అక్టోబర్ 25న గ‌్లోబల్ మార్కెట్‌లోకి Poco C75 లాంచ్ అవుతోంది.. ధర, స్పెసిఫికేషన్‌లు మీకోసం
గ్లోబల్ మార్కెట్‌లోకి వచ్చేవారం Xiaomi సబ్-బ్రాండ్ Poco C75 లాంచ్ కానున్నట్లు కంనెనీ X వేదికగా వెల్లడించింది. Poco మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారంలో ఈ కొత్త C సిరీస్ ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్‌లను తెలుపుతూ పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ ఫోన్ ప్రారంభ ధరను కూడా కంపెనీ ప్రకటించింది. ఇది 50-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా యూనిట్, 5,160mAh బ్యాటరీతో అందుబాటులోకి రానున్నట్లు స్పష్టం చేసింది. Poco C75 Redmi 14C రీబ్రాండ్‌గా ప్రారంభించబడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది రెండు RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది