మినీ AMOLED స్క్రీన్‌తో దేశీయ మార్కెట్‌లోకి లాంచ్ అయిన Lava Agni 3 ధర ఎంతో తెలుసా
Lava స్మార్ట్‌ఫోన్ కంపెనీ తాజాగా తన మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Lava Agni 3ని దేశీయ మార్కెట్‌లోకి గ్రాండ్‌గా విడుదల చేసింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED స్క్రీన్‌తో వస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 1.74-అంగుళాల AMOLED టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో పాటు కొన్ని సరికొత్త ఫీచర్లకు యాక్సెస్‌ను ఇస్తోంది. Lava Agni 3.. MediaTek Dimensity 7300X ప్రాసెసర్‌తోపాటు 8GB RAM, Android 14పై రన్ అవుతూ.. 66W వద్ద ఛార్జ్ చేయగల 5,000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది