HMD Skyline 12GB + 256GB వేరియంట్ ధర రూ. 35,999.. అమ్మకాలు షురూ
గ్లోబల్ మార్కెట్‌లో విడుదలైన దాదాపు రెండు నెలల తర్వాత మన దేశీయ మొబైల్ మార్కెట్‌లోకి HMD Skyline స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ 12GB RAMతో జత చేయబడిన Snapdragon 7s Gen 2 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. అలాగే, 4,600mAh బ్యాటరీ సామర్థ్యంతో సెల్ఫ్-రిపేర్ కిట్‌తో అందించబడుతోంది. దీంతో వినియోగదారులు డిస్‌ప్లే, బ్యాటరీతో సహా ఫోన్‌లోని కొన్ని భాగాలను విడదీయడంతోపాటు మళ్లీ సెట్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. 108-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో దీనిని రూపొందించారు