Photo Credit: Ather Energy
ఇండియాలో 2025 Ather 450 సిరీస్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఈ బెంగళూరు ఆధారిత స్టార్టప్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ తాజా లైనప్ నుంచి మూడు వేరియంట్‌లను అందించింది. వాటిలో Ather 450, Ather 450X, Ather 450 అపెక్స్‌లు ఉన్నాయి. దేశీయ మార్కెట్‌లో అన్ని మోడల్‌లు ధరల పెరుగుదలకు కారణాలను కంపెనీ స్పష్టంగా వెల్లడించే ప్రయత్నం చేస్తోంది. మల్టీ-మోడ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, మ్యాజిక్ ట్విస్ట్ రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి అనేక అప్‌గ్రేడ్ ఫీచర్లతో అన్ని మోడళ్లలో స్టాండర్డ్‌గా వస్తున్నాయి. గత జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో పోల్చి చూస్తే ఇవి ఎక్కువ రేంజ్‌ను కలిగి ఉంటున్నాయి.
2025 Ather 450 సిరీస్ 450S మోడల్ ప్రారంభ ధర రూ.1,29,999 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. 2.9kWh, 3.7kWh వేరియంట్‌లలో 2025 Ather 450X రెండు బ్యాటరీ ప్యాక్‌లలో అందించబడుతోంది. వీటి ధర వరుసగా రూ. 1,46,999 (ఎక్స్-షోరూమ్), రూ. 1,56,999 (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. 2025 Ather 450 అపెక్స్ ధర ఇప్పుడు రూ. 1,99,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కొనుగోలు సమయంలో ప్రో ప్యాక్‌ని ఎంపిక చేసుకోవచ్చు. దీని ధర EV మోడల్ ఆధారంగా రూ. 14,001-రూ. 20,000 వరకూ ఉంటుంది.
సిరీస్‌లోని అన్ని మోడల్స్‌కు రెయిన్, ర్యాలీ, రోడ్ అనే మూడు ప్రత్యేక మోడ్‌ల టార్క్ ఇంటర్‌వెన్సన్‌ను అందిస్తుంది. రెయిన్ మోడ్‌లో తడి నేలలపై సురక్షితమైన రైడ్‌ను ఆస్వాదించవచ్చు. ర్యాలీ మోడ్ అత్యంత సూక్ష్మమైన ట్వీక్‌లను అందిస్తోంది. ఇది రైడర్ కఠినమైన లేదా అసమానమైన భూభాగాలను దాటేందుకు సహాయపడుతుంది. రోడ్ మోడ్, అత్యుత్తమ సులక్షిత ఎంపికగా చెప్పబడుతోంది. ఇది రోజువారీ రైడ్‌ల కోసం వేగంతోపాటు భద్రత సమతుల్యతను అందిస్తుంది.
ఈ సిరీస్ మ్యాజిక్ ట్విస్ట్ రీజెనరేటివ్ బ్రేకింగ్‌ను కూడా అందిస్తోంది. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒకే థొరెటల్‌తో నియంత్రించడానికి రైడర్‌లకు అవకాశం కల్పిస్తుంది. ప్రో ప్యాక్‌ని ఎంపిక చేసుకునేవారు కొత్త అథర్ స్టాక్‌ని పొందొచ్చు. ఇది వాట్సాప్ ఆన్ డాష్, షేర్ లైవ్ లొకేషన్, పింగ్ మై స్కూటర్, అలెక్సా స్కిల్స్ సహా ఆరు ఫీచర్స్‌ను అందిస్తోంది. స్టీల్త్ బ్లూ, హైపర్ శాండ్ అనే రెండు కొత్త కలర్‌వేలలో వస్తోంది.
2025 Ather 450 సిరీస్ గరిష్ట ఇండియన్ డ్రైవింగ్ సైకిల్ (IDC) రేంజ్ 122 కిలోమీటర్లు కాగా, 0-80 శాతం ఛార్జింగ్ సమయం 5 గంటల 30 నిమిషాలుగా ఉంది. Ather 450X IDC రేంజ్ 126 కిలోమీటర్లు ఉండగా, 3-గంటల ఛార్జింగ్ సమయాన్ని క్లెయిమ్ చేస్తోంది. 3.7kWh మోడల్ 4 గంటల 30 నిమిషాల ఛార్జింగ్ సమయంతో రేంజ్ 161 కిలోమీటర్లకు పెరుగుతోంది. టాప్-ఆఫ్-ది-లైన్ 2025 Ather 450 Apex IDC రేంజ్ 157 కిలోమీటర్లు, ఇది 0-100 శాతం ఛార్జింగ్ సమయాన్ని 5 గంటల 45 నిమిషాలు క్లెయిమ్ చేయబడింది.
ces_story_below_text
ప్రకటన
ప్రకటన