Photo Credit: Simple Energy
కంపెనీ ప్రకారం, సింపుల్ వన్స్‌ను నాలుగు రంగులలో కొనుగోలు చేయవచ్చు.
బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ Simple Energy ఇండియాలో Simple OneS అనే పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఇది వారి కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌లో Simple OneS, వన్ జెన్ 1.5 వంటి వాటితోపాటు ఇప్పటికే ఉన్న ఆప్షన్‌లలో చేరింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 8.5 kW పీక్ పవర్ అవుట్‌పుట్‌తో పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ (PMSM) ద్వారా శక్తిని గ్రహిస్తుంది. అలాగే, కేవలం 2.55 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల (kmph) వేగాన్ని అందుకుంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం!
కంపెనీ చెబుతున్నదాని ప్రకారం.. Simple OneS ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒకసారి ఛార్జ్ చేస్తే 181 కిలోమీటర్ల వరకు ఇండియన్ డ్రైవ్ సైకిల్ (IDC) క్లెయిమ్ చేసిన రేంజ్‌ను అందిస్తుంది. మన దేశంలో Simple OneS ధర రూ. 1,39,999 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ ఎలక్ట్రిక్ వాహనం (EV) సింగిల్, ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో అందుబాటులోకి వస్తుంది. అలాగే, బ్రాజెన్ బ్లాక్, అజూర్ బ్లూ, గ్రేస్ వైట్, నమ్మా రెడ్ వంటి ఆకర్షణీయమైన నాలుగు కలర్ ఆప్షన్‌లలో లభించనుంది.
Simple OneS స్కూటర్ కోసం ప్రీ-ఆర్డర్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బెంగళూరు, గోవా, పూణే, విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, కొచ్చి, మంగళూరులతోపాటు భారతదేశంలోని 15 Simple Energy షోరూమ్‌లలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంచినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త మోడల్‌పై కస్టమర్‌ల నుంచి మంచి స్పందన ఉన్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ కొత్త Simple OneS ఎస్ 8.5 kW అవుట్‌పుట్, 72 Nm టార్క్ కలిగిన PMSM ద్వారా శక్తిని గ్రహిస్తుంది. అలాగే, 3.7kWh బ్యాటరీ ప్యాక్ కూడా ఉంది. ఈ రెండూ 105 kmph గరిష్ట వేగాన్ని, IDC క్లెయిమ్ చేసిన 180 కిలోమీటర్ల రేంజ్‌ను అందుకోవడంలో సహాయపడతాయి. ఇది 2.55 సెకన్లలో 0 నుండి 40 kmph వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెబుతోంది. అంతే కాదు, సింపుల్ వన్ జెన్ 1.5 మోడల్ 2.77-సెకన్ల యాక్సిలరేషన్ సమయం కంటే కొన్ని మిల్లీసెకన్లు తక్కువగా ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS)తో అమర్చబడి ఉంటుంది. ఇది రైడర్ ఒకే లివర్‌ని ఉపయోగించి ముందు, వెనుక బ్రేక్‌లను ఒకేసారి అప్లై చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఇది స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ సపోర్ట్‌తో 7-అంగుళాల TFT స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. అంతే కాదు, ఆండ్రాయిడ్, iOS రెండింటిలోనూ అందుబాటులో ఉన్న సింపుల్ వన్‌ఎస్ కంపానియన్ యాప్ రిమోట్ యాక్సెస్, ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌లు, రైడ్ స్టాటిస్టిక్స్, రూట్ సేవింగ్, రిమోట్ అలర్ట్‌లు, సింపుల్ ట్యాగ్ వంటి ఫీచర్స్‌తో వస్తుంది.
ప్రకటన
ప్రకటన