EV బైక్‌ల‌కు గట్టిపోటీ ఇచ్చేందుకు.. ఆగ‌స్టు 15 ఓలా ఎల‌క్ట్రిక్ బైక్ వ‌చ్చేస్తోంది!

EV బైక్‌ల‌కు గట్టిపోటీ ఇచ్చేందుకు.. ఆగ‌స్టు 15 ఓలా ఎల‌క్ట్రిక్ బైక్ వ‌చ్చేస్తోంది!
ముఖ్యాంశాలు
  • 2025 మొదటి ఆరు నెలల్లోనే ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ల విక్ర‌యం
  • టోర్క్ క్రాటోస్ R, రివోల్ట్ RV400, ఆల్ట్రావయోలెట్ F77, Matter Aeraల‌కు గ
  • ట్రండీ స్పోర్ట్‌ లుక్‌లో ఓలా ఎల‌క్ట్రిక్ బైక్‌
ప్రకటన
ఈ ఆగస్టు 15న తమిళనాడులోని ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో నిర్వహించే “సంకల్ప్ 2024” అనే వార్షిక కార్యక్రమంలో ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ను దేశీయ మార్కెట్‌లో విడుదల చేయనున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ కం ఫౌండర్ భవిష్ అగర్వాల్ ఈ బైక్‌ను ఆవిష్కరించ‌నున్న‌ట్లు సమాచారం. ఇది దేశీయ మార్కెట్‌లో ఇప్ప‌టికే విడుద‌లైన‌ ఓలా S1X, S1 ఎయిర్, S1 ప్రో ఎలక్ట్రిక్ మోటారు సైకిళ్ల స‌ర‌స‌న‌ చేరబోతోంది. రాబోయే ఓలా ఎల‌క్ట్రిక్ బైక్ మోడ‌ల్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక స‌మ‌చారం లేన‌ప్ప‌టికీ ఓలా సోషల్ మీడియా పోస్ట్‌ల రూపంలో బైక్ డిజైన్ త‌దిత‌ర‌ అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఎల‌క్ట్రిక్ బైక్ వినియోగించాల‌ని చాలామందికి ఉంటుంది. కానీ, బైక్ డిజైన్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి స్పోర్ట్స్ లుక్ లేక‌పోవ‌డంతో వెన‌క‌డుగు వేస్తున్నారు. మ‌రి అలాంటి వారిని ఈ కొత్త ఓలా బైక్ ఆక‌ట్టుకోగ‌ల‌దా? ఈ మోడ‌ల్‌లో ఎలాంటి కొత్త ఫీచ‌ర్స్ జ‌త చేస్తున్నారు? ఇలాంటి విష‌యాలు తెలుసుకోవాల‌ని ఉందా? అయితే, మ‌రెందుకు ఆల‌స్యం ఆగ‌స్టు 15న లాంచ్ కాబోతోన్న ఈ ఓలా ఎల‌క్ట్రిక్ బైక్ విశేషాల‌ను చూసేద్దామా?!

ఇతర ఎలక్ట్రిక్ బైక్‌లకు గ‌ట్టి పోటీ..

ఓలా నుంచి రాబోతోన్న కొత్త‌ ఎలక్ట్రిక్ బైక్‌ను ఈ ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు సంస్థ‌ ధృవీకరించింది. అయితే, ఈ సంవత్సరం విక్రయానికి వస్తుందా లేదా అనేది అస్పష్టంగా ఉంది. జూలైలో ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ త‌మ‌ కంపెనీ 2025 సంవ‌త్స‌రం మొదటి ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విక్రయించడం ప్రారంభిస్తుందని వెల్లడించారు. ఇవి విడుద‌లైతే భారతీయ మార్కెట్లో ఇతర ఎలక్ట్రిక్ బైక్‌లకు గ‌ట్టిపోటీగా నిలబడుతుందని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. టోర్క్  క్రాటోస్ R, రివోల్ట్ RV400, ఆల్ట్రావయోలెట్ F77, Matter Aera లాంటి  వంటి EV మోటారు సైకిళ్లకు గ‌ట్టిపోటీ ఇవ్వ‌నుంది. సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటోలను ప‌రిశీలిస్తే.. ఓలా ఈ బైక్‌ను ట్రండీ స్పోర్ట్‌ లుక్‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు అర్థ‌మైపోతుంది. అలాగే, ఈ బైక్‌ స్ల్పిట్‌ సీట్‌ డిజైన్‌తో వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. బైక్‌లో సింగిల్‌ డిస్క్‌ బ్రేక్‌ సెటప్‌ను అందించ‌నున్న‌ట్లు భావించ‌వ‌చ్చు. డ్యూయల్-ఛానల్ ABSతో వస్తూ.. 17 ఇంచులతో కూడిన టైర్లను అమ‌ర్చ‌నున్నారు.

KTM- స్ట‌యిల్‌లో స్లిమ్ టర్న్..

గతంలో X (ట్విట్టర్)లో పోస్ట్ ద్వారా విడుద‌ల చేసిన‌ టీజర్‌ను బ‌ట్టీ.. కొత్త‌ Ola ఎలక్ట్రిక్ బైక్ దాని S1 ఎలక్ట్రిక్ స్కూటర్ మాదిరిగానే  ముందు భాగంలో డ్యూయల్-పాడ్ LED హెడ్‌ల్యాంప్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. పైభాగంలో హ‌రిజొంట‌ల్‌ LED స్ట్రిప్‌తోపాటు వెర్టిక‌ల్‌ స్ట్రిప్‌లు వంటి స‌రికొత్త ఫీచ‌ర్ల‌ను అందించ‌నున్నారు. అధికారికంగా తెలియ‌నప్ప‌టికీ, ఇవి టర్న్ ఇండికేటర్‌లుగా పనిచేస్తాయని భావిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం అగర్వాల్ షేర్ చేసిన బైక్ ఇమేజ్ ప్ర‌కారం.. ముందు, వెనుక వైపున KTM- స్ట‌యిల్‌లో స్లిమ్ టర్న్ ఇండికేట‌ర్‌ల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్న ఫోటోల‌ను ఆధారంగా చేసుకుని సంప్రదాయ సైడ్ అప్ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్‌ను కలిగి ఉంటుందని గుర్తించ‌వ‌చ్చు. అలాగే, ట్యూబులర్ ఫ్రేమ్‌తో కూడిన లార్జ్ బ్యాటరీతోపాటు చైన్ ఫైనల్ డ్రైవ్ వంటి అధ‌న‌పు ఫీచర్లను కూడా ప‌రిచ‌యం చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కూ బైక్‌ బ్యాటరీ, రేంజ్ లాంటి వాటి గురించిన ఎలాంటి అధికారిక స‌మాచారం కంపెనీ వెల్ల‌డించ‌లేదు. ఈ ఏడాది ఆగ‌స్టు 15న స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల‌ను తమిళనాడులోని ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో కంపెనీ నిర్వ‌హించ‌నుంది. ఈ మోడ‌ల్‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలుసుకోవాలంటే మాత్రం ఆగ‌స్టు 15 వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.
 
Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. లాంచ్‌కు ముందే EEC డేటాబేస్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన Vivo V50 సిరీస్, Vivo Y29 4G హ్యాండ్‌సెట్‌లు
  2. మూడు ఆక‌ర్ష‌ణీయ‌మైన రంగుల్లో Realme 14X డిసెంబర్‌లోనే సంద‌డి చేయ‌నుందా
  3. iQOO Neo 10 Pro నవంబర్ 29న చైనాలో గ్రాండ్‌గా విడుద‌ల‌వుతోంది.. అధిరిపోయే స్పెసిఫికేష‌న్స్‌..
  4. నవంబర్ 25 చైనా మార్కెట్‌లోకి గ్రాండ్‌గా Oppo Reno 13 సిరీస్ లాంచ్ కాబోతోంది.. కాన్ఫిగరేషన్స్‌ ఇవే..
  5. ఇండియాలో Vivo Y300 5G ఫోన్‌ లాంచ్ తేదీ ఇదే.. డిజైన్, క‌ల‌ర్స్ చూస్తే మ‌తిపోవాల్సిందే
  6. BSNL బంప‌ర్ ఆఫ‌ర్‌.. రూ.599 ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో 3GB అదనపు డేటాతోపాటు మ‌రెన్నో ప్రయోజనాలు
  7. BSNL వినియోగ‌దారుల‌కు గుడ్‌న్యూస్‌.. డైరెక్ట్-టు-డివైస్ శాటిలైట్ కనెక్టివిటీని DoT ప్రకటించింది
  8. OnePlus Ace 5 లాంచ్ టైమ్‌లైన్ ఇదే.. 6.78-అంగుళాల డిస్‌ప్లేతోపాటు మ‌రెన్నో ఫీచ‌ర్స్‌..
  9. 500 కంటే ఎక్కువ లైవ్‌ ఛానెల్‌లతో.. ఫైబర్ ఆధారిత ఇంట్రనెట్ టీవీ సేవలను ప్రారంభించన BSNL..
  10. త్వరలో భారత్ మార్కెట్‌లోకి Vivo X200 సిరీస్.. ధ‌ర ఎంతంటే..
© Copyright Red Pixels Ventures Limited 2024. All rights reserved.
Trending Products »
Latest Tech News »