Apple : యాపిల్ హిస్టరీలోనే మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్.. ఐఓఎస్ 27తో ఐఫోన్ల రూపమే మారిపోనుంది

యాపిల్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న నెక్స్ట్ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ iOS 27కు సంబంధించిన లీకులు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

Apple : యాపిల్ హిస్టరీలోనే మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్.. ఐఓఎస్ 27తో ఐఫోన్ల రూపమే మారిపోనుంది

Apple may unveil iOS 27 at WWDC on June 8

ముఖ్యాంశాలు
  • యాపిల్ తన రాబోయే ఐఓఎస్ 27 అప్‌డేట్‌లో కెమెరా యాప్ కస్టమైజేషన్
  • సరికొత్త ఏఐ సిరి యాప్, విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు
  • జూన్ 8న రాబోతున్న ‘iOS 27’.. కెమెరా యాప్ లో ఊహించని నయా ఫీచర్లు.
ప్రకటన

Apple : ఐఫోన్ యూజర్లకు యాపిల్ సంస్థ సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతోంది. యాపిల్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న నెక్స్ట్ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ iOS 27కు సంబంధించిన లీకులు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. బ్లూమ్‌బర్గ్ తాజా నివేదిక ప్రకారం.. ఈసారి రాబోయే అప్‌డేట్ కేవలం నార్మల్ యూజర్లకే కాకుండా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లకు సైతం మైండ్ బ్లోయింగ్ ఫీచర్లను తీసుకురాబోతోంది. పూర్తిగా రీడిజైన్ చేసిన కెమెరా యాప్, చాట్‌బాట్ లాంటి సరికొత్త Siri, సరికొత్త లిక్విడ్ గ్లాస్ డిజైన్ లాంగ్వేజ్‌తో ఈ అప్‌డేట్ రానుంది. జూన్ 8న జరగబోయే యాపిల్ WWDC 2026 ఈవెంట్‌లో దీనిని అధికారికంగా ప్రదర్శించనున్నారు.

మన నచ్చినట్లు కెమెరా యాప్ డిజైన్..  
ఐఓఎస్ 27 లో రాబోతున్న అత్యంత పెద్ద మార్పు.. పూర్తిగా కస్టమైజ్ చేసుకోగలిగే కెమెరా యాప్ .
* మన చేతుల్లోనే కంట్రోల్స్: ఇప్పటివరకు కెమెరా స్క్రీన్‌పై ఫ్లాష్, లైవ్ ఫోటోస్, నైట్ మోడ్ వంటి ఆప్షన్లు ఎక్కడ ఉండాలో యాపిల్ డిసైడ్ చేసేది. కానీ ఇకపై యూజర్లు తమకు నచ్చిన కంట్రోల్స్ (ఎక్స్‌పోజర్, డెప్త్ ఆఫ్ ఫీల్డ్, టైమర్) మాత్రమే స్క్రీన్‌పై ఉంచుకుని, వాటి స్థానాన్ని కూడా మార్చుకోవచ్చు.
* కెమెరాలోనే సిరి మోడ్: నార్మల్ ఫోటో, వీడియో మోడ్‌ల లాగే కెమెరా యాప్‌లో ప్రత్యేకంగా ఒక  Siri Mode రాబోతోంది. ఇది విజువల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తుంది. దీని ద్వారా కెమెరాను ఏదైనా వస్తువు వైపు చూపిస్తే చాలు.. అది ఏంటో గుర్తుపట్టడం, ఫుడ్ ఐటమ్స్ ప్యాకెట్లపై ఉన్న న్యూట్రిషన్ లేబుళ్లను స్కాన్ చేసి క్యాలరీలను ట్రాక్ చేయడం, బిజినెస్ కార్డుల నుండి నంబర్లను డైరెక్ట్‌గా కాంటాక్ట్స్‌లో సేవ్ చేయడం వంటివి ఈజీగా చేయవచ్చు.

ఓపెన్ ఐ చాట్‌బాట్ లా మారనున్న సిరి ..  
యాపిల్ వాయిస్ అసిస్టెంట్ Siri ఈ అప్‌డేట్‌తో పూర్తి స్థాయి ఏఐ చాట్‌బాట్లా రూపాంతరం చెందనుంది.
* డైనమిక్ ఐలాండ్ లోకి ఎంట్రీ: ఇకపై సిరిని ఆన్ చేయగానే స్క్రీన్ కింద కాకుండా.. పైభాగంలో ఉన్న డైనమిక్ ఐలాండ్  చుట్టూ ఒక పెద్ద పిల్-షేప్డ్ యానిమేషన్‌తో ప్రత్యక్షమవుతుంది. స్క్రీన్‌ను పైనుంచి కిందకు స్వైప్ చేయగానే సరికొత్త Search or Ask బార్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ గూగుల్ జెమిని, చాట్‌జీపీటీల సహాయంతో ఏఐ సమాధానాలు పొందవచ్చు.
* హిస్టరీ సేవ్ అయ్యేలా సిరి యాప్ : ఐఫోన్ హిస్టరీలోనే మొదటిసారిగా సిరి కోసం ఒక డెడికేటెడ్ అప్లికేషన్‌ను యాపిల్ లాంచ్ చేయబోతోంది. ఇందులో ఐమెసేజ్ తరహాలో పాత చాట్ హిస్టరీ మొత్తం కనిపిస్తుంది. అలాగే ఇమేజ్ లేదా డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి సిరి ద్వారా వాటి సమ్మరీని సులభంగా తెలుసుకోవచ్చు.

సఫారీ, వెదర్ యాప్స్ సరికొత్తగా..  
సిరి, కెమెరాతో పాటు ఐఫోన్‌లోని ఇన్-బిల్ట్ యాప్స్ అన్నీ సరికొత్త లుక్‌తో అప్‌గ్రేడ్ కానున్నాయి. సఫారీ బ్రౌజర్లో ఫేవరెట్స్, బుక్‌మార్క్స్, రీడింగ్ లిస్ట్, బ్రౌజింగ్ హిస్టరీ కోసం హోమ్ పేజీలోనే నాలుగు విభిన్న ట్యాబ్‌లు రానున్నాయి. అలాగే వెదర్ యాప్ లో వర్షం, గాలి తీవ్రతను వేరే స్క్రీన్ ఓపెన్ చేయకుండానే మెయిన్ పేజీలోని కండిషన్స్ సెక్షన్‌లోనే చూసేయవచ్చు. ఇంకా ఇమేజ్ ప్లేగ్రౌండ్ యాప్‌లో మరింత రియలిస్టిక్ ఏఐ ఫోటో జనరేషన్ టూల్స్ రాబోతున్నాయి. అన్నిటికంటే క్రేజీ ఫీచర్ ఏంటంటే.. హోమ్ స్క్రీన్‌పై యాప్స్ లేదా విడ్జెట్స్ స్థానాన్ని మార్చేటప్పుడు తప్పు జరిగితే, మళ్లీ పాత స్థానానికి తెచ్చేలా Undo, Redo బటన్లను ఇస్తున్నారు.

యాపిల్ వాచ్, మ్యాక్ బుక్ లకూ కొత్త అప్‌డేట్స్..  
జూన్ 8 నుంచి జూన్ 12 వరకు జరగబోయే WWDC 2026 ఈవెంట్‌లో ఐఓఎస్ 27తో పాటు ఐపాడ్ ఓఎస్ 27, వాచ్ ఓఎస్ 27, మ్యాక్ ఓఎస్ 27, విజన్ ఓఎస్ 27లను కూడా యాపిల్ ఆవిష్కరించనుంది. మ్యాక్ ఓఎస్‌లో టెక్స్ట్ రీడబిలిటీని మెరుగుపరుస్తూ పాత ట్రాన్స్‌పరెన్సీ ఎఫెక్ట్లను తగ్గించనున్నారు. జూన్ 8న అనౌన్స్ చేసిన వెంటనే డెవలపర్ బీటా వెర్షన్ రిలీజ్ అవుతుంది. జూలైలో పబ్లిక్ బీటా, ఆ తర్వాత సరికొత్త ఐఫోన్ 18 సిరీస్ లాంచ్‌తో పాటు సెప్టెంబర్ 2026 లో ఐఫోన్ 11 మరియు ఆపై మోడల్స్ ఉన్న యూజర్లందరికీ ఈ ఐఓఎస్ 27 స్థిరమైన అప్‌డేట్ అందుబాటులోకి రానుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »