMతో అటాచ్ చేయబడి ఉంటుంది. అనేక ఇతర Android డివైజ్‌ల మాదిరిగానే, కంపెనీ వినియోగదారులు 8GB అన్ యూజ్డ్ స్టోరేజ్‌ను వర్చువల్ RAMగా ఉపయోగించుకునేలా చేస్తోంది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. Honor Pad X9aకు 8-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, ఆటోఫోకస్ - f/2.0 ఎపర్చరుతో అమర్చబడి ఉంటుంది. అంతే కాదు, సెల్ఫీలు, వీడియో చాట్‌లను f/2.2 ఎపర్చరుతో 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ - ఫేసింగ్ కెమెరాను కంపెనీ అందించింది. ఇందులో వినియోగదారులు 128GB స్టోరేజీని పొందుతారు. ఈ ట్యాబ్ Wi-Fi, బ్లూటూత్ 5.1 కనెక్టివిటీని అందిస్తోంది. అలాగే, ఇది కంపెనీ వైర్‌లెస్ కీ బోర్డులు, స్టైలస్‌తో పనిచేస్తోంది. ఈ ట్యాబ్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత MagicOS 9.0 పై రన్ అవుతుంది.
ఈ Honor Pad X9aలో క్వాడ్ స్పీకర్ సెటప్‌ను కంపెనీ అందించింది. అలాగే, ఇది 8,300mAh లి - అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీనిని 35W వద్ద ఛార్జ్ చేయొచ్చు. మరీ ముఖ్యంగా, ఈ ట్యాబ్ స్టాండ్‌బై మోడ్‌లో 70 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇది 267.3x167x6.77mm పరిమాణంతో 475 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఇతర కంపెనీల ట్యాబ్‌లకు ఇది మంచి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన