మార్వెల్స్ వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ సహకారంతో త్వరలోనే HMD Fusion వెనమ్ ఎడిషన్
నోకీయా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ HMD సరికొత్త HMD Fusion హ్యాండ్‌సెట్‌ను ఈ సంవత్సరం సెప్టెంబర్ IFA 2024లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా HMD Fusion వెనమ్ ప్రత్యేక ఎడిషన్ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన ఫీచర్స్‌ను పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ IP52-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. అలాగే, iFixit కిట్‌ని ఉపయోగించి మరమ్మతులు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్, 108-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా యూనిట్‌తోపాటు 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో దీనిని రూపొందించారు. HMD కంపెనీ ఓవైపు బడ్జెట్ ఫోన్లను తీసుకొస్తూనే మరోవైపు ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై ఫోకస్ పెడుతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి