Samsung

Samsung - ख़बरें

  • ఇండియాలో జూన్ 27న Samsung Galaxy M36 5G లాంఛ్‌.. ధ‌ర ఎంతో తెలుసా
    వినియోగదారుల అవసరాల‌కు అనుగుణంగా సరికొత్త స్మార్ట్ ఫోన్లను పరిచయం చేయడంలో ముందుండే Samsung కంపెనీ ఈసారి Samsung Galaxy M36 5G మొబైల్ ను ఇండియన్ మార్కెట్‌కు తీసుకొచ్చింది. ఇది గత ఏడాది జూలైలో మన దేశీయ మార్కెట్లోకి వచ్చిన Galaxy M35 5Gకి కొనసాగింపుగా రాబోతోంది. ఈ మోడల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికానప్పటికీ, ఫోన్ ధరతోపాటు డిజైన్ విశేషాలను కంపెనీ టీజ్ చేసింది. తాజాగా, కెమెరా, బిల్డ్, డైమెన్షన్‌తోపాటు కీలక స్పెసిఫికేషన్స్ తోపాటు విడుద‌ల తేదీని తెలుసుకుందాం రండి!
  • Samsung Galaxy S25 Ultraపై రూ. 12000 వ‌ర‌కూ డిస్కౌంట్ ఆఫ‌ర్‌
    ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల‌లో దిగ్గ‌జంగా పేరొందిన Samsung స‌రికొత్త త‌గ్గింపు ఆఫ‌ర్‌తో ముందుకు వ‌చ్చింది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో విడుద‌లైన Samsung Galaxy S25 Ultraపై డిస్కౌంట్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ఈ మొబైల్ కొనుగోలుదారులు కంపెనీ ఇచ్చే ఆఫ‌ర్‌లో భాగంగా స్పెష‌ల్ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే, కంపెనీ అధికారిక వెబ్ సైట్‌లో అద‌న‌పు ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్‌ల‌తోపాటు నో కాస్ట్ ఈఎంఐ ఆప్ష‌న్‌ల‌ను పొంద‌డం ద్వారా మ‌రింత త‌గ్గింపు ధ‌ర‌ను సొంతం చేసుకోవ‌చ్చు. అయితే, ఇది ప‌రిమితకాల ఆఫ‌ర్ అని కంపెనీ స్ప‌ష్టం చేసింది. ఈ మొబైల్‌కు స్నాప్‌డ్రాగ‌న్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌, 200 మెగాపిక్సెల్ ప్ర‌ధాన కెమెరా యూనిట్‌, Galaxy AI ఫీచ‌ర్స్ సూట్ వంటివి అందించారు.
  • అతి తక్కువ ధరకే Samsung Galaxy S25 Ultra.. డోంట్ మిస్!
    శాంసంగ్ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ గెలాక్సి ఎస్ 25 అల్ట్రా క్వాడ్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇది అత్యాధునిక ప్రాసెసర్, 5,000mAh బ్యాటరీతో వచ్చింది. 15W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
  • ఇండియాలో Samsung Galaxy S25 Edge ధర ప్ర‌క‌టించిన కంపెనీ.. అందుబాటులోకి ప్రీ-ఆర్డర్
    గ్లోబ‌ల్ మార్కెట్‌లోకి స్నాప్‌డ్రాగ‌న్ 8 లైట్ ప్రాసెస‌ర్‌తో Samsung Galaxy S25 Edge గ్రాండ్‌గా అడుగుపెట్టింది. ప్ర‌స్తుతం ఈ స‌రికొత్త మోడ‌ల్ స్మార్ట్ ఫోన్ మ‌న దేశంలో ప్రీ ఆర్డ‌ర్‌ల‌కు కంపెనీ అవ‌కాశం క‌ల్పించింది. మ‌రీ ముఖ్యంగా, 200 మెగాపిక్సెల్స్ డ్యూయ‌ల్ రియ‌ల్ కెమెరా యూనిట్ కొనుగోలుదారుల‌ను మ‌రింత ఆక‌ర్షిస్తుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. దీని డిస్‌ప్లే ప్రొట‌క్ష‌న్ కోసం క్రోనింగ్ గెరిల్లా గ్లాస్ Ceramic 2 తో రూపొందించారు. ఈ హ్యాండ్‌సెట్ 12జీబీ ర్యామ్‌తో 256జీబీ, 512జీబీ స్టోరేజీ వేరియంట్‌లో ల‌భిస్తుంది. కొత్త Samsung Galaxy S25 Edge స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ధ‌ర‌తోపాటు పూర్తి స్పెసిఫికేష‌న్స్‌ను కంపెనీ వెల్ల‌డించింది.
  • Samsung Galaxy S25 Ultra పై రూ. 12,000 డిస్కౌంట్.. ఆఫర్ ఏప్రిల్ 30 వరకే
    భారత్‌లో Samsung Galaxy S25 అల్ట్రా ఈ ఏడాది మొద‌ట్లో మార్కెట్‌లోకి అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆ స‌మయంలో ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 1,29,999 గా ఉంది. తాజాగా Samsung ఫ్లాగ్‌షిప్ భార‌త్‌లో తగ్గింపు ధరకు కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వ‌చ్చింది. ఈ ఫోన్‌పై తక్షణ క్యాష్‌బ్యాక్‌గా రూ. 12,000 వరకు ఈ దక్షిణ కొరియా బ్రాండ్ ప్రకటించింది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMI ఆప్షన్‌లు కూడా ఉన్నాయి. ఈ Galaxy S25 Ultra హ్యాండ్‌సెట్ 12GB RAM, 1TB వరకు స్టోరేజీతో జ‌త చేసిన Galaxy ప్రాసెసర్ కస్టమ్ స్నాప్‌డ్రాగ‌న్ 8 ఎలైట్‌లో అందుబాట‌లోకి రానుంది.
  • భారత్‌లో లాంఛ్ అయిన‌ Samsung Galaxy Tab S10 FE, Tab S10 FE+.. ధరలు ఎంతంటే
    భార‌త్ స‌హా ఎంపిక చేసిన గ్లోబ‌ల్ మార్కెట్ల‌లో Samsung Galaxy Tab S10 FE సిరీస్ లాంఛ్ అయ్యింది. ఈ లైనప్‌లో Wi-Fi, 5G ఆప్ష‌న్‌ల‌లో Galaxy Tab S10 FE, Tab S10 FE+ మోడ‌ల్స్ ఉన్నాయి. ఈ ట్యాబ్‌లు 12GB వరకు RAM, 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అటాచ్ చేయబడిన ఇన్-హౌస్ Exynos 1580 ప్రాసెస‌ర్‌ల ద్వారా శ‌క్తిని గ్ర‌హిస్తాయి. ఇవి Android 15-ఆధారిత One UI 7 తో వ‌స్తున్నాయి. అలాగే, IP68-రేటెడ్ డస్ట్, వాటర్-రెసిస్టెంట్ బిల్డ్‌లను క‌లిగి ఉంటాయి. ఈ Galaxy Tab S10 FE ట్యాబ్‌లు Google సర్కిల్ టు సెర్చ్, ఆబ్జెక్ట్ ఎరేజర్, సాల్వ్ మ్యాథ్, బెస్ట్ ఫేస్ లాంటి అనేక AI ఫీచర్‌లతో అందుబాటులోకి వ‌స్తున్నాయి.
  • ఆపిల్‌తో పాటు Qualcomm కూడా 2nm నోడ్ ఆధారంగా స్నాప్‌డ్రాగన్ ప్రాసెస‌ర్‌ల‌ను లాంఛ్ చేయ‌నుందా
    Qualcomm తమ‌ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌కు successor ని ఈ ఏడాది లాంఛ్ చేయ‌నున్న‌ట్లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 3 గా పిలువబడే ఈ ప్రాసెస‌ర్‌ యొక్క successor ని 2nm ప్రాసెస్‌లో తయారు చేయొచ్చు అని ఓ టిప్‌స్టర్ పేర్కొన్నాడు. మెరుగైన లితోగ్రఫీ Qualcomm ఫ్లాగ్‌షిప్ 2026 ప్రాసెసర్‌ కోసం మాత్రమే కాకుండా మరొక వేరియంట్ కోసం కూడా దీనిని రూపొందించ‌నున్న‌ట్లు సూచిస్తోంది. అలాగే, ఇది ఉద్దేశించిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ మూడవ తరం ప్రాసెస‌ర్ యొక్క తక్కువ శక్తివంతమైన iteration తో లాంఛ్ చేయ‌వ‌చ్చు. వచ్చే ఏడాది ఆపిల్ 2nm నోడ్ ఆధారంగా దీని A20 ప్రాసెస‌ర్‌ను కూడా ప్రవేశపెట్టనుంది.
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెస‌ర్‌తో ఇండియాలో లాంఛ్ అయిన‌ Samsung Galaxy F16 5G
    గ‌త ఏడాదిలో మార్చిలో ఇండియాలో విడుద‌లైన‌ Galaxy F15 5Gకి కొన‌సాగింపుగా Samsung Galaxy F16 5G మ‌న దేశంలో లాంఛ్ అయ్యింది. ఈ తాజా Galaxy F16 5G ఫోన్‌ MediaTek Dimensity 6300 ప్రాసెస‌ర్‌లో శక్తిని గ్ర‌హిస్తుంది. అలాగే, 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని క‌లిగి ఉంది. ఇక కెమెరా విష‌యానికి వ‌స్తే.. దీనిని 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 13-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో రూపొందించారు. ఈ ఫోన్ ఆరు OS అప్‌గ్రేడ్‌లతో పాటు ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌ల‌ను పొందుతుంది.
  • మ‌న దేశంలో Samsung Galaxy A56 5G, Galaxy A36 5G ధరలు ఇవే
    మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2025) కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా Samsung Galaxy A26 5Gతో పాటు Galaxy A56 5G, Galaxy A36 5G స్మార్ట్ ఫోన్‌ల‌ను ఆవిష్కరించింది. Samsung Galaxy A56 5G, Galaxy A36 5G హ్యాండ్‌సెట్‌లు తాజాగా భారతీయ అధికారిక వెబ్‌సైట్‌లో వాటి ధరలతో లిస్ట్ అవుట్ చేయబడ్డాయి. Galaxy A26 5G ధర మ‌న దేశంలో ఇంకా వెల్లడికాలేదు. ఈ Galaxy A సిరీస్ ఫోన్‌లు 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్లతో రూపొందించ‌బ‌డ్డాయి. అలాగే, ఇవి Android 15-ఆధారిత One UI 7పై ర‌న్ అవుతాయి.
  • ఇండియాలో Samsung గెలాక్సీ M16, గెలాక్సీ M06 5G లాంఛ్ ఫిక్స్‌.. డిజైన్ ఎలా ఉందంటే..
    ఇండియాలో రెండు కొత్త 5G స్మార్ట్ ఫోన్‌లను విడుద‌ల చేసేందుకు Samsung సన్నాహాలు చేస్తోంది. తాజాగా, సోషల్ మీడియా వేదిక‌గా Samsung గెలాక్సీ M16 5G, గెలాక్సీ M06 5Gలు రానున్న‌ట్లు కంపెనీ ప్రకటించింది. అయితే, ఈ హ్యాండ్‌సెట్‌ల ఖచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, రాబోయే ఫోన్‌లు ఎక్క‌డ అందుబాటులోకి రానున్నాయ‌న్న వివరాలు వెల్ల‌డ‌య్యాయి. డిజైన్ వివరాలపు చూస్తే.. గెలాక్సీ M16, గెలాక్సీ M06 5G వెనుక కెమెరా లేఅవుట్ టీజ్ చేయబడ్డాయి. గతంలో, అనేక సర్టిఫికేషన్ సైట్‌లతోపాటు ప‌లు నివేదికల ద్వారా హ్యాండ్‌సెట్‌ల కొన్ని ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొట్టాయి.
  • రూ. 10,000 కంటే తక్కువ ధరలో Samsung నుంచి వ‌స్తోన్న 5G స్మార్ట్ ఫోన్ Galaxy F06 5G
    మ‌న దేశంలో Samsung అత్యంత సరసమైన 5G స్మార్ట్ ఫోన్‌గా Galaxy F06 5G విడుద‌ల చేసింది. దీని ప్రారంభ ధర దీనిని రూ. 10,000 కంటే తక్కువగా ఉండ‌నుంది. నిజంగా ఇది Samsung నుంచి బంప‌ర్ ఆఫ‌ర్ అనే చెప్పాలి. ప్ర‌ధానంగా OEMలకు మాస్ మార్కెట్‌గా పరిగణించబడే వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ మోడ‌ల్‌ను కంపెనీ ప‌రిచ‌యం చేసిన‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ ధ‌ర రేంజ్‌లో Samsung లెటెస్ట్ స్మార్ట్ ఫోన్ నుంచి ఆశించే అన్ని ర‌కాల ఫీచ‌ర్స్‌నూ అందిస్తోంది.
  • మ‌న దేశంలో Samsung Galaxy F16 ధర, స్పెసిఫికేషన్‌ల‌ను లీక్ చేసిన టిప్‌స్టర్‌..
    త్వ‌ర‌లోనే మ‌న దేశంలో Samsung Galaxy F16ను లాంఛ్ చేసే అవ‌కాశం ఉంది. అయితే, ఈ దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇంకా ఖచ్చితమైన లాంఛ్‌ తేదీని ప్ర‌క‌టించ‌లేదు. కానీ, Galaxy F16 హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌ల‌తోపాటు దీని ధర పరిధిని ఇప్పటికే ఓ టిప్‌స్టర్ లీక్ చేశారు. రాబోయే Galaxy F16 ఫోన్‌లో MediaTek Dimensity 6300 ప్రాసెస‌ర్‌ను అందించే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. అలాగే, ఇది ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. Galaxy F16 మోడ‌ల్‌ Galaxy A16 5G రీబ్రాండెడ్ వెర్షన్‌గా విడుద‌ల చేయొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.
  • వ‌చ్చే ఏడాదికి Samsung నుంచి రానున్న‌ మొద‌టి ట్రై-ఫోల్డ్ హ్యాండ్‌సెట్‌.. దీని వివ‌రాల‌ను బ‌హిర్గ‌తం చేసిన టిప్‌స్టర్‌
    ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిపుల్-స్క్రీన్ ఫోల్డబుల్ ఫోన్ హువావే మేట్ XT అల్టిమేట్ డిజైన్‌ను గత సంవత్సరం ఆవిష్క‌రించి, కంపెనీ స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారుల‌ను అక‌ట్టుకుంది. అయితే, Samsung తన సొంత ట్రై-ఫోల్డ్ ఫోన్‌ను పరిచయం చేయడం ద్వారా హువావేకి గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధ‌మైనట్లు మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ దక్షిణ కొరియా బ్రాండ్ తన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్ సందర్భంగా తన మొదటి మల్టీ-ఫోల్డ్ ఫోన్‌ను టీజ్ చేసింది. తాజాగా ఈ మోడ‌ల్ పేరును సూచించే కొత్త లీక్ ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యింది. ఈ Samsung ట్రై-ఫోల్డ్ ఫోన్ 10-అంగుళాల డిస్‌ప్లేతో వ‌చ్చే అవ‌కాశం ఉంది.
  • పాత Galaxy మోడళ్లకూ.. Galaxy S25 Ultra మోషన్ ఫోటోతోపాటు ఇతర కెమెరా ఫీచర్లు రానున్నాయి
    జ‌న‌వ‌రి నెల మొద‌ట్లో కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఫోన్ లైనప్‌లో టాప్-ఆఫ్-ది-లైన్ ఆఫర్‌గా Samsung Galaxy S25 Ultra లాంచ్ చేయబడింది. ఇది హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లతో, ముఖ్యంగా కెమెరా పరంగా మంచి ఫీచ‌ర్స్‌తో ప‌రిచ‌యమైంది. అయితే, మోషన్ ఫోటో, 10-బిట్ HDR వీడియో వంటి కొన్ని కొత్త కెమెరా-సెంట్రిక్ ఫీచ‌ర్స్ పాత Galaxy మోడళ్లకు కూడా అందుబాటులో ఉంటాయ‌ని ఓ నివేదిక తెలిపింది. ఇవి One UI అప్‌డేట్‌తో కంపెనీ పాత హ్యాండ్‌సెట్‌ల్లో రానున్న‌ట్లు భావిస్తున్నారు. మ‌రెందుకు ఆల‌స్యం, Samsung తీసుకు వ‌స్తున్న ఆ స‌రికొత్త అప్‌డేట్లు ఏంటో చూసేద్దామా?!
  • భారత్‌లో అందుబాటులోకి రానున్న‌ Galaxy S25 ఫోన్‌ 128GB వేరియంట్‌.. ధ‌ర ఎంతో తెలుసా
    ఈ జనవరి 22న జరిగిన Galaxy అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్‌లో Samsung Galaxy S25 సిరీస్‌ను భార‌త్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ప‌రిచ‌యం చేసిన విష‌యం తెలిసిందే. ఆ సమయంలో బేస్ Galaxy S25 మోడ‌ల్‌కు చెందిన 256GB, 512GB కాన్ఫిగరేషన్‌ల లభ్యతతోపాటు ధరలను మాత్రమే కంపెనీ ప్రకటించింది. అయితే, తాజా నివేదిక‌ ప్రకారం.. ఈ ఫోన్ త‌క్కువ ధ‌ర‌కు 128GB స్టోరేజ్ వేరియంట్‌లో కూడా అందుబాటులోకి రానుంది. ఈ స్పెసిఫికేష‌న్స్‌తో స‌ర‌స‌మైన ధ‌ర‌కు ల‌భించే స్మార్ట్ ఫోన్‌గా వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షిస్తుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

Samsung - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »