ఇటీవలే బిఎస్ఎన్ఎల్ దేశంలో 4జీ సేవలను అధికారికంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
BSNL
BSNL: దేశీయ టెలికాం రంగంలో తీవ్ర పోటీని తట్టుకుని నిలబడేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ విస్తరణపై దృష్టి సారించింది. గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈ సంస్థ, కస్టమర్లను ఆకట్టుకునేందుకు రాబోయే ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ. 77,000 కోట్ల భారీ మూలధన వ్యయం (CAPEX) చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నెట్‌వర్క్ పరిధిని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు మరో రెండు లక్షల కొత్త 4జీ టవర్లను ఏర్పాటు చేయబోతోంది. ప్రైవేట్ దిగ్గజాలు జియో, ఎయిర్‌టెల్‌లకు సవాలు విసురుతూ, కస్టమర్లకు మెరుగైన నెట్‌వర్క్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ సంస్థ ముందుకు సాగుతోంది.
రెండు లక్షల అదనపు టవర్ల ఏర్పాటు
ఇటీవలే బిఎస్ఎన్ఎల్ దేశంలో 4జీ సేవలను అధికారికంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికోసం ఇప్పటికే సుమారు లక్ష వరకు 4జీ సైట్లను విజయవంతంగా ఏర్పాటు చేసింది. నెట్‌వర్క్ స్పీడ్, క్వాలిటీని మరింత పెంచేందుకు అదనంగా మరో రెండు లక్షల 4జీ సైట్లను నెలకొల్పేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం కోరనుంది. పార్లమెంటరీ ఐటీ కమిటీకి ఇచ్చిన నివేదికలో టెలికాం శాఖ ఈ ఆసక్తికరమైన వివరాలను వెల్లడించింది. జియో, ఎయిర్‌టెల్ సంస్థలతో పోలిస్తే బిఎస్ఎన్ఎల్ యూజర్ల సగటు రాబడి (ARPU) తక్కువగా ఉన్నప్పటికీ, నెట్‌వర్క్ విస్తరణ ద్వారా దాన్ని గణనీయంగా పెంచుకోవచ్చని కంపెనీ ఆశిస్తోంది.
Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
పెరిగిన ఆదాయం.. పుంజుకున్న ఎఆర్పియు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బిఎస్ఎన్ఎల్ ఆర్థిక ప్రదర్శన ఆశాజనకంగా సాగింది. కంపెనీ ఆదాయం దాదాపు 10 శాతం పెరిగి రూ.4,418 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే సమయంలో ఆదాయం రూ. 4,017 కోట్లుగా నమోదైంది. కన్స్యూమర్ మొబిలిటీ, ఎంటర్‌ప్రైజ్ బిజినెస్ విభాగాల నుంచి మంచి వృద్ధి లభించిందని టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. కంపెనీ ఆదాయంలో సుమారు రూ.400 కోట్లకు పైగా నికర వృద్ధి కనిపించడం విశేషం. ఇదే సమయంలో యూజర్ల ద్వారా వచ్చే సగటు నెలవారీ రాబడి (ARPU) కూడా రూ.102.7 కి చేరుకుంది.
క్లౌడ్ ఆధారిత 4జీ.. సులువుగా 5జీకి అప్‌గ్రేడ్
ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ సంస్థను ఆధునీకరించడంతో పాటు డిజిటల్ సేవలను గ్రామీణ ప్రాంతాల వరకు వేగంగా తీసుకెళ్లేందుకు చర్యలు వేగవంతం చేసింది. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేసిన 4జీ నెట్‌వర్క్ డిజైన్ పూర్తి క్లౌడ్ ప్రాతిపదికన నిర్మించబడింది. దీనిని చాలా సులువుగా 5జీ నెట్‌వర్క్‌గా మార్చుకునే సదుపాయం ఉంది. ఇప్పటికే 5జీ సేవలకు సంబంధించిన క్షేత్రస్థాయి పరీక్షలను కంపెనీ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సేవలను క్యూ-5జీ పేరుతో త్వరలోనే అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికే 5జీని వేగంగా విస్తరించిన నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ కూడా పోటీలోకి రావడం ఉత్కంఠ రేపుతోంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
God of War Laufey Pre-Orders Begin September 29; Digital Deluxe Edition, New Combat Details Revealed
Ai+ Pulse 2 FE Launched in India Alongside Ai+ NovaTab, Nova LapTab 5G Tablets: Price, Specifications