Huge discount on Apple MacBook 13: యాపిల్ సంస్థ మ్యాక్‌బుక్ నియో బేస్ మోడల్ (256GB స్టోరేజ్) అధికారిక లాంచ్ ధరను రూ.69,900గా నిర్ణయించింది
Photo Credit: Apple
MacBook Neo
Huge Discount on Apple MacBook 13 in Amazon: యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ వాటి ధరలు ఆకాశంలో ఉండటం వల్ల చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. అయితే ఈ ఏడాది మార్చి నెలలో యాపిల్ కంపెనీ తన లైనప్‌లోనే అత్యంత చౌకైన 13 ఇంచుల మ్యాక్‌బుక్ నియోను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. లాంచ్ అయిన కొద్ది నెలల్లోనే ఈ బడ్జెట్ మ్యాక్‌బుక్ పై ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో అదిరిపోయే డిస్కౌంట్ డీల్ ప్రత్యక్షమైంది. ప్రీమియం ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి ఇది ఒక పర్‌ఫెక్ట్ టైమ్ అని చెప్పవచ్చు.
ధరల వివరాలు, అమెజాన్ క్రేజీ డీల్..
యాపిల్ సంస్థ మ్యాక్‌బుక్ నియో బేస్ మోడల్ (256GB స్టోరేజ్) అధికారిక లాంచ్ ధరను రూ.69,900గా నిర్ణయించింది. అలాగే దీని 512GB మోడల్ ధర రూ.79,900 గా ఉంది. అయితే ప్రస్తుతం అమెజాన్ ఇండియా సేల్‌లో భాగంగా మ్యాక్‌బుక్ నియో 256GB స్టోరేజ్ (సిల్వర్ కలర్) వేరియంట్ ఏకంగా రూ.5,910 తగ్గింపుతో రూ.63,990కే లిస్ట్ అయింది. దీనికి తోడు ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించి పేమెంట్ చేస్తే కస్టమర్లకు మరో రూ.4,000 ఫ్లాట్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనివల్ల ఈ ల్యాప్‌టాప్ ఎఫెక్టివ్ ధర కేవలం రూ.59,990 కి తగ్గిపోతుంది. ఇతర కలర్ వేరియంట్లు మాత్రం ఒకటి నుంచి రెండు వేల రూపాయలు ఎక్కువ ధరకు లభిస్తున్నాయి.
మెరిసిపోయే డిజైన్, డిస్ ప్లే క్వాలిటీ..
డిజైన్ విషయానికి వస్తే, మ్యాక్‌బుక్ నియో బేస్ మోడల్ అయినప్పటికీ ప్రీమియం అల్యూమినియం బాడీ, రౌండెడ్ కార్నర్ల డిజైన్‌తో చాలా క్లాసిక్‌గా కనిపిస్తుంది. దీని బరువు కేవలం 1.23 కిలోలు మాత్రమే ఉండటం వల్ల ట్రావెలింగ్ లో సులభంగా క్యారీ చేయవచ్చు. ఇందులో 13 ఇంచుల లిక్విడ్ రెటినా అద్భుతమైన డిస్‌ప్లేను అందించారు. ఇది 2408×1506 పిక్సెల్స్ రిజల్యూషన్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 1 బిలియన్ కలర్ సపోర్ట్, స్క్రీన్‌పై వెలుతురు పడినా స్పష్టంగా కనిపించేలా యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్‌తో వస్తుంది.
ఏ18 ప్రో చిప్‌సెట్ పవర్, ఏఐ ఫీచర్లు..
పర్ఫార్మెన్స్ పరంగా ఈ ల్యాప్‌టాప్ ఏమాత్రం తక్కువ కాదు. ఇందులో యాపిల్ పవర్‌ఫుల్ A18 Pro చిప్‌ను అమర్చారు. ఇందులో 6 కోర్ సీపీయూ, 5 కోర్ జీపీయూ, 16 కోర్ల పవర్‌ఫుల్ న్యూరల్ ఇంజిన్ ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్ వెబ్ బ్రౌజింగ్ వంటి సాధారణ పనుల్లో ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్ కలిగిన విండోస్ ల్యాప్‌టాప్‌ల కంటే ఏకంగా 50 శాతం వేగంగా పనిచేస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. అంతేకాకుండా ఆన్-డివైస్ ఏఐ పనుల్లో మూడు రెట్లు, ఫోటో ఎడిటింగ్ లో రెండింతల వేగవంతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది ఫ్యాన్‌లెస్ డిజైన్‌తో రావడం వల్ల ఎంత హెవీగా వాడినా అస్సలు శబ్దం రాదు.
మెమొరీ, కీబోర్డ్, సెక్యూరిటీ ఫీచర్లు..
ఈ ల్యాప్‌టాప్‌లో 8GB యూనిఫైడ్ మెమొరీతో పాటు 256GB, 512GB ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్ ఆప్షన్లు లభిస్తాయి. ఇందులో టైపింగ్ సులభంగా ఉండేలా మ్యాజిక్ కీబోర్డ్, పెద్ద మల్టీ-టచ్ ఫోర్స్ టచ్ ట్రాక్‌ప్యాడ్‌ను అందించారు. దీని 512GB టాప్ వేరియంట్‌లో బయోమెట్రిక్ అథెంటికేషన్, సురక్షితమైన ఆన్‌లైన్ పేమెంట్ల కోసం టచ్ ఐడీ సపోర్ట్‌ను కూడా కంపెనీ జోడించింది.
Oppo Reno 16 Pro : జులై 2న ఇండియాలో గ్రాండ్ ఎంట్రీ.. ఒప్పో రెనో 16 సిరీస్ స్పెసిఫికేషన్ల లీక్
కెమెరా, ఆడియో, కనెక్టివిటీ ఆప్షన్లు..
మ్యాక్‌బుక్ నియోలో వీడియో కాల్స్ కోసం అడ్వాన్స్డ్ ఇమేజ్ ప్రాసెసింగ్ కలిగిన 1080p ఫేస్‌టైమ్ హెచ్‌డీ కెమెరాను అమర్చారు. ఆడియో రికార్డింగ్ కోసం బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ తగ్గించేలా డైరెక్షనల్ బీమ్‌ఫార్మింగ్ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ మైక్రోఫోన్ సెటప్ ఉంది. అలాగే థియేటర్ లాంటి సౌండ్ కోసం స్పేషియల్ ఆడియో, డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేసే డ్యూయల్ సైడ్-ఫైరింగ్ స్పీకర్లు ఇందులో ఉన్నాయి. కనెక్టివిటీ కోసం రెండు యూఎస్‌బీ-సి పోర్టులు, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, వై-ఫై 6E, బ్లూటూత్ 6 సపోర్ట్ లభిస్తాయి.
కొండలాంటి బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్..
బ్యాటరీ పరంగా మ్యాక్‌బుక్ నియో కస్టమర్లకు షాకింగ్ బ్యాకప్ ఇస్తుంది. ఇందులో 36.5Wh లిథియం పాలిమర్ బ్యాటరీని అమర్చారు. యాపిల్ అధికారిక లెక్కల ప్రకారం.. ఈ ల్యాప్‌టాప్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 16 గంటల పాటు నాన్-స్టాప్ వీడియో స్ట్రీమింగ్ లేదా 11 గంటల పాటు వైర్‌లెస్ వెబ్ బ్రౌజింగ్ బ్యాకప్‌ను సులభంగా అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌తో పాటు బాక్స్‌లోనే 20W యూఎస్‌బీ-సి పవర్ అడాప్టర్‌ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Amazon Bee Frontier, Bee Eclipse AI Devices Launched: Price, Specifications