ఒప్పో ఫైండ్ X9s (12GB RAM + 256GB Storage) వేరియంట్ లాంచ్ సమయం ఎంఆర్పీ రూ. 1,59,999గా ఉంది.
Photo Credit: Oppo
Oppo Find X9s
Oppo Find X9s: ప్రీమియం ఫీచర్లు, అద్భుతమైన కెమెరా పర్ఫార్మెన్స్తో లభించే ఒప్పో ఫైండ్ X9s స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అత్యంత చౌకైన ధరలో అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ వేదికగా ఈ ఫోన్‌పై కంపెనీ ఏకంగా రూ. 60,000 వరకు నేరుగా డిస్కౌంట్ అందిస్తోంది. ఈ బంపర్ ఆఫర్‌కి తోడు బ్యాంక్ డిస్కౌంట్లు కూడా జతకావడంతో టెక్ ప్రియులు ఈ హ్యాండ్‌సెట్‌ను సొంతం చేసుకునేందుకు పోటీపడుతున్నారు.
ఎంఆర్పీపై ఏకంగా 44 శాతం తగ్గింపు
ఒప్పో ఫైండ్ X9s (12GB RAM + 256GB Storage) వేరియంట్ లాంచ్ సమయం ఎంఆర్పీ రూ. 1,59,999గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ సేల్‌లో ఏకంగా 44 శాతం డిస్కౌంట్‌తో ఈ హ్యాండ్‌సెట్‌ను రూ. 89,999 లకే లిస్ట్ చేశారు. దీనికి అదనంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులకు రూ. 4,500 వరకు అదనపు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ప్రీమియం ఫ్లాగ్షిప్ డివైజ్ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత తక్కువ ధరకు సొంతమవుతోంది.
50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాల జాతర
ఫోటోగ్రఫీ ఆసక్తి ఉన్నవారిని ఈ ఫోన్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో), 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్ అందించే 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాని అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందర 32MP హై-రిజల్యూషన్ కెమెరా ఇచ్చారు. ధూళి, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ66, ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లతో రావడం విశేషం.
BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
7025mAh భారీ బ్యాటరీ.. అద్భుత డిస్ప్లే
ఈ స్మార్ట్‌ఫోన్ 6.59-ఇంచీల అమోలెడ్ (AMOLED) డిస్ప్లేతో వస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ఓఎస్ 16 పై పనిచేసే ఈ ఫోన్లో ఇన్-డిస్ప్లే 3D ఆల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ముఖ్యంగా ఇందులో అమర్చిన 7025mAh భారీ బ్యాటరీ 80W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Galaxy S27 Ultra Camera Processing May Change From Galaxy S26 Ultra; Might Drop Dedicated 3X Telephoto Lens
Noise Homestage Soundbar Series Launched in India With Dolby Atmos, Up to 700W Output: Price, Features