Photo Credit: OnePlus
ఈ ఏడాది జూలైలో భారతదేశంలో OnePlus Pad 2ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇది Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, 67W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో 9,510mAh బ్యాటరీ, 12.1-అంగుళాల 3K LCD స్క్రీన్‌తో వస్తుంది. ఈ ట్యాబ్‌ను నింబస్ గ్రే కలర్‌వేలో అందించారు. ఇది 8GB + 128GB, 12GB + 256GB వేరియంట్‌లలో లభిస్తుంది. వన్‌ప్లస్ స్టైలో 2 స్టైలస్, వన్‌ప్లస్ స్మార్ట్ కీబోర్డ్ విడిగా విక్రయించబడినప్పటికీ పెయిర్‌గా వచ్చింది. తాజాగా ఈ మోడల్‌పై కంపెనీ మంచి డిస్కౌంట్ ఆఫర్‌లను పరిమిత సమయం వరకు అందిస్తోంది. మరి ఆ డిస్కౌంట్ ఆఫర్‌తోపాటు ఈ మోడల్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్‌ను తెలుసుకుందామా?!
మన దేశీయ మార్కెట్‌లో OnePlus Pad 2 ధర 8GB + 128GB వేరియంట్ రూ. 39,999గా ఉంది. అలాగే, 12GB + 256GB వేరియంట్ ధర రూ. 42,999. తాజాగా ప్రకటించిన ఆఫర్‌లో నవంబర్ 6 అర్ధరాత్రి ముగిసే వరకూ కొనుగోలుదారులు OnePlus Pad 2ని వరుస వేరియంట్‌లలో రూ. 37,999, రూ. 40,999గా సొంతం చేసుకోవచ్చు. అంటే, రూ. 2 వేల వరకూ ఆదా చేసుకోవచ్చు! అయితే, వినియోగదారులు అమెజాన్‌తో పాటు వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా ఈ ఆఫర్‌ను పొందాల్సి ఉంటుంది.
దీంతోపాటు, ఆఫర్ వ్యవధిలో వినియోగదారులకు అదనపు ప్రయోజనాలను కూడా ఉన్నాయి. ICICI, RBL, కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉన్న వినియోగదారులు రూ. 3000 తగ్గింపుతోపాటు నెలకు రూ. 4,555 చెల్లించి, తొమ్మిది నెలల పాటు నో-కాస్ట్ EMI ఎంపికలను పొందవచ్చు. అలాగే, కొనుగోలుదారులు రూ. 5,000 ఎక్స్చేంజ్ బోనస్‌ను సొంతం చేసుకోవచ్చు.
ఈ OnePlus Pad 2 12.1-అంగుళాల 3K (2,120 x 3,000 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 303ppi పిక్సెల్ డెన్సిటీ, 900నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ స్థాయితో డాల్బీ విజన్ సపోర్ట్‌ని కలిగి ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ద్వారా 12GB వరకు LPDDR5X RAM, 256GB వరకు UFS3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజీతో అటాచ్ చేయబడింది. అలాగే, ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 14తో రన్ చేయబడుతుంది.
OnePlus 2 కెమెరా విషయానికి వస్తే.. ఇది 13-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. బ్లూటూత్ 5.4, Wi-Fi 7, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, USB టైప్-సి కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ట్యాబ్ 67W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 9,510mAh బ్యాటరీ సామర్థ్యంతో రూపొందించారు. ఇది హై-రెస్ సర్టిఫైడ్ సిక్స్-స్పీకర్ సిస్టమ్, ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్‌తో వస్తుంది. 268.66 x 195.06 x 6.49mm పరిమాణం, 584గ్రాముల బరువు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన